Friday 24 June 2022

నిత్య పెళ్లికూతురు…. నిత్య పెళ్లికొడుకు ఏది నిజం!!!???

మహబూబాబాద్ దంపతుల గొడవలో కొత్త ట్విస్ట్ నెలకొంది. తాను 9 పెళ్లిళ్లు చేసుకోలేని వెల్లడించిన కర్నాటి స్వప్న.. తన భర్తే 12 మందిని పెళ్లి చేసుకున్నాడంటూ ఆధారాలు

మహబూబాబాద్‌‌కు చెందిన నిత్య పెళ్లికూతురు కర్నాటి స్వప్న ఉదంతం కొత్త మలుపు తిరిగింది. భర్త ఆరోపిస్తున్నట్లు తాను 9 పెళ్లిళ్లు చేసుకోలేదని.. అతడే 12 మందిని పెళ్లి చేసుకోవడంతో పాటు మరెంతో మంది దేశ, విదేశాలకు చెందిన అమ్మాయిలతో తిరిగాడంటూ ఆమె సాక్ష్యాలు బయటపెట్టింది. కర్నాటి స్వప్న గతంలో 8మందిని పెళ్లిచేసుకుని మోసం చేయడంతో పాటు తనను తొమ్మిదో వివాహం చేసుకుందంటూ ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా గంపలగూడేనికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి మూడురోజుల క్రితం మీడియా ఎదుట ఆధారాలు ప్రవేశపెట్టడం సంచలనం కలిగించింది. అయితే తన భర్తే నిత్యపెళ్లికొడుకని.. తనను మోసం చేసుకుని పెళ్లి చేసుకోవడంతో పాటు వేధింపులకు గురిచేస్తున్నాడంటూ స్వప్న పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మహబూబూబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో మీడియా సమావేశం ఏర్పాటుచేసిన స్వప్న.. తనపై టీవీ ఛానళ్లలో ప్రసారమవుతున్న కథనాల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. తమ మధ్య ఆస్తి తగాదాలు రాగా... భర్త వెంకటేష్ కొంతమంది గిరిజన నాయకులతో కలిసి తనపై దాడికి పాల్పడ్డాడని వెల్లడించింది. అందువల్లే తనకు న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టానని తెలిపింది. ఈ క్రమంలోనే తన భర్త తప్పుడు సాక్ష్యాలు మీడియాకు ఇవ్వడంతో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. వెంకటేష్‌ చెబుతున్నట్లు తమ పరిచయం మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ ద్వారా కాలేదని... ఓ మ్యారేజ్ బ్యూరో వద్ద తన ఫోన్ నంబర్ సేకరించిన అతడు పెళ్లి చేసుకుంటానంటూ విసిగించేవాడని స్వప్న తెలిపింది. కుటుంబసభ్యులు పెళ్లికి ఒప్పుకున్నాక రూ.40లక్షల కట్నం ఇస్తేనే చేసుకుంటానని మెలిక పెట్టాడని.. అంతడబ్బు ఇచ్చాకే తాళి కట్టాడని తెలిపింది. అయితే వివాహమయ్యాక మరో రూ.5లక్షలు కావాలని డిమాండ్ చేయగా ఇచ్చామని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొంది. వెంకటేష్‌ ఉద్యోగం పేరుతో వివిధ రాష్ట్రాలు తిరిగేవాడని.. ఎక్కడికి వెళ్తే అక్కడ అమ్మాయిలను లోబరుచుకుని పెళ్లి పేరుతో వాడుకోవడం అతడికి అలవాటని తెలిపింది. చాలామంది అమ్మాయిలతో అతడు దిగిన ఫోటోలు, ఛాటింగ్ వివరాలు తనవద్ద ఉన్నాయని స్వప్న చెబుతోంది. వెంకటేష్ వేధింపులకు విసిగిపోయి తాను నాంపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, దీనిపై విచారించిన నాంపల్లి కోర్టు తనకు నెలకు రూ.16వేలు మెయింటెనెన్స్ ఇవ్వాలంటూ తీర్పు ఇచ్చినా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడని చెబుతోంది. దీంతో అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుందని తెలుసుకున్న వెంకటేష్... తాను మహబూబ్‌బాద్‌‌లో ఉన్న సంగతి తెలుసుకుని గిరిజన నాయకులతో కలిసి దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తోంది. తన ఇంటి విషయంలో జోక్యం చేసుకున్న గిరిజన నాయకుల వల్ల తనకు ప్రాణహాని ఉందని, పోలీసులు ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని స్వప్న వేడుకుంటోంది. అలాగే 12 పెళ్లిళ్లు చేసుకుని అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న తన భర్త వెంకటేశ్‌పైనా కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. 

 

 

డ్యూటీ డ్రైవర్ కు గుండెపోటు..

 

మనం తరచుగా నడుస్తున్న బస్సులో డ్రైవర్ లకు గుండెపోటు వచ్చిన అనేక ఘటనలు చూశాం. ఈ క్రమంలో కొంత మంది డ్రైవర్ లు చాకచక్యంగా వ్యవహరిస్తుంటారు. తాము.. ప్రమాదంలో ఉన్నప్పటికి ఇతరులు ప్రమాదంలో పడకుండా చూస్తుంటారు. బస్సును రోడ్డుకి ఒక పక్కన తీసుకెళతారు. కొన్ని సార్లు.. అనుకొని విధంగా డ్రైవర్ లో స్ట్రోక్ కు (Cardiac arrest)  గురై నడిరోడ్డు మీద బస్సులను ఆపివేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇలాంటి అనేక ఘటనలు మనం చూశాం. ఇప్పుడు నడుస్తున్న ట్రైన్ లో డ్యూటీ డ్రైవర్ కు స్ట్రోక్ వచ్చింది.

పూర్తి వివరాలు.. యూపీలో (Uttar pradesh) శుక్రవారం విషాదకర ఘటన జరిగింది. ప్రతాప్‌గఢ్-కాన్పూర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును హరిశ్చంద్ర శర్మ (46) నడుపుతున్నారు. ఈ క్రమంలో.. హరిశ్చంద్ర శర్మ అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో అతని పక్కన మరో అసిస్టెంట్ డ్రైవర్ ఉన్నారు. అతన వెంటనే.. ట్రైన్ ను ఆపివేసి.. అధికారులకు, అంబులెన్స్ కు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి అంబులెన్స్ చేరుకుంది. ట్రైన్ డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే డ్రైవర్ గుండెపోటుతో (Heart attack)  చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. కాగా, పరశురాంపూర్ చిల్బిలాకు చెందిన రైలు డ్రైవర్ హరిశ్చంద్ర శర్మ (46) కాన్పూర్ వైపు రైలును నడుపుతుండగా కాసింపూర్ హాల్ట్ సమీపంలో అకస్మాత్తుగా ఆరోగ్య సమస్య ఏర్పడిందని గౌరీగంజ్ రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ప్రవీణ్ సింగ్ తెలిపారు. ప్రతాప్‌గఢ్‌ నుంచి మరో లోకో పైలట్‌ రావడంతో రైలు అక్కడి నుంచి వెళ్లిపోయిందని సింగ్‌ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఫుర్సత్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మనోజ్ కుమార్ సోంకర్ తెలిపారు.

ఇదిలా ఉండగా ఒక వ్యక్తి తన భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించాడు.

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్(Murshidabad)లో ఓ వ్యక్తి..తన భార్య జుట్టు కత్తిరించి ఆమెకు షేవింగ్ చేశాడు. దీనికి కారణం ఆమె ఆడపిల్లకు(Girl Chid)జన్మనివ్వడమే. ముర్షిదాబాద్‌లోని హరిహరపరాలోని సాలూవా గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ముర్షిదాబాద్ లోని సాలువా గ్రామంలో నివసించే రకియా-అబ్దుల్లా షేక్ భార్యాభర్తలు. మూడు నెలల క్రితం రకియా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

అయితే తాము మగపిల్లవాడు పుట్టాలని అనుకుంటే ఆడపిల్ల పుట్టిందన్న కోపంతో రకియాను భర్త,అత్తమామలు మానసికంగా వేధించేవాళ్లు. పుట్టేది ఆడో,మగో తన చేతుల్లో ఎలా ఉంటుందని రకియా చెప్పినా వినకుండా ఆమెను మానసికంగా తీవ్ర వేధనకు గురిచేశారు. రకియాను రకరకాలుగా హింసిస్తూనే ఉన్నారు. పుట్టిన ఆడబిడ్డను చంపేస్తామని బెదిరించారు. ఈ క్రమంలో గురువారం ఆడపిల్లకు జన్మనిచ్చినందుకు రకియాను ఆమె భర్త అబ్దుల్లా షేక్ ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత రకియాను తలపై కాల్చి వివస్త్రను చేశాడు.

అబ్దుల్లా తన భార్యను చిత్రహింసలకు గురిచేస్తుండగా, రాకియా మామ, అత్తగారు ఆ దృశ్యాన్ని కళ్లు అప్పగించి చూశారే తప్ప కొడుకుని ఆపే ప్రయత్నం చేయలేదు. రకియా జుట్టు కత్తిరించి,ఆమెకు షేవింగ్ చేశాడు భర్త. ఈ నేపథ్యంలో రకియా పోలీసులను ఆశ్రయించింది. నా భర్తను కఠినంగా శిక్షించాలంటూ పోలీస్‌స్టేషన్‌ ముందు రకియా కేకలు వేసింది. నాకు జరిగినది మరెవరికీ జరగకూడదనుకుంటున్నాను అంటూ భోరున విలపించింది. రకియా ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్త అబ్దుల్లా షేక్ ను అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉందని అధికారులు తెలిపారు.

 

 

జమ్మూకశ్మీర్ లో ప్రతిష్ఠాత్మక జీ 20 సదస్సు


G 20 Summit In Jammu and Kashmir : ప్రతిష్ఠాత్మక సదస్సుకు జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) వేదిక కానుంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సమూహం అయిన" G-20" సమావేశాలు 2023లో జమ్మూ కశ్మీర్‌లో జరగనున్నాయి. 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో తొలి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం ఇదే. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న 19 దేశాలతో పాటు ఐరోపా సమాఖ్య(Europian Union)కు చెందినే దేశాల ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటారు.  ఈ నేపథ్యంలో సమావేశాల మొత్తం సమన్వయం కోసం కేంద్రం.. ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. జీ 20 సమ్మిట్ సక్సెస్‌ అయ్యేలా చూసుకునేందుకు జూన్ 4వ తేదీనే ఏర్పాటైన కమిటీకి జమ్మూకశ్మీర్ హౌసింగ్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మనోజ్ కుమార్ ద్వివేది చైర్మన్‌గా ఉంటారు. జీ 20 దేశాల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఈ సమ్మిట్ సక్సెస్‌ అయ్యేలా చూస్తానని వెల్లడించారు మనోజ్ కుమార్. ఈ కమిటీలో రవాణా శాఖకు చెందిన కమిషనర్ సెక్రటరీ, టూరిజం శాఖకు చెందిన అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, హాస్పిటాలిటీ విభాగానికి చెందిన అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, సాంస్కృతిక విభాగానికి చెందిన అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ సభ్యులుగా ఉన్నారు.

గతేడాది సెప్టెంబరులో, కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ G20 కోసంసమావేశానికి భారత ప్రతినిధిగా ఎంపికయ్యారు. ఈ ఏడాది జీ 20 సమావేశానికి భారత్ తరపున ఎవరు అధ్యక్షత వహిస్తారో డిసెంబర్ 1వ తేదీన నిర్ణయిస్తామని భారత విదేశాంగ మంత్రి వెల్లడించారు. జీ 20 సభ్యదేశాల్లో ఒకటి ప్రతి ఏటా డిసెంబర్‌లో సదస్సుకు అధ్యక్షత వహిస్తుంది. ఈ క్రమంలో భారత్‌కు జీ 20 అధ్యక్షత బాధ్యతలు ఈ ఏడాది డిసెంబర్‌ 1న లభిస్తాయి. డిసెంబరు 1, 2022 నుండి జి-20కి భారతదేశం అధ్యక్షత వహిస్తుందని, 2023లో తొలిసారిగా భారత్ G-20 నేతల శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. జమ్ము, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసినప్పటి నుంచి ఆ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించింది కేంద్రం. అక్కడ పురోగతి సాధించేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పుడు ఇలాంటి అంతర్జాతీయ సమ్మిట్‌ను కశ్మీర్‌లో నిర్వహించటం ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.

ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక శక్తులు, అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతల వార్షిక సమావేశమే జీ20 సదస్సు. ప్రపంచ జీడీపీలో 80 శాతం వాటా ఈ 20 సభ్యులదే. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు ఈ 20 ప్రాంతాల్లోనే ఉంటారు. ఈ బృందానికి తనకంటూ శాశ్వత సిబ్బంది ఎవరూ ఉండరు. కాబట్టి ఈ బృందంలోని ఒక దేశం తమ ప్రాంతం వంతు వచ్చినపుడు.. ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో సదస్సుకు అధ్యక్షత వహిస్తుంది. తదుపరి శిఖరాగ్ర సదస్సును, చిన్న చిన్న సమావేశాలను నిర్వహించే బాధ్యతను ఆ దేశం స్వీకరిస్తుంది

 

సోలార్ ప్లాంట్.. నెలకు రూ.6 లక్షలు సంపాదిస్తున్న డాక్టర్ రైతు


ఎడారి ప్రాంతమే ఎక్కువగా ఉంటుంది. సాగునీరు సంగతి తర్వాత.. త్రాగు నీటికి కూడా ఎన్నో కష్టాలు పడాలి. నీటి ఎద్దడి కారణంగా అక్కడి భూముల్లో వ్యవసాయం చేయడం కష్టం. భూములన్నీ బీళ్లుగా మారిపోయాయి. అలాంటి చోట ఓ డాక్టర్ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. స్వతహాగా రైతు అయిన  ఆ డాక్టర్.. సిరుల పంట పండిస్తున్నాడు. నిరూపయోగంగా పడి ఉన్న భూమిలో.. సోలార్ పవర్ ప్లాంట్ (Solar Power Plant) ఏర్పాటు చేసి.. నెలానెలా  లక్షలు సంపాదిస్తున్నాడు. మరి ఎంత భూమిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశాడు? దానికి ఎంత ఖర్చయింది? ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది? దానిని ఎవరికి విక్రయిస్తున్నాడు? నెలకు ఎంత సంపాదిస్తున్నాడు? వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. రాజస్థాన్‌లోని కోట్‌పుత్లి పట్టణానికి చెందిన అమిత్ సింగ్ యాదవ్ వృత్తిరీత్యా డాక్టర్. వీరికి వ్యవసాయ భూమి కూడా ఉంది. అందువల్ల వ్యవసాయంపైనా అవగాహన ఉంది. కానీ ఇక్కడి భౌగోళిక, వాతావరణ పరిస్థితుల కారణంగా నీటి సమస్య ఉండడంతో పంటలు పెద్దగా పండవు. అందుకే వీరి భూమిలో కొంతకాలంగా పంట పండించడం లేదు. ఈయనకు కోట్‌పుత్తిలో ఓ ఆస్పత్రి ఉంది. ఐతే ఆస్పత్రికి అయ్యే కరెంట్ ఖర్చులను తగ్గించుకునేందుకు కొన్నేళ్ల క్రితం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నారు. దాని ద్వారా వారికి నెలకు రూ.15 వేలు ఆదా అయ్యేవి. అప్పుడే సోలార్ పవర్ పట్ల అమిత్ యాదవ్‌కు ఆసక్తి పెరిగింది. సౌరశక్తిని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం కుసుం యోజన (PM Kusum Yojana) గురించి ఆయనకు తెలిసింది. మీ భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే.. దాని నుంచి ఖచ్చితమైన రేటుకు ప్రభుత్వమే విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది. ఈ ఐడియా బాగా నచ్చడంతో.. తనకున్న రెండెకరాల భూమిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు అమిత్ యాదవ్ మొత్తం 2 ఎకరాల భూమిలో 1.1 మెగా వాట్స్ సామర్థ్యమున్న సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. 330 వాట్స్ కెపాసిటీ గల 3400 సోలార్ ప్యానెల్స్‌ను అమర్చారు. ఈ ప్లాంట్‌లో ప్రతి రోజూ సగటున 5వేల యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఎండాకాలంలో రోజుకు 5,500 యూనిట్లు, శీతాకాలంలో 3500 విద్యుత్ తయారవుతుంది. సోలార్ ప్లాంట్‌లో డీసీ కరెంట్ ఉత్పత్తి అవుతుంది. దీనిని ఏసీగా మార్చి.. 3 కి.మీ. దూరంలో ఉన్న సబ్‌స్టేషన్‌కు సరఫరా చేస్తారు. అమిత్ యాదవ్ ప్లాంట్‌లో తయారయ్యే కరెంట్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వంతో ఆయన ఒప్పందం చేసున్నారు. 25 ఏళ్ల పాటు ఖచ్చితమైన ధర వస్తుంది. ప్రతి రోజు 5వేల యూనిట్స్ కరెంట్ తయారైతే.. దానిని యూనిట్‌కు రూ.4 చొప్పున విక్రయిస్తున్నాడు. ఇలా ప్రతిరోజూ రూ.20వేల చొప్పున.. నెలకు రూ.6 లక్షల ఆదాయం వస్తుంది.

ఐతే ఇందులో ఉన్న పెద్ద అవరోధం అంటంటే.. పెట్టుబడి. ఈ స్థాయిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కోట్లల్లో ఖర్చవుతుంది. 1 మెగా వాట్ సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు రూ.4 కోట్ల వరకు ఖర్చయింది. ఐతే ఆయన డాక్టర్‌గా పనిచేస్తున్నందున బ్యాంకులు ఈజీగా రుణం ఇవ్వడంతో పెద్దగా ఇబ్బంది పడలేదు. ఆ డబ్బుతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నారు అమిత్ యాదవ్. తానుకున్న తీసుకున్న లోన్.. ఐదేళ్లలో క్లియర్ అవుతుందని... ఆ తర్వాత వచ్చే ఆదాయమంతా లాభమేనని ఆయన చెప్పారు. సోలార్ ప్లాంట్‌ నిర్వహణకు ఇద్దరు మనుషులంటే సరిపోతుందని.. తాను డాక్టర్ వ‌ృత్తిని కొనసాగిస్తూనే.. ప్లాంట్‌ను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. తాను సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాక.. మరో 200 మంది దీని పట్ల ఆసక్తి చూపించారని తెలిపారు

మహా అన్నదాన కార్యక్రమం. కామధేనువు సేవాసమితి అద్వర్యంలో

 మహా అన్నదాన కార్యక్రమం. కామధేనువు సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీహనుమాన్ దేవాలయం  సనత్ నగర్  హైదరాబాద్ , ప్రాంగణంలో ఉన్న గోశాల నందు.. కుబేరుడు అన...