Tuesday 11 October 2022

 

తెలంగాణ తొలి గ్రూప్-1 పరీక్ష--

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ నెల 16న నిర్వహించనున్న మొదటి గ్రూప్ 1 పరీక్షకు అధికారులు అన్ని

 ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 503 ఖాళీల భర్తీకి నిర్వహిస్తున్న ఈ పరీక్షకు 3,80,202 లక్షల మంది

 అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇంత భారీనియామకాలు జరుగుతున్నఈ తరుణంలో ఎలాంటి

 అవకతవకలు జరగకుండా అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం అనేక కొత్త

 నిబంధనలను సైతం తీసుకువచ్చారు. తొలిసారిగా గ్రూప్-1 నిర్వహణలో పరీక్షా కేంద్రాల్లో సీసీ

 కెమెరాలను ఏర్పాటు చేస్తోంది పబ్లిక్ సర్వీస్ కమిషన్  ఈ సీసీ కెమెరాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్

 ప్రధాన కార్యాలయానికి.. ఇంకా పోలీస్ కమాండ్ కంట్రోల్ కు సైతం అనుసంధానం చేయనున్నారు.

 బయో మెట్రిక్ విధానాన్ని సైతం తొలిసారిగా తీసుకువస్తోంది టీఎస్పీఎస్సీ

అభ్యర్థులు హాల్ టికెట్ ఉంటేనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబడుతారు. ఇంకా హాల్ టికెట్ తో పాటు పాస్ పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్ , ప్రభుత్వ ఎంప్లాయ్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లో ఏదో ఒకటి గుర్తింపు కార్డుగా వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

-హాల్ టికెట్ మీద ఫొటో, సిగ్నేచర్ స్పష్టంగా కనిపించేలా ఉండాలి. ఇందుకోసం హాల్ టికెట్ ను A4 షీట్ పైన ప్రింట్ తీసుకోవాలి. లేజర్ ప్రింటర్ ద్వారా ప్రింట్ తీసుకోవాలని అధికారులు సూచించారు. కలర్ ప్రింట్ అయితే ఇంకా బెటర్.

-ఒకవేళ హాల్ టికెట్ పై ఫొటో/సిగ్నేచర్ స్పష్టంగా కనిపించకపోతే అభ్యర్థులు 3 పాస్ పోర్ట్ ఫొటోలు వెంట తీసుకురావాల్సి ఉంటుంది. ఆ ఫొటోలను గెజిటెడ్ ఆఫీసర్ తో అటెస్ట్ చేయించాల్సి ఉంటుంది. వీటితో పాటు అండర్ టేకింగ్ ను సైతం ఇన్విజిలేటర్ కు అందించాల్సి ఉంటుంది. పరీక్ష 10.30 నిమిషాలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. అభ్యర్థులను రెండు గంటల ముందు నుంచే అంటే 8.30 గంటల నుంచే ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతించనున్నారు. పరీక్షా కేంద్రం గేట్ ను 10.15 గంటల నుంచే మూయనున్నారు. ఒక్క సారి గేట్ మూస్తే పరీక్ష ముగిసే వరకు తెరిచేది లేదని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాన్ని సందర్శించాలని సూచించారు.

- క్యాలుకులేటర్స్, మాథ్స్ టేబుల్స్, లాగ్ బుక్స్, పేపర్స్, సెల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, వాచ్, లాగ్ టేబుల్స్, వాలెట్, హ్యాండ్ బ్యాంగ్స్, రైటింగ్ ప్యాడ్స్, చార్ట్స్ లాంటివి ఏవీ ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించరు

బూట్లు వేసుకుని ఎగ్జామ్ కు రావొద్దు. కేవలం చెప్పులతో మాత్రమే రావాలని టీఎస్సీఎస్సీ స్పష్టం చేసింది.

- ఎగ్జామ్ సెంటర్ వద్ద మీ వస్తువులను దాచడానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండవు.

-ఎగ్జామ్ సెంటర్ వద్ద అభ్యర్థుల థంబ్ ప్రింట్ తీసుకుంటారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు మెహందీ, ఇంక్, టాటూలు వేసుకోవద్దని టీఎస్పీఎస్సీ సూచించింది.

- హాజరైన అభ్యర్థితో అభ్యర్థి హాల్ టికెట్ పై ఉన్న ఫొటో తో వెంట తీసుకువచ్చిన ఐడెంటిటీ కార్డుపై ఉన్న ఫొటోను చెక్ చేస్తారు. తప్పు అని తేలితే చర్యలు ఉంటాయి.

- ఓఎంఆర్ షీట్ పై హాల్ టికెట్ నంబర్, టెస్ట్ బుక్ లెట్ నంబర్, వెన్యూ కోడ్ ను నమోదు చేయడానికి అభ్యర్థి బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ ను మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఇంక్ పెన్ ను వాడినా.. సూచించిన ప్రదేశాల్లో కాకుండా.. ఇతర చోట పెన్ తో ఏమైనా రాసినా ఓఎంఆర్ షీట్ ను ఇన్వాలిడ్ గా పరిగణిస్తారు.

 

 

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...