Monday 5 September 2022

 

తెలంగాణ‌లో బీజేపీ గ్రాఫ్‌ను పెంచుతున్న కేసీఆర్!!?



వినటానికి విడ్డురంగా ఉన్న ఇది నిజమే అనిపిస్తుంది, ఈ మధ్య కాలంలో కేసీఆర్ మాటలు జాగర్తగా గమనించినట్టయితే..తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బీజేపీ ట్రాప్‌లో ప‌డి ఏదేదో మాట్లాడుతున్నారా? అంటే ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. బీజేపీతో యుద్ధం అంటూ అన‌వ‌స‌ర బాధ్య‌త‌ను త‌న‌కు తానుగా నెత్తికెత్తుకున్నార‌నే భావ‌న చాలా మందిలో వుంది. తెలంగాణ‌లో బీజేపీ గ్రాఫ్‌ను కేసీఆరే పెంచుతున్నార‌నే వాద‌న‌లో నిజం ఉంద‌నిపిస్తోంది. కాంగ్రెస్‌ను ఖ‌తం చేసి, అందుకు త‌గ్గ మూల్యాన్ని కేసీఆర్ చెల్లించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

జాతీయ రాజ‌కీయాలంటూ కేసీఆర్ గ‌త కొన్ని నెల‌లుగా కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. తెలంగాణ‌లో బీజేపీ దూకుడును అడ్డుకోవ‌డ‌మే పెద్ద స‌వాల్‌గా మారిన త‌రుణంలో, జాతీయ‌స్థాయిలో ఆ పార్టీని ఎదుర్కోవ‌డంపై సాధ్యాసాధ్యాల‌ను కేసీఆర్ ఆలోచించ‌క‌పోవ‌డం వ‌డ్డూరంగా ఉంది. నిజామాబాద్ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ మాట‌లు వింటే... ఈయ‌న‌కు ఏమైంది? అనే అనుమానం క‌లుగుతుంది.

ఢిల్లీ గద్దెపై మన ప్రభుత్వమే రానుంది. కేంద్రంలో 2024 ఎన్నికల తర్వాత బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కానుంది. వచ్చే ఎన్నికల తర్వాత కేంద్రంలో మన ప్రభుత్వం ఏర్పాటైతే దేశవ్యాప్తంగా రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్‌ ఇస్తాం. తెలంగాణ పథకాలన్నింటినీ అమలు చేస్తాంఅని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

సంతలో పశువులను కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారు. ప్రభుత్వాలను కూలగొట్టేందుకే మోదీ ప్రాధాన్యమిస్తున్నారుఅని కేసీఆర్ మండిపడ్డారు. జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లాల‌నే కోరిక‌ను ఎవరూ కాద‌న‌లేరు. అయితే అందుకు త‌గ్గ రాజ‌కీయ ప‌రిస్థితులు త‌న‌కు ఎంత వ‌ర‌కు అనుకూలంగా ఉన్నాయో కేసీఆర్ ఆలోచించారా? తెలుగు రాష్ట్రాల్లోనే కేసీఆర్‌ను ఎవ‌రూ న‌మ్మ‌లేని ప‌రిస్థితి. రాజ‌కీయ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు కేసీఆర్ ఊస‌ర‌వెల్లిలా రంగులు మారుస్తుంటార‌నే పేరు ఆయ‌న‌కు ఉంది.

బీజేపీ ముక్త్‌ భారత్‌ సాధన సంగ‌తేమో గానీ, టీఆర్ఎస్ ముక్త తెలంగాణ అంటూ వ‌స్తున్న మోదీ, అమిత్‌షాల‌ను ఎలా ఎదుర్కోవాలో కేసీఆర్ ఆలోచిస్తే మంచిది. మ‌రోసారి తెలంగాణలో ప్రజలు ఆశీర్వదించేలా నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు ముంచుకొస్తున్నాయి. అంత‌కంటే ముందు మునుగోడు ఉప ఎన్నిక రూపంలో బీజేపీ పెద్ద స‌వాలే విసిరింది. 

ఒక్క మునుగోడులో గెలుపొందేందుకే రెండు ఊళ్ల‌కు క‌లిపి ఒక ఎమ్మెల్యేను నియ‌మించిన ప‌రిస్థితి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇది సాధ్య‌మా? జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్తాన‌ని ప‌దేప‌దే కేసీఆర్ చెప్ప‌డం వెనుక వ్యూహం ఏంటో గానీ, అది వ‌ర్కౌట్ అయ్యే ప‌రిస్థితి లేదు. ఉట్టికి ఎగ‌ర‌లేన‌మ్మా, స్వ‌ర్గానికి ఎగురుతా అన్న‌ట్టుగా కేసీఆర్ రాజ‌కీయ పంథా ఉంద‌నే విమ‌ర్శ‌లున్నాయి. కేసీఆర్ భ‌విష్య‌త్ ఆయ‌న చేత‌ల్లోనే ఉంది. 

 

 

జనాలు రేషన్ కొన్నట్లే బీజేపీ ఎమ్మెల్యేల కొనుగోలు!



జార్ఖండ్‌ అసెంబ్లీలో ఇవాళ అధికార యూపీఏ కూటమి ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్షలో సీఎం హేమంత్‌ సోరెన్‌ నెగ్గారు. గనుల లీజును తనకు తానే కేటాయించుకుని సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. దీంతో సోరెన్పై ఎమ్మేల్యేగా అనర్హత వేటువేయడంపై గవర్నర్ అభిప్రాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కోరినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో అధికార యూపీఏ కూటమి విశ్వాస పరీక్షకు సిద్ధమైంది. అసెంబ్లీలో సీఎం హేమంత్ సోరెన్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. విశ్వాస పరీక్షలో 81 మంది ఎమ్మెల్యేలు పాల్గొనగా సోరెన్‌ కు అనుకూలంగా 48 మంది ఓటేశారు. జార్ఖండ్‌ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 81. మెజారిటీ కావాలంటే 42 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. విశ్వాసపరీక్షలో హేమంత్‌ సోరెన్‌ కు మద్దతుగా 48 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. యూపీఏ కూటమికి 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీజేపీకి 26 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బ‌ల‌ప‌రీక్ష స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష బీజేపీ స‌భ నుంచి వాకౌట్ చేసింది. జార్ఖండ్ అధికార కూటమి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్ నుండి ప్రత్యేక విమానంలో ఆదివారం రాష్ట్ర రాజధాని రాంచీకి చేరుకున్నారు. అక్కడ వారిని విలాసవంతమైన రిసార్ట్‌లో ఉంచారు. రాష్ట్ర అతిథి గృహంలో ఎమ్మెల్యేలు కలిసి రాత్రి బస చేసి నేరుగా అసెంబ్లీకి తీసుకెళ్లారు.

ఓటింగ్‌ కు ముందు హేమంత్ సోరెన్ మాట్లాడుతూ... కమలం పార్టీ చేసిన చర్యల కారణంగానే ప్రస్తుత పరిస్థితి తలెత్తిందని దుయ్యబట్టారు. అధికార కూటమి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి  బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందన్నారు. ఎన్నికల్లో గెలవడానికి అల్లర్లకు ఆజ్యం పోసి దేశంలో అంతర్యుద్ధం లాంటి పరిస్థితికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. జార్ఖండ్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అసోం సీఎం హిమంత బిస్వా శర్మ కూడా జార్ఖండ్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో పాలుపంచుకున్నారని కూడా ఆయన ఆరోపించారు. తమ ముగ్గురు ఎమ్మెల్యేలు బెంగాల్‌లో ఉన్నారని.. బెంగాల్‌కు వారు వెళ్లడం వెనుక అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ హస్తం ఉందని ఆరోపించారు. దీనిపై విచారణకు వెళ్తున్న పోలీసులకు ఆయా రాష్ట్రాలు సహకరించడం లేదనిహేమంత్ సోరెన్ మండిపడ్డారు. రెండు రాష్ట్రాలు తలపడే వాతావరణం సృష్టించాలనుకున్నారని,హింసాత్మక వాతావరణాన్ని సృష్టించడానికి ప్రోత్సహించాలని చూశారంటూ విమర్శించారు.

 

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...