Thursday 30 June 2022

 

ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ నిధులు ఎందుకు మాయమయ్యాయి

ఉద్యోగుల సంఘం నాయకుడిగా ఉన్న తన ఖాతాలోంచి కూడా నిధులు విత్ డ్రా చేసినట్టు సూర్యనారాయణ వెల్లడించారు. జీపీఎఫ్ ఖాతాల నిర్వహణను చూసే ఆర్థిక శాఖ ద్వారానే ఇది జరిగిందన్నారు.

'28వ తేదీ అర్ధరాత్రి తరువాత 2021-22 ఆర్థిక సంవత్సరానికి యాన్యువల్ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను అకౌంటెంట్ జనరల్ వారి కార్యాలయం ద్వారా అప్‌లోడ్ చేశారు. జీపీఎఫ్ స్లిప్పులను చూసుకుంటే నా వ్యక్తిగత ఖాతా నుంచి రూ.83 వేలు మార్చి నెలలో డెబిట్ అయిపోయినట్టుగా ఉంది. నాకొక్కడికే కాకుండా ఇదే పరిస్థితి అనేక మందికి ఉందని తేలింది.

సమాధానం కోసం ఆర్థిక శాఖ కార్యదర్శిని సంప్రదించాలని చూస్తే ఆయన కూడా ఈ విషయంపై ఏజీ కార్యాలయానికి వెళ్లినట్టు తెలిసింది.' అంటూ సూర్యనారాయణ మీడియాకు తెలిపారు. ఉద్యోగ సంఘాల నాయకులు, సాధారణ ఉద్యోగులతోపాటు వివిధ శాఖల అధికారులు దాదాపుగా 62వేల మందికి ఇలాంటి సమస్య ఎదురైనట్టు ఉద్యోగ సంఘాల నాయకులు వెల్లడించారు.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్( జీపీఎఫ్) ఖాతాల నుంచి నిధులు మాయం అయ్యాయనే ఆరోపణలు వచ్చాయి. జీపీఎఫ్ నిల్వలు మాయం అయ్యాయంటూ ఉద్యోగ సంఘాలు ఫిర్యాదు చేశాయి.

ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో విఫలం కావడమే కాకుండా, చివరకు ఉద్యోగులు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ నిధులను కూడా ప్రభుత్వం పక్కదారి పట్టించిందంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

జీపీఎఫ్ నిధులు మాయం అయ్యాయనే వివాదంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జోక్యం చేసుకుని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరణ కోరింది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన రెండో రోజు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ స్పందించి, జీపీఎఫ్ ఖాతాల్లో నిధులు కనిపించకపోవడానికి కారణం సాంకేతిక సమస్యలని తెలిపింది.

ఈ నేపథ్యంలో జీపీఎఫ్ నిధులు ఏమయ్యాయి? నిజంగా సాంకేతిక సమస్యేనా అనే సందేహాలు ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన వివరణపై వారిలో సంతృప్తి కనిపించడం లేదు. గత ఏడాది కూడా ఇదే సమస్య ఎదురైంది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం చాలాకాలం పాటు పెండింగులో ఉంది. కరోనా సంక్షోభం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం వంటి కారణాలతో 2018 నుంచి చెల్లించాల్సిన డీఏ బకాయిలు పేరుకుపోయాయి. వేతన సవరణ ఒప్పందం సందర్భంగా పెండింగ్ డీఏలను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

వాటిని నగదు రూపంలో ఉద్యోగులకు నేరుగా చెల్లించకుండా 2018 జులై నుంచి పెండింగులో ఉన్న ఆరు డీఏలను మూడు విడతలుగా ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమచేస్తామని తెలిపింది. తొలుత దానికి సుముఖత వ్యక్తం చేయకపోయినప్పటికీ, తర్వాత సీఎంతో జరిగిన చర్చల్లో ఉద్యోగ సంఘాలు ఈ ప్రతిపాదనకు అంగీకరించాయి.

విడతల వారీగా పెండింగ్ డీఏ బకాయిలను ఉద్యోగుల ఖాతాలకు జమచేసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా జీపీఎఫ్ ఖాతాలకు బకాయిల చెల్లింపు జరిగినట్టు కొందరు ఉద్యోగులకు మెసేజ్‌లు వచ్చాయి. అనూహ్యంగా జూన్ 27, 28 తేదీల్లో కొందరు ఉద్యోగుల ఖాతా నుంచి ఆ మొత్తం మళ్లీ వెనక్కి మళ్లించినట్టు సమాచారం అందింది. దాంతో కలకలం మొదలైంది.

తమ జీపీఎఫ్ ఖాతాల్లో ఉన్న మొత్తం వెనక్కి మళ్లించారనే ఉద్యోగుల సమాచారంతో పలు సంఘాల నేతలు అప్రమత్తమయ్యారు.

తన ఖాతా నుంచి కూడా జీపీఎఫ్ నిధులు డెబిట్ అయిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.సూర్యనారాయణ గుర్తించారు. తనతోపాటు రాష్ట్రంలోని పలువురు అధికారులు, ఉద్యోగులకు ఇదే సమస్య ఉందని గ్రహించిన ఆయన, సచివాలయంలోని ఆర్థిక శాఖ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఆ తరువాత అధికారులు కూడా వివరణ ఇవ్వలేని స్థితిలో ఉన్నారంటూ ఆయన మీడియాకు తెలిపారు.

జీపీఎఫ్ ఖాతాల్లో డబ్బులు మాయం అయ్యాయనే అంశంపై హైకోర్టు స్పందించింది. తాము దీనిని సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు తెలిపింది. మీడియాలో కథనాలు చూసి ఆశ్చర్యపోయామని వ్యాఖ్యానించింది.

కొత్త పీఆర్సీకి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వుల మీద గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం నాయకుడు కేవీ కృష్ణయ్య వేసిన పిటీషన్ విచారణ జరుగుతోంది. ఈ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.

జూన్ 29న విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లోని సొమ్మును వారికి తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించిందంటూ వచ్చిన పత్రికా కథనాలను ప్రస్తావించింది. గతంలో తామిచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించింది. ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని అభిప్రాయపడింది. ఈ వ్యవహరంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవాబు చెప్పాల్సిందేనని, ఆయనకు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ ఉద్యోగి జీతంలో ఒక్క రూపాయి కూడా తగ్గడానికి వీల్లేదని, ఏ ప్రభుత్వ ఉద్యోగి జీతం నుంచి ఎలాంటి మొత్తాలను రికవరీ చేయకూడదని, దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఫిబ్రవరిలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పిటిషనర్‌ కృష్ణయ్య తన ఖాతా నుంచి రూ.91,221 ఉపసంహరణ జరిగిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై స్పందించిన ధర్మాసనం జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము విత్‌డ్రాకు సంబంధించిన పూర్తి వివరాలను నివేదిస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వం తరుపున అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ కల్పించుకుని గడువు ఇస్తే పూర్తి వివరాలను నివేదిస్తామని కోర్టుకు తెలిపారు.

హైకోర్టు తదుపరి విచారణను జులై 12కి వాయిదా వేసింది

ఓవైపు ఉద్యోగ సంఘాలు, మరోవైపు ప్రతిపక్షాలు, నేరుగా న్యాయస్థానం కూడా జీపీఎఫ్ వివాదంలో ప్రభుత్వం మీద తీవ్ర వ్యాఖ్యలు చేశాయి. ఈ నెల 28న ఈ అంశం వెలుగులోకి రాగా 29వ తేదీ రాత్రి ప్రభుత్వం తరపున ఆర్థిక శాఖ వివరణతో ఓ ప్రకటన జారీ అయ్యింది. ఆ ప్రకటన ప్రకారం...

'జీపీఎఫ్ సమస్యపై డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ (డీటీఏ) అధికారులు దృష్టి పెట్టారు. దీనిపై పూర్తి నివేదిక సమర్పించాలని డీటీఏను ప్రభుత్వం కోరింది.

ప్రాథమిక సమాచారం మేరకు పెండింగ్ డీఏ బకాయిలు ఉద్యోగుల ఖాతాలకు జమచేసే ప్రక్రియను డీటీఏ ప్రారంభించింది. పెండింగ్ డీఏ బకాయిల చెల్లింపు జరగలేదు. కానీ సాంకేతిక సమస్య మూలంగా బకాయిలు క్లియర్ అయినట్టు ఉద్యోగుల ఖాతాలో చూపించారు.

ట్రెజరీ నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరం ముగింపులో పెండింగ్ బిల్లులను సంబంధిత ట్రెజరీ అధికారులు రద్దు చేయాల్సి ఉంటుంది. అది జరగకపోవడం వల్ల సిబ్బంది ఖాతాలో జమ అయినట్టు వచ్చింది. ఆ తర్వాత సిస్టమ్ దానిని వెనక్కి తీసుకున్నట్టు చూపిస్తోంది. ఇదో టెక్నికల్ సమస్య. దీనిపై దృష్టి పెట్టాం.

సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌) ద్వారా బిల్లులు పాస్‌ చేసే విధానంలో జరిగిన పొరపాటు వల్ల ఇది చోటు చేసుకుంది. 2018 జులై 1 నుంచి రావాల్సిన డీఏ బకాయిలు కొందరికి క్రెడిట్, మరికొందరికి డెబిట్‌ అయిన వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.'

కానీ ఇది ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఆర్థిక సంవత్సరాంతంలో జరిగిన సాంకేతిక సమస్య వల్ల జరిగిందని, తాము భావించడం లేదని ఉద్యోగులు అంటున్నారు. గతంలో కూడా ఇదే రీతిలో జరిగినందున అనుమానాలు వస్తున్నాయని చెబుతున్నారు.

'2021 అక్టోబర్‌లో కూడా ఇదే జరిగింది. జాయింట్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు నేరుగా సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లోనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎస్ చెప్పారు. కానీ అది జరగలేదు.

‘‘మా ఖాతాల నుంచి అప్పట్లో డెబిట్ అయిన మొత్తాన్ని వెంటనే క్రెడిట్ చేశారు. దాంతో చాలా మంది పెద్ద సమస్యగా భావించలేదు. ఆరు నెలలు తిరిగే సరికి మొన్నటి మార్చిలో మరోసారి ఇలా జరగడం చూస్తుంటే జీపీఎఫ్ ఖాతాల నిర్వహణ తీరు సందేహాస్పదంగా ఉంది. నిజానికి జీపీఎఫ్ ఉద్యోగులకు 2021 జూన్ నాటికి ఒక విడత జమయ్యిందని, సీపీఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో ఇస్తామని చెప్పినప్పటికీ నేటికీ బకాయిలు అలానే ఉన్నాయి’’ అని ఏపీ ఎన్జీఓ నేత విద్యాసాగర్ చెప్పారు. దీని మీద ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన కోరారు.

 

 

సాలు దొర, సెలవు దొర’...‘సాలు మోదీ, సంపకు మోదీ’...

హైదరాబాద్ అంతా కేసీఆర్, నరేంద్ర మోదీ ఫ్లెక్సీలతో నిండి పోయింది. జులై 2, 3న హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. జులై 2, 3వ తేదీల్లో హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ ఫ్లెక్సీలతో నగరాన్ని నింపేసింది బీజేపీ. మరొకవైపు దీనికి పోటీగా తమ పనితీరుకు సంబంధించిన హోర్డింగ్‌లతో మెట్రో పిల్లర్లు, బస్‌ స్టాప్‌లను నింపేసింది తెలంగాణలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా మరొకసారి బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు బయటపడ్డాయి. గత కొంతకాలంగా బీజేపీతో కేసీఆర్ ఢీ కొడుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఫ్లెక్సీలు పెట్టే అవకాశం తమకు లేకుండా చేయడానికే మెట్రో పిల్లర్లు, బస్ స్టాప్స్ వంటి వాటిని తెలంగాణ ప్రభుత్వ ప్రకటనలతో నింపేశారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇటీవల ‘సాలు దొర, సెలవు దొరఅంటూ తెలంగాణ బీజేపీ కార్యాలయంలో డిజిటల్ బోర్డు ఏర్పాటు చేశారు. ఆ బోర్డు తీసి వేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా మోదీపై బోర్డులు పెడతామని టీఆర్‌ఎస్ పార్టీ నేతలు హెచ్చరించారు. ఆ తరువాత హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో సాలు మోదీ, సంపకు మోదీఅనే ఫ్లెక్సీలు వెలిశాయి. హైదరాబాద్‌ వేదికగా టీఆర్‌ఎస్, బీజేపీ బలప్రదర్శనకు దిగాయి. పోటాపోటీగా కేసీఆర్, నరేంద్ర మోదీ ఫ్లెక్సీలు వెలిశాయి దక్షిణ భారత్‌లో విస్తారించాలని చూస్తున్న బీజేపీ, తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. చాలా కాలం కిందటే కర్నాటకలో అధికారం చేపట్టినా ఇంత వరకు మరో దక్షిణ భారత రాష్ట్రంలో పాగా వేయలేక పోయింది బీజేపీ. కేసీఆర్ ఫ్లెక్సీలతో నిండిపోయిన హైదరాబాద్ మెట్రో పిల్లర్లు. హైదరాబాద్‌ మెట్రో పిల్లర్ల నిండా కేసీఆర్ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి.




 

మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి భారీ ప్రమాదం..

మణిపూర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నోనీ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయని, కొత్తగా నిర్మిస్తున్న జిరిబామ్ - ఇంఫాల్ రైల్వే లైన్‌లో భాగమైన టుపుల్ స్టేషన్ భవనానికి నష్టం వాటిల్లిందని ఎన్ఎఫ్ రైల్వే సీపీఆర్ఓ తెలినట్లు ఏఎన్ఐ వార్త సంస్థ వెల్లడించింది.

ఇప్పటివరకు ఏడుగురి మృతదేహాలను వెలికి తీశారని, ప్రమాదం నుంచి రక్షించినవారిని ఆస్పత్రికి తరలించారని నోనీ జిల్లా ఎస్‌డీఓ సోలమన్ ఎల్ ఫిమేట్ తెలిపినట్లు ఏఎన్ఐ పేర్కొంది. ఇంకా సుమారు 45 మంది కనిపించడం లేదని సమాచారం. టుపుల్‌లో పరిస్థితిని అంచనా వేయడానికి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ తెలిపారు.

టుపుల్ రైల్వే స్టేషన్ దగ్గర కొండచర్యలు విరిగిపడిన ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్‌తో, కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడానన్నారు.

ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాలుపంచుకుంటోందని, మరో రెండు బృందాలు టుపుల్‌కు వెళుతున్నాయని తెలిపారు.

 

 

ఆటో నడిపే స్థాయి నుంచి సీఏం స్థాయికి ఏక్‌నాథ్ శిందే


మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ శిందే బాధ్యతలు చేపట్టనున్నట్లు బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. ఈ రోజు రాత్రి 7.30 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మహారాష్ట్ర గవర్నర్‌ను కలిశాయి. అలాగే కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో తాను భాగంగా ఉండనని దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు.

మొత్తం 50 మంది ఎమ్మెల్యేలు తనతో ఉన్నట్లు ఏక్‌నాథ్ శిందే తెలిపారు. వీరిలో 40 మంది శివసేన పార్టీకి చెందిన వారని అన్నారు.

50 మంది నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయను. వారి మీద ఈగ కూడా వాలనివ్వను. బాల ఠాక్రే హిందుత్వానికి అనుగుణంగా మేమంతా ఈ నిర్ణయం తీసుకున్నాం.అని ఏక్‌నాథ్ శిందే చెప్పుకొచ్చారు.

తనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేవేంద్ర ఫడణవీస్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఏక్‌నాథ్ శిందే థానేలోని కోప్రి- పచ్పఖాడి స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అనేక దశాబ్దాలుగా పార్టీలో ముఖ్యమైన నేతగా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు శ్రీకాంత్ శిందే కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.

ఏక్‌నాథ్ శిందే చాలా ఏళ్లుగా శివసేన సభ్యుడిగా ఉన్నారు. థానే మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రతిపక్ష నేతగా పనిచేసిన తరువాత, 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

తొలినాళ్లల్లో ఆయన ఆటోరిక్షా నడిపేవారు.

థానేలోని వైభవ్ వార్తాపత్రిక సంపాదకుడు మిలింద్ బల్లాల్, ఏక్‌నాథ్ శిందే రాజకీయ ప్రయాణాన్ని విశ్లేషిస్తూ "దూకుడు తత్వం ఉన్న శివసైనిక్ నుంచి శాఖలో ముఖ్యుడిగా మారి, బాధ్యతాయుతమైన మంత్రిగా ఎదిగారు" అని అన్నారు.

"ఏక్‌నాథ్ స్వస్థలం సతారా. చదువుల కోసం ఆయన థానే వెళ్లారు. అక్కడ ఆయనకు ఆనంద్ దిఘేతో పరిచయం ఏర్పడింది. అలా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది" అని మిలింద్ బల్లాల్ వివరించారు.

  • 18 ఏళ్ల వయసులో శివసేనలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
  • దాదాపు దశాబ్దంన్నర పాటు పార్టీలో పనిచేసిన తరువాత 1997లో ఆనంద్ దిఘే.. ఏక్‌నాథ్‌కు థానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కౌన్సిలర్ టిక్కెట్ ఇచ్చారు.
  • ఈ మునిసిపల్ ఎన్నికల్లో గెలవడమే కాకుండా థానే మున్సిపల్ కార్పోరేషన్ హౌస్ లీడర్ కూడా అయ్యారు ఆయన.
  • ఆ తరువాత 2004లో థానే అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
  • 2009 నుంచి కోప్రి-పచ్పఖాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రతిసారీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
  • 2015 నుంచి 2019 వరకు రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రిగా పనిచేశారు.
  • ప్రస్తుతం ఆయన రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగానే కాకుండా థానే జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు.

 

 

 

 

టీఆర్ఎస్ వ్య‌తిరేక ఓటు చీల్చి, చివ‌రికి టీఆర్ఎస్‌కే ఈ రెండు పార్టీలు మేలు చేస్తాయా?



హైద‌రాబాద్‌లో ప్లెక్సీల గొడ‌వ మొద‌లైంది. మెట్రో పిల్ల‌ర్లు, హోర్డింగుల‌న్నీ టీఆర్ఎస్ ముందే బుక్ చేసుకుని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌ల‌తో నింపేసింది. బీజేపీ జాతీయ స‌మావేశాలు జూలై 2, 3 తేదీల్లో ఉన్నాయి. మోదీ, అమిత్‌షాతో స‌హా సీఎంలు, కేంద్ర మంత్రులంతా సిటీలో వుంటారు. వాళ్ల స్వాగ‌తం కోసం బీజేపీ కూడా కోట్ల‌లో ఖ‌ర్చు పెడుతూ భారీగానే ప్లెక్సీలు, హోర్డింగ్‌లు పెడుతూ వుంది. బీజేపీకి స్థ‌లం ద‌క్క‌కూడ‌ద‌ని టీఆర్ఎస్ ముందుగానే ప‌ట్టేసింది.

సౌత్ ఇండియాలో క‌ర్నాట‌క త‌ప్ప ఇంకెక్క‌డా బీజేపీ లేదు. త‌మిళ‌నాడు, కేర‌ళ‌, ఆంధ్రాలో సాధ్యం కాదు. ఇప్పుడు అధికారంలోకి రావ‌డానికి సుల‌భంగా క‌నిపిస్తున్న రాష్ట్రం తెలంగాణ‌. నిజానికి అంత సుల‌భ‌మేమీ కాదు. అయితే ఈ సారి బీజేపీ గ‌ట్టిగా ప‌ట్టు ప‌డుతోంది. ఒక‌ప్పుడు బెంగాల్‌లో బీజేపీ లేదు. ఈ రోజు బ‌లంగా వుంది. అదే విధంగా తెలంగాణ‌లో పాగా వేయ‌డానికి అన్ని పాచిక‌లు క‌దుపుతోంది.

కేసీఆర్ కూడా ఈ సారి త‌న‌కి కాంగ్రెస్‌తో కాదు, బీజేపీతోనే గ‌ట్టి పోటీ అని క‌నిపెట్టారు. అందుకే జాతీయ పార్టీ పెట్టాల‌ని యోచ‌న‌. ఆయ‌న‌తో ఎంత మంది క‌లిసొస్తారో ఇంకా తెలియ‌దు. గ‌తంలో బీజేపీతో పెద్ద‌గా విభేదాలు లేవు. ఎపుడైతే ఈట‌ల బీజేపీలో చేరి గెలిచాడో అప్ప‌టి నుంచి యుద్ధం ప్రారంభ‌మైంది.

ఈ మ‌ధ్య మోదీ హైద‌రాబాద్ వ‌చ్చిన‌పుడు కూడా కేసీఆర్ న‌గ‌రంలో లేరు. టీఆర్ఎస్ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ అయితే ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న‌ను పెద్ద‌గా గుర్తించ‌లేదు. కేటీఆర్ కూడా బీజేపీపై విమ‌ర్శ‌లు పెంచాడు.

ఈ నేప‌థ్యంలో అగ్నిప‌థ్ ఆందోళ‌న జ‌రిగింది. పోలీసు కాల్పుల్లో చ‌నిపోయిన యువ‌కుడికి టీఆర్ఎస్ నేత‌లు ప్ర‌త్యేక నివాళుల‌ర్పించారు. బీజేపీ విధానాల‌పై దూకుడు పెంచారు. ఇపుడు బీజేపీ జాతీయ స‌మావేశాలే జ‌రుగుతున్నాయి. నేష‌న‌ల్ మీడియా అంతా హైద‌రాబాద్‌లోనే వుంటుంది. ప్లెక్సీలు, హోర్డింగ్‌లు ఆపితే, మోదీ ప్ర‌చారం ఆగుతుందా? ఇది వాజ్‌పేయ్ నాటి బీజేపీ కాదు. మీడియా మేనేజ్‌మెంట్‌లో పండిపోయిన బీజేపీ.

టీఆర్ఎస్‌, బీజేపీ యుద్ధంలో కాంగ్రెస్ ప‌రిస్థితే త‌గ్గిపోతూ వుంది. రేవంత్‌రెడ్డి గ‌ట్టిగానే పోరాడుతున్నా జ‌నం దృష్టి కాంగ్రెస్‌పై లేదు. టీఆర్ఎస్ వ్య‌తిరేక ఓటు చీల్చి, చివ‌రికి టీఆర్ఎస్‌కే ఈ రెండు పార్టీలు మేలు చేస్తాయా? లేదంటే బీజేపీ ఎన్నిక‌ల నాటికి అనూహ్యంగా పుంజుకుంటుందో వేచి చూడాలి.

 

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...