Monday 8 August 2022

 

        స్వర్ణం సింధూ!

 


 

కామ‌న్వెల్త్ గేమ్స్- 2022లో భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు బంగారు ప‌త‌కం సొంతం చేసుకుంది. 

కెన‌డా షట్ల‌ర్ లీపై పీవీ సింధు విజ‌యం సాధించింది. మ‌హిళ‌ల బ్యాడ్మింట‌న్ సింగిల్స్ ఈవెంట్ లో పీవీ సింధు కామ‌న్వెల్త్ గేమ్స్ లో ఛాంపియ‌న్ గా నిల‌వ‌డం ఇదే తొలిసారి. కామ‌న్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింట‌న్ ఈవెంట్ లో భార‌త్ కు ఇదే తొలి బంగారు ప‌త‌కం కావ‌డం విశేషం.

బ‌ర్మింగ్ హామ్ వేదిక‌గా సోమ‌వారం జ‌రిగిన ఫైన‌ల్ కెన‌డా షట్ల‌ర్ మిచెల్లీ లీని సింధు మ‌ట్టిక‌రిపించింది. మొద‌టి నుండి అధిప‌త్యం క‌న‌బ‌రుత‌స్తూ (21-15, 21-13) ప్ర‌త్య‌ర్థిపై ఘ‌న‌విజ‌యం సాధించి విజేత‌గా నిలిచింది.

2014లో జ‌రిగిన కామ‌న్ వెల్త్ గేమ్స్ లో కాంస్యం, 2018లో ర‌జత ప‌త‌కాలు గెలిచిన చివ‌రికి ఈసారి స్వ‌ర్ణం గెలిచి త‌న ఖాతాలో స‌రికోత్త రికార్డ్ నెల‌కొల్పింది

 

 

 

తెలంగాణ‌లో ఓ రేంజ్‌లో రాజ‌కీయ వేడి ర‌గ‌ల‌నుంది.

 



ఉప ఎన్నిక‌కు టీఆర్ఎస్ సై అంటోంది. అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఉప ఎన్నిక ఫ‌లితం ఏ మాత్రం వ్యతిరేకంగా ఉన్నా  ఉన్నా అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై ప్రభావం  ప‌డ‌నుంది. ఇదే సంద‌ర్భంలో ఈ ఉప ఎన్నికను రాజ‌కీయంగా ల‌బ్ధి పొందేలా మ‌లుచుకోవాల‌ని టీఆర్ఎస్ వ్యూహాత్మ‌కంగా  అడుగులు వేస్తోంది. గ‌తంలో హుజూరాబాద్‌, దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలు కావ‌డం టీఆర్ఎస్‌కు గుణ‌పాఠం నేర్పింది.

దీంతో ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి నుంచి టీఆర్ఎస్ కావాల్సిన‌న్ని పాఠాలు నేర్చుకుంది. మునుగోడు ఉప ఎన్నిక‌లో మాత్రం ఓట‌మి పున‌రావృతం కాకూడ‌ద‌ని గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. మునుగోడు ఉప ఎన్నిక‌లో బీజేపీని చావు దెబ్బ‌తీసి, రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌ర‌శంఖం పూరించ‌డానికి టీఆర్ఎస్ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డ‌నుంది.

ఈ నేప‌థ్యంలో కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డ‌మే ఆల‌స్యం, వెంట‌నే స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్ రెడ్డి ఆమోదించారు. ఇంత వేగంగా రాజీనామాను ఆమోదించ‌డం ద్వారా .... ఉప ఎన్నిక‌కు సిద్ధ‌మ‌నే సంకేతాల్ని టీఆర్ఎస్ పంపింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాజ‌గోపాల్‌రెడ్డి రాజీనామాపై కాల‌యాప‌న చేసి, అన‌వ‌స‌ర చ‌ర్చ‌కు అవ‌కాశం ఇవ్వ‌కూడ‌ద‌ని టీఆర్ఎస్ నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో ఉప ఎన్నిక‌కు టీఆర్ఎస్ సిద్ధంగా ఉన్న‌ట్టు ప్ర‌త్య‌ర్థుల‌కు రాజీనామా ఆమోదంతో హెచ్చ‌రిక పంపింది. ఇక ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌నే ఆల‌స్యం. త‌ల‌ప‌డేందుకు టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ సిద్ధంగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు చివ‌రి ఉప ఎన్నిక కానుండ‌డంతో తెలంగాణ‌లో ఓ రేంజ్‌లో రాజ‌కీయ వేడి ర‌గ‌ల‌నుంది.

 

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...