Wednesday 21 June 2023

 

అన్ని మతాల ఆచారాలు, సంస్కృతులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుంది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.




తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా  బుధవారం సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆధ్యాత్మిక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో లోక కళ్యాణార్ధం నిర్వహించిన శాంతియాగం, చండీహోమం పూర్ణాహుతి లో పాల్గొన్నారు. ఆలయం ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో వివిధ భాషలు, వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ఆదేశాల మేరకు బోనాలు, గణేష్ నవరాత్రులు, రంజాన్, క్రిస్మస్ తదితర పండుగలను  ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆలయాలు, మసీదులు, చర్చి ల అభివృద్ధి కి అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి లక్షల మంది భక్తులు వచ్చారని, ఎలాంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి  ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాల ఉత్సవాలు ఈ నెల 22 నుండి ప్రారంభం కానున్నాయని,  ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వస్తారని, అందుకు తగినట్లు వివిధ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. బోనాల ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించారని చెప్పారు. మన పండుగలు నేడు దేశ విదేశాలలో జరుపుకోవడం మన అందరికీ గర్వకారణం అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అనేక దేవాలయాలను  ప్రభుత్వం  అభివృద్ధి చేసిందని అన్నారు. సుమారు 1200 కోట్ల రూపాయల వ్యయంతో  చరిత్రలో నిలిచి పోయే విధంగా యాదాద్రి ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, EO మనోహర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

 

కన్నుల పండుగగా బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం




బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం మంగళవారం కన్నుల పండుగగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్వర్ణ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. ముందుగా మంత్రి దంపతులకు ఆలయ  పండితులు పూర్ణ  కుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి వస్త్రాలు సమర్పించిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యవేక్షణలో భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అమ్మవారి కళ్యాణం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కార్పొరేటర్ లు కొలన్ లక్ష్మి బాల్ రెడ్డి, మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.


               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...