Monday 8 August 2022

 

        స్వర్ణం సింధూ!

 


 

కామ‌న్వెల్త్ గేమ్స్- 2022లో భార‌త బ్యాడ్మింట‌న్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు బంగారు ప‌త‌కం సొంతం చేసుకుంది. 

కెన‌డా షట్ల‌ర్ లీపై పీవీ సింధు విజ‌యం సాధించింది. మ‌హిళ‌ల బ్యాడ్మింట‌న్ సింగిల్స్ ఈవెంట్ లో పీవీ సింధు కామ‌న్వెల్త్ గేమ్స్ లో ఛాంపియ‌న్ గా నిల‌వ‌డం ఇదే తొలిసారి. కామ‌న్వెల్త్ గేమ్స్ 2022 బ్యాడ్మింట‌న్ ఈవెంట్ లో భార‌త్ కు ఇదే తొలి బంగారు ప‌త‌కం కావ‌డం విశేషం.

బ‌ర్మింగ్ హామ్ వేదిక‌గా సోమ‌వారం జ‌రిగిన ఫైన‌ల్ కెన‌డా షట్ల‌ర్ మిచెల్లీ లీని సింధు మ‌ట్టిక‌రిపించింది. మొద‌టి నుండి అధిప‌త్యం క‌న‌బ‌రుత‌స్తూ (21-15, 21-13) ప్ర‌త్య‌ర్థిపై ఘ‌న‌విజ‌యం సాధించి విజేత‌గా నిలిచింది.

2014లో జ‌రిగిన కామ‌న్ వెల్త్ గేమ్స్ లో కాంస్యం, 2018లో ర‌జత ప‌త‌కాలు గెలిచిన చివ‌రికి ఈసారి స్వ‌ర్ణం గెలిచి త‌న ఖాతాలో స‌రికోత్త రికార్డ్ నెల‌కొల్పింది

 

3 comments:

  1. కామన్వెల్త్ గేమ్స్‌లో సింధుకి ఇదే తొలి స్వర్ణం. 2018లో గోల్డ్ కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో సింధు రజతం సాధించింది. కానీ, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణం సాధించింది. అందులో సింధు భాగం పంచుకున్నారు.

    2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో సింధు కాంస్య పతకాన్ని అందుకుంది.

    ReplyDelete
  2. 2014లో జ‌రిగిన కామ‌న్ వెల్త్ గేమ్స్ లో కాంస్యం, 2018లో ర‌జత ప‌త‌కాలు గెలిచిన చివ‌రికి ఈసారి స్వ‌ర్ణం గెలిచి త‌న ఖాతాలో స‌రికోత్త రికార్డ్ నెల‌కొల్పింది.

    ReplyDelete
  3. Why India continues to take part in commonwealth games which is a colonial thing?🤔

    Moreover they are going to withdraw the games such as wrestling where India wins more medals. Already archery and shooting are withdrawn.

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...