Monday 15 August 2022

 ఒక్క పొలిసు కేసు కూడా లేని గ్రామం

                                    ఆ కేసును కూడా కొట్టేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. 


ఈరోజుల్లో పోలీసు కేసు అనేది చాలా సర్వసాధారణమైంది. చీటికిమాటికి కూడా కేసులు పెట్టుకుండే కాలంలో ఆ ఊర్లో ఇంత వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదంట. నమ్మరా..? ఒక కేసు అయిందిలే అది కూడా రాజీ అయిపోంది అనుకోండి. ఇప్పుడయితే ఒక్క కేసు కూడా లేని గ్రామంగా ఆ ఊరు రికార్డులోకి ఎక్కింది. ఆ ఊరి చరిత్ర తెలుసుకున్న జడ్జి నేరుగా ఆ ఊరికే వెళ్లి అక్కడి గ్రామ పెద్దతో పాటు.. గ్రామస్తులు అందర్నీ అభినందించారు.

కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం ర్యాగట్లపల్లి గ్రామం రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా నిలిచింది. ఒక్క కేసు

 కూడా లేని గ్రామంగా గుర్తింపు పొందింది. ఈ మాటలను నేరుగా కామారెడ్డి జిల్లా జడ్జి శ్రీదేవి అన్నారు.

 స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆ గ్రామానికి వచ్చిన ఆమె జాతీయ జెండా ఆవిష్కరించారు. కేసులు లేని

 గ్రామంగా ర్యాగట్లపల్లి నిలిచిందని అభినందించారు.


గ్రామానికి చెందిన ఏకైన కేసుకు సంబంధించి ఇరువర్గాల వారు రాజీపడటంతో.. ఆ కేసును కూడా

 కొట్టేస్తున్నట్లు జడ్జి ప్రకటించారు. రోడ్డు ప్రమాదం కేసులో ఇరువర్గాలు రాజీపడి తమకు తామే తీర్పు

 ఇచ్చుకోవడం సంతోషకరమన్నారు. దీన్ని రికార్డులో నమోదు చేసి భద్రపరుస్తామన్నారు. 40 ఏళ్లుగా గ్రామంలో

 ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తున్న గ్రామ పెద్ద నాగన్నగారి సిద్ధరాంరెడ్డిని జడ్జి ఈ సందర్భంగా

 సన్మానించారు.

 

 

      యువ కళాకారుడి  ప్రతిభ.

 

ప్రతి ఒక్కరిలో దేశభక్తి పొంగిపొర్లింది.  స్వాతంత్ర్య సమర యోధుల జీవితాలను గుర్తుకు చేసుకుంటూ.. సలామ్ చేశాం.  భారత దేశ గొప్పతనం ప్రపంచ నలుమూలలా తెలిసేలా సంబరాలు అంబరాన్ని అంటేలా జరుపుకుంటున్నాం. పూర్ణ స్వరాజ్యం కల నెరవేరి 75 ఏళ్లు కావొస్తుంది. దీనికి గుర్తింపుగా `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్` జరుపుకున్నాం. హర్ ఘర్ మే తిరంగా వెలిగిపోయింది. ఎవరికి తోచిన రీతిలో వారు తమ భక్తిని చాటుకుంటున్నారు.

భారతదేశ వ్యాప్తంగా 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ రాజధాని  ఎర్రకోటపై ప్రధాన మంత్రి  జాతీయ జండాను ఆవిష్కరించారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మువ్వన్నెలు రెప రెపలు మిరమిట్లు గొలుపుతున్నాయి. కళాకారులు అయితే ఎవరికి తోచిన రీతిలో వారు తమ ప్రతిభను చూపెడుతూ చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువ కళాకారుడు చేసిన ప్రయత్నం అందరి మన్ననలు అందుకునే లా చేస్తోంది. కేవలం ఉప్పుతో గ్లోబ్ పై భారత మాత బొమ్మ గీసి.. రంగులద్దాడు.. ఈ చిత్ర చూసినవారంతా ఆ కళాకారుడి ప్రతిభకు సలామ్ అంటున్నారు.

ఇలాంటి బొమ్మలు గీయడం అతడికి ఇదే తొలిసారి కాదు.. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేశాడు. చిత్తూరు జిల్లాలోని కుప్పానిక ిచెందిన ఈ కళాకారుడు.. పూరి  ఆర్ట్స్ పేరుతో.. సమాజాన్ని చైతన్య పరిచేలా ఆయన పెయింట్స్ ఉంటున్నాయి. ఇటీవల ఉప్పుతోనే తిరుమల వెంకటేశ్వరుడి బొమ్మ గీసి.. దానికి రంగులు అద్ది.. గోవిందుడి రూపాన్ని ఆవిష్కరించారు.. అతడు గీసిని శ్రీనివాసుడి

 ముఖ చిత్రం అద్భుతంగా ఉంది. పూరి ఆర్ట్స్ పేరుతో యువకుడు పలు చిత్రాలు రూపొందిస్తూ..

 పలువురి మన్ననలు పొందుతున్నాడు. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ తో సత్తా చాటిన పీవీ సింధు బొమ్మను సైతం అట్టముక్కలతో అద్భుతంగా రూపొందించాడు. భారత దేశానికి సంబంధించి ఏ ఘనత వెలుగులోకి వచ్చినా... వెంటనే తన మైండ్ కు పదును పెట్టి.. అద్భుతాలు చేస్తున్నాడు మన పెయింటర్.. గతంలోనూ పలువురి నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

అవినీతి రహిత సమాజం రావాల్సిన అవసరం ఉంది

 యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ కేంద్ర కార్యాల‌యంలో స్వతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించారు. యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ పౌండ‌ర్ రాజేంద్ర జెండా ఆవిష్క‌ర‌ణ చేశారు. అనంత‌రం వారు మాట్లాడుతూ ఎంతోమంది వీరులు, మ‌హానీయుల త్యాగ‌ఫ‌లిత‌మే 75 సంవ‌త్స‌రాల స్వ‌తంత్య్ర భార‌తావ‌నికి ప్ర‌ధాన కార‌ణ‌మన్నారు. నేటి త‌రం యువ‌త వారి అడుగుజాడ‌ల్లో న‌డుస్తూ ముందుకెళ్లాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు. అవినీతి ర‌హిత స‌మాజం కోసం యూత్ ప‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ వినూత్న కార్య‌క్ర‌మాలు చేస్తుంద‌ని, అందులో భాగంగానే నిజాయితీప‌రుల‌కు అండ‌గా ఉండేందుకు ముంద‌డుగు ప్రారంభించింద‌న్నారు. మంచి స‌మాజం కోసం వినూత్న కార్య‌క్ర‌మాల‌తో యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సంస్థ ముందడుగు వేస్తుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో యూత్ ఫ‌ర్ యాంటీ క‌ర‌ప్ష‌న్ సీనియ‌ర్ నాయ‌కులు కొన్నె దేవేంద‌ర్‌, కానుగంటి రాజు, కొమ‌టి ర‌మేష్‌బాబు, మూడావ‌త్ ర‌మేష్‌నాయ‌క్‌, జి. హ‌రిప్ర‌కాశ్‌, అంజుక‌ర్‌, సాయి, నాగేంద్ర‌, న‌రేష్‌, స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.



               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...