Wednesday 28 December 2022

   

మొదటి వితంతు వివాహం  జరిగింది ఎక్కడో కాదు కందుకూరి వీరేశలింగం గారి ఇల్లే!



ప్రస్తుత రోజుల్లో వితంతు వివాహాలు అంటే సర్వసాధనంగా మారిపోవడం జరిగింది.కానీ ఒకప్పటి రోజుల్లో వితంతువు అంటే ఏదో దరిద్రాన్ని చూసినట్లు చూసేవారు

డిసెంబర్ 11. 1881 లో సుప్రసిద్ధ సంఘసంస్కర్త కందుకూరి వీరేశలింగం గారు మొదటిసారిగా వితంతు వివాహం జరిపారు.అయితే దాన్ని జరిపించడం కోసం ఆయన పడిన కష్టాలు ఎదుర్కొన్న అవమానాలు చాలానే ఉన్నాయి.

అయినప్పటికీ వంటి చేత్తో ఆ పెళ్లి జరిపించి మూఢాచారాలను తెలుగు వారిలో దూరం చేయడానికి మొదటి అడుగున వేశారు.బెంగాల్లో వితంతు వివాహం జరిగిన దక్షిణాదిలో మాత్రం చందాసం ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఆ రోజులలో చిన్న వయసులోనే ముసలి వాళ్లకి భార్యలుగా వెళ్లిన వాళ్లు చనిపోయాక వితంతులుగా ఆడపిల్లలు నరకం చూస్తున్నారు.అప్పుడు ఈ సాంఘిక దురాచారానికి అడ్డుకట్ట వేయాలని కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలోని తన స్వగృహంలో 1881 డిసెంబర్ 11వ తేదీన బాల వితంతువు గౌరమ్మ, గూగులమూడి శ్రీరాములు అనే వ్యక్తికి పెళ్లి జరిపించారు.

ఈ వివాహం గురించి విని వారిపై ఎక్కడ దాడి చేస్తారో అని మండపానికి పెళ్లికూతురుని, పెళ్లి కొడుకుని రహస్యంగా తీసుకొచ్చారని కందుకూరి వీరేశలింగం గారు రచనలలో పేర్కొన్నారు.

అంతే కాకుండా ఆ వివాహానికి ఎవరూ వెళ్ళరాదని వెళితే వారిని ఊరి నుంచి వెలివెస్తమని చెందాసులు పిలుపు ఇవ్వడంతో వీరేశలింగం దంపతులే గోదావరి నుండి నీటిని మోసారు.వంట కూడా ఆయన సతీమణి రాజ్యలక్ష్మి చేయగా కందుకూరి వీరేశలింగం శిష్యులు, విద్యార్థుల్లో కొంతమంది వారికి అండగా నిలిచారు.ఈ చరిత్రత్మక ఘటన జరిగిన కందుకూరి ఇల్లు ఈ రోజు రాజమండ్రిలో ఒక సందర్శన స్థలంగా మారిపోయి ఉంది.

అక్కడికి సందర్శకులు వచ్చి మొదటి వితంతు వివాహం జరిగిన ప్రదేశాన్ని చూసి వెళుతుంటారు.తన జీవితకాలంలో దాదాపు 40 వితంతు వివాహాలు జరిపించారు మన కందుకూరి వీరేశలింగం గారు.

 

మహా అన్నదాన కార్యక్రమం. కామధేనువు సేవాసమితి అద్వర్యంలో

 మహా అన్నదాన కార్యక్రమం. కామధేనువు సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీహనుమాన్ దేవాలయం  సనత్ నగర్  హైదరాబాద్ , ప్రాంగణంలో ఉన్న గోశాల నందు.. కుబేరుడు అన...