Wednesday 16 August 2023

 మానసిక వైద్యశాలలో అన్నదాన కార్యక్రమం  

కామధేనువు సేవాసమితి 


అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే| జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి !

ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాల, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎర్రగడ్డ ప్రాంతంలో ఉన్న మానసిక అసుపత్రి. నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో స్థాపించబడిన పురాతన ఆరోగ్య సంస్థల్లో ఇదీ ఒకటి.[1] తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ఆసుపత్రి, రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే మానసిక ఆరోగ్య రోగులకు సేవలు అందిస్తోంది. 600 పడకలతో ఉన్న ఈ హాస్పిటల్ లో రోజుకు దాదాపు 300 మందికి పైగా వివిధ రాష్టాల నుండి అవుట్ పేషేంట్స్ వస్తుంటారు, వారందికీ ఆహారం కొంత ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని కామధేనువు సేవాసమితి వారు ప్రతి అమావాస్య, పొర్ణమి రోజులలో అందరికి అన్నదానము చేస్తున్నారు

అన్నదానం కోటి గోవుల దాన ఫలితంతో సమానమైనది. ఏది లోపించినా బ్రతకగలం. కానీ ఆహారం లోపిస్తే బ్రతకలేం. "దానాలన్నింటిలోకెల్లా అన్నదానం మిన్న" అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని పెద్దలు చెప్తారు. మనిషి ఆశకు అంతులేదు... అదుపు అంతకన్నా ఉండదు, ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా... ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. కానీ అన్నదానంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలేకపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తి పరచవచ్చును. ఈ కార్యక్రమంలో సమితి ప్రసిడెంట్ దేవేందర్ కొన్నే, వేంకటేష్, రుక్మిణి, తులసి కుమార్, విగ్నేష్, సూర్య ప్రకాష్, సంధ్య , రాజేష్, సత్తార్ మరియు ఇతర సభ్యులు పాల్గొనటం జరిగింది




               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...