Sunday 24 July 2022

 

తెలంగాణలో అధికారం కోసం బిజెపి మాస్టర్ ప్లాన్

టీఆర్ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను నియోజకవర్గ స్థాయిలో ఎండగట్టడానికి ఏది సరైన మార్గం..?

అసెంబ్లీలో తమకు సంపూర్ణ బలం ఉందని భావిస్తున్న కారు గుర్తు పార్టీ నేతలకు చెక్‌ పెట్టడం ఎలా

 ..? తమకున్న బలమైన నాయకత్వాన్ని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం ఎలా అనే అంశాలపై

 బీజేపీ హైకమాండ్ గ్రౌండ్‌ వర్క్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది

అందుకే గతంలో ఎంపీలుగా పోటీ చేసిన సీనియర్‌ నేతలను ..ఈసారి అసెంబ్లీ బరిలోకి దింపి తమ

 సత్తా చాటుకోవాలని భావిస్తోంది. ఈ పొలిటికల్ ఈక్వెషన్‌ని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పక్కాగా అమలు చేసి టీఆర్ఎస్‌ను గట్టి దెబ్బ కొట్టాలని చూస్తున్నారు కమలనాథులు. గ్రేటర్

  హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు తెలంగాణలో జరిగిన ఉపఎన్నికల రిజల్ట్స్

 చూసిన తర్వాత బీజేపీ పొలిటికల్ యాక్షన్ ప్లాన్ మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. రాబోయే అసెంబ్లీ

 ఎన్నికల్లో రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ని గట్టి దెబ్బ కొట్టేందుకు ప్రస్తుతం బీజేపీలో ఎంపీలుగా

 ఉన్నవాళ్లు, ఓడిపోయిన వాళ్లు, సీనియర్‌ నేతలను రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల బరిలోకి

 దింపాలని చూస్తోంది బీజేపీ అధిష్టానం. ఇందులో ఎవరూ అతీతులు కాదన్నట్లుగా వ్యూహరచన చేస్తోంది బీజేపీ. రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ తరపున ఎంపీలుగా ఉన్న సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి

 కిషన్‌రెడ్డిని రాబోయే ఎన్నికల్లో గతంలో పోటీ చేసిన అంబర్‌పేట నుంచి రంగంలోకి దింపనుంది. అలాగే  కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని వేములవాడ అసెంబ్లీ నుంచి,  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను ఆర్మూర్‌ శాసనసభ నుంచి, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు నెక్స్ట్ బోథ్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దింపాలని పక్కా ప్రాణాళిక వేస్తోంది బీజేపీ. వీళ్లే కాదు ప్రస్తుతం

 బీజేపీలో ఫైర్ బ్రాండ్స్‌గా పేరు సంపాధించుకున్న విజయశాంతిని మెదక్ అసెంబ్లీ లేదంటే

 గ్రేటర్‌లోని ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారట. బీజేపీ జాతయ

 ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తనకు పట్టున్న గద్వాల నుంచి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డిని

 మహబూబ్‌నగర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని తాండూరు లేదంటే మహేశ్వరం అసెంబ్లీ స్థానం నుంచి

 బరిలోకి దింపాలని చూస్తోంది బీజేపీ హైకమాండ్. గతంలో పెద్దపల్లి పార్లమెంట్ నుంచి ఓడిన వివేక్‌

 సైతం చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది ప్రస్తుతం ఎంపీలు, ఓడిపోయిన ఎంపీలు, సీనియర్ నేతల సంగతి ఇలా ఉంటే ఉపఎన్నికల్లో హుజురాబాద్‌ నుంచి గెలిచిన ఈటల రాజేందర్‌ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌ ఇలాఖ నుంచి పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఈనేపధ్యంల ఆయన్ని గెలిపించిన హుజురాబాద్‌ నియోజకవర్గం నుంచి ఆయన సతీమణి జమునను నిలబెట్టి డబుల్ విక్టరీ కొట్టాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం పబ్లిక్‌ ఫిగర్‌లుగా ఉన్న వాళ్లతో పాటు బీజేపీ జాతీయ నేత మురళీధర్‌రావు

 గతంలో స్టేషన్‌ ఘనపూర్ నుంచి పోటీ చేసిన విజయరామారావును ఎంపీగా పోటీ చేయించాలనే

 ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లుగా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. ఈ మధ్యకాలంలో

 వినిపిస్తున్న మాట కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బిజెపి లో చేరిక దాదాపు కాయం లాగా ఉంది

 అయన కూడా తన స్వంత ఇలాకా మునుగోడు నుండి పోటీ చేపిస్తారని ఊహ గణాలు

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...