Thursday 14 July 2022

7.50 లక్షల పరిహారం ఇవ్వండి- సుప్రీంకోర్టు ఆదేశాలు

 రేప్ కేసులో జైల్లో ఉన్న ఖైదీకి!!


అత్యాచార కేసుల్లో దోషిగా తేలితే కోర్టులు కఠిన శిక్షను విధిస్తాయి. దోషులను జైల్లో వేసి ఊచలు లెక్కపెట్టేలా చేస్తాయి. ఐతే ఛత్తీస్‌గఢ్‌ లో ఓ విభిన్నమైన కేసు తెరపైకి వచ్చింది. రేప్ కేసులో దోషికిగా తేలి.. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీకి ఏడున్నర లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని   ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరి దీనికి కారణమేంటి? అత్యాచార బాధితురాలికి పరిహారం ఇవ్వడం చూశాం గానీ.. దోషికి డబ్బులు ఇవ్వడమేంటని ఆశ్చర్యపోతున్నారా?. జష్‌పూర్ జిల్లాలోని ఫర్సాబహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్ముండా గ్రామానికి చెందిన భోలా కుమార్ అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ట్రయల్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి... 2014లో జీవిత ఖైదు విధించింది. ఐతే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ... హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లాడు భోలా కుమార్. 2018 జూలై 19న హైకోర్టు కూడా అతడిని దోషిగా నిర్ధారించింది. కానీ శిక్షను మాత్రం తగ్గించింది. జీవిత ఖైదు కాకుండా.. ఆ శిక్షను ఏడేళ్లకు తగ్గించింది. ఐతే హైకోర్టు ఆదేశాల తర్వాత కూడా.. అతడు పదేళ్ల పాటు జైల్లో గడపాల్సి వచ్చింది. విచారణ ఖైదీగా కొన్నాళ్లు, ఆ తర్వాత ఖైదీ ఇంకొన్నాళ్లు.. మొత్తంగా పదేళ్ల పాటు జైల్లో ఉన్నాడు. కానీ తన శిక్ష ఏడేళ్లే అని ఎంత చెప్పినా జైలు అధికారులు వినలేదు. శిక్షను అలాగే కొనసాగిస్తూ వచ్చారు ఈ క్రమంలోనే భోలా కుమార్ అంబికాపూర్ జైలు నుంచే సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. తన శిక్షా కాలం పూర్తైనా.. ఇంకా జైల్లోనే ఉంచుతున్నారని అందులో పేర్కొన్నారు. ఆయ లేఖను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ 

అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం స్పెషల్‌ లైవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ)గా స్వీకరించింది. అనంతరం భోలా కుమార్‌కు న్యాయం సహాయం చేయాలని రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించింది. తన రికార్డులన్నింటినీ సుప్రీంకోర్టులో సమర్పించాలని కోరింది. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా సమాచారాన్ని సేకరించి... సుప్రీంకోర్టులో పత్రాలను సమర్పించింది. దాని ఆధారంగా కేసు విచారణ జరిగింది. హైకోర్టు భోలాకుమార్ శిక్షాకాలం తగ్గించినా.. జైలు అధికారులు దానిని అమలు చేయలేదని.. తేలింది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తన శిక్షాకాలం కంటే ఎక్కువ కాలం జైల్లో ఉన్నందున భోలా కుమార్‌కి.. రూ.

7.50 లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతరం జైలు నుంచి భోలా కుమార్‌ని విడుదల చేశారు.

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...