Tuesday 17 January 2023

 

అడ్డంగా దొరికిన (అ)ధర్మ నాయక్

 

మెదక్‌ జిల్లా టేక్మల్ వద్ద జరిగిన కారు సజీవదహనం కేసులో బిగ్ ట్విస్ట్‌ చోటు చేసుకుంది. చనిపోయాడనుకున్న సెక్రటేరియట్ లో ఉద్యోగం చేస్తున్న‌ ధర్మానాయక్ సేఫ్ ‌గా ఉన్నారు. అదే కారులో గుర్తు తెలియని వ్యక్తి సజీవదహనం అయ్యాడు. కారులో ఒక‌ వ్యక్తిని ఉంచి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి తానే చనిపోయినట్లుగా పెద్ద స్టోరీ క్రియేట్ చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. 

అసలు ఏం జరిగిందంటే.. సెక్రటేరియట్‌లో పని చేస్తున్న ధర్మానాయ‌క్.. ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లు అడుతూ భారీగా నష్టపోయాడు. ఈ నష్టాన్ని కవర్ చేసేందుకు  సినిమా రేంజ్‌లో స్కెచ్ వేశాడు. కారులో త‌న‌కు బదులుగా మరొకరిని పెట్టి.. తానే సజీవదహనం అయినట్లు సీన్ క్రియేట్ చేశాడు. తాను చ‌నిపోతే త‌న పేరు మీద ఉన్న రూ. 7 కోట్ల‌ ఇన్సూరెన్స్ డబ్బులు వస్తుందని ధర్మా ఈ డ్రామా ప్లే చేసినట్లు తేల్చారు పోలీసులు.

మొద‌ట పోలీసులు ప్ర‌మాదం అనుకున్న‌.. ఘటనా స్థలంలో దొరికిన పెట్రోల్ బాటిల్ ఆధారంగా పోలీసులు ఇంట్రాగేష‌న్ చేసి ధర్మానాయ‌క్ డ్రామా బ‌య‌ట‌పెట్టారు. ఈ ప్ర‌మాదం జ‌రిగిన కేసులో ప్రధాన నిందితుడు ధర్మానే అని తేల్చిన పోలీసులు.. పూణెకి పారిపోయిన నిందితుడిని పట్టుకున్నారు.

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...