Tuesday, 24 September 2024

 

24 లక్షల జీతంతో ఉద్యోగం.. అదరగొట్టిన జేఎన్‌టీయూ హైదరాబాద్ విద్యార్థులు!

విద్యార్థులు అదరగొట్టేశారు. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTU) హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ రిక్రూట్‌మెంట్ జరిగింది. ఇందులో ఇద్దరు స్టూడెంట్స్ భారీ వేతనంతో జాబ్ సాధించారు. మోటూరి అమూల్య, చల్లా సాయి మహిత రెడ్డి అనే ఇద్దరు విద్యార్థులు దుమ్ముదులిపారు. అత్యధిక వార్షిక ప్యాకేజీ రూ. 24 లక్షలతో గోల్డ్‌మన్ సాక్స్ నుండి జాబ్ ఆఫర్‌లను పొందారు.

JP మోర్గాన్ అండ్ చేజ్ నుండి కాంతు కుసుమిత సంవత్సరానికి రూ. 19.75 లక్షల జాబ్ ఆఫర్‌ను పొందగా, వెరిస్క్ అనలిటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంవత్సరానికి రూ. 17 లక్షల CTCతో నందినీ మహారాజ్‌కి జాబ్ ఆఫర్‌ను అందించింది.

క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఇప్పటివరకు 130 మంది విద్యార్థులు వివిధ కంపెనీల నుండి ఉద్యోగ ఆఫర్‌లను పొందారు. ఫ్రెంచ్ బహుళజాతి జాతీయ కంపెనీ అయిన ఆల్‌స్టోమ్ ఎస్‌ఏ రూ. 8.5 లక్షల వార్షిక ప్యాకేజీతో 33 మంది పీజీ విద్యార్థులను ఎంపిక చేయగా, మరో కంపెనీ హనీవెల్ 15 మంది విద్యార్థులకు ఏడాదికి రూ. 9 లక్షల సీటీసీతో ఉద్యోగాలు ఇచ్చిందని జేఎన్‌టీయూ-హైదరాబాద్ తెలిపింది.

అదేవిధంగా అమెగ్రేడ్ రూ. 6 లక్షల వార్షిక ప్యాకేజీతో ఎనిమిది మంది విద్యార్థులకు ఆఫర్‌లను అందించింది. ఇంకా ఎడిగ్లోబ్ అనే సంస్థ 40 మంది విద్యార్థులను సంవత్సరానికి రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ప్యాకేజీని అందజేస్తున్నట్లు తెలిపింది. యూనివర్శిటీ రెక్టార్ డాక్టర్ కె విజయ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు వివిధ కంపెనీల నుండి ఉద్యోగ ఆఫర్లు అందుకోవడం పట్ల విద్యార్థులను అభినందించారు

 


No comments:

Post a Comment

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...