Wednesday 29 March 2023

 

యువత చేతిలోనే కర్ణాటక అధికార పీఠం!

 

మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మే 13న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 2.6 కోట్లు కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 2.5 కోట్లు. మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే ద‌శ‌లో ఎన్నికలు జరగనున్నాయి. నేటి (మార్చి 29) నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి(ఎన్నిక‌ల కోడ్‌) అమలు కానుంది, బెంగళూరు సిటీ జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి అనేకల్, బెంగళూరు సౌత్, యశవంతపూర్, దాసరహళ్లి, బ్యాటరాయణపూర్, మహదేవ్‌పూర్ మరియు యలహంక్. ఈ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతో సహా యువ ఓటర్ల సంఖ్య పెరిగింది, గత యువ ఓటర్లతో పోలిస్తే ఈసారి యువ ఓటర్ల సంఖ్య సగానికిపైగా పెరిగింది బెంగళూరు నగర ఎన్నికల జిల్లాలో యువత ఓటరు నమోదులో 49 శాతం పెరుగుదల నమోదైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక సమాచారం ఇచ్చింది బెంగళూరులో గతంలో 54,000 మంది ఉన్న యువ ఓటర్ల సంఖ్య ఇప్పుడు 1.1 లక్షలు దాటిందని బెంగళూరు నగర్ జిల్లా పంచాయతీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంగప్ప తెలిపారు ఇక యువతను మైండ్ లో పెట్టుకొనే రాజకీయా పార్టీలు తమదైన శైలిలో హామిల వర్షం కురిపించాయి. కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి వస్తే డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు రూ.3 వేలు అందిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. అలాగే డిప్లొమా చదివి, నిరుద్యోగులుగా ఉన్న యువతకు రూ.1500 అందిస్తామని చెప్పింది

 

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 104 స్థానాలు రాగా.. కాంగ్రెస్‌కు 78 సీట్లు, జేడీఎస్‌కు 37 సీట్లు వచ్చాయి. అలాగే కర్ణాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ చెరో సీటు గెలుచుకోగా.. ఒకరు ఇండిపెండెంట్ అభ్యర్థి విజయం సాధించారు. ఎన్నికల్లో బీజేపీ ఎక్కువ స్థానాలను గెలుచుకుని అది పెద్ద పార్టీగా అవతరించగా.. జేడీఎస్, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీంతో జేడీఎస్ అధ్యక్షడు కుమారస్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కుమారస్వామి పదవిని కోల్పోవాల్సి వచ్చింది.

కొంతమంది కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు మళ్లడంతో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం బలం కోల్పోయింది. ప్రభుత్వం కూలిపోవడంతో కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీ ప్రభుత్వంలో అవినీతి విపరీతంగా జరుగుతుందనే ఆరోపణలు ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు జరగనున్న కర్ణాటక ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.

 

224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్నాటకలో బీజేపీకి 119 మంది, కాంగ్రెస్ కు 75 మంది, జేడీఎస్ కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ ఈసారి 150 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్నది. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సారథ్యంలో ఎన్నికలు జరగనున్నాయి. మాజీ సీఎం, లింగాయత్ కీలక నేత బీఎస్ యెడ్యూరప్ప 2024లోను మోడీని మూడోసారి ప్రధాని చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. యెడ్యూరప్ప జూలై 2021 వరకు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత బొమ్మై సీఎం అయ్యారు. ఈసారి యెడ్డీ పోటీ చేసే అవకాశాలు తక్కువ. ఆయన తనయుడు విజయేంద్ర శిఖారిపుర నియోజకవర్గం నుండి పోటీ చేయవచ్చునని భావిస్తున్నారు. అలాగే, బాగా పని చేయని ఎమ్మెల్యేలకు బీజేపీ టిక్కెట్ నిరాకరించే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ ఫేస్ ను ఈ ఎన్నికల్లోను ఉపయోగించుకోనున్నారు. ఇటీవల 4 శాతం ముస్లీం రిజర్వేషన్ ను తొలగించి వొక్కలింగ, లింగాయత్ లకు కేటాయించింది బీజేపీ. ఇది ఈ పార్టీకి ప్రయోజనం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి.

రిజర్వేషన్ పునరుద్ధరిస్తామని కాంగ్రెస్

ముస్లీంలకు తొలగించిన నాలుగు శాతం రిజర్వేషన్ ను తాము అధికారంలోకి వస్తే పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మైనార్టీ ఓట్లను ఆకర్షించే ప్రయత్నాలు అప్పుడే ప్రారంభించింది. మాజీ సీఎం సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్ చేస్తున్నారు. కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షులు డీకే శివకుమార్ కు కూడా ప్రాధాన్యత ఇస్తోంది పార్టీ. చాలా రాష్ట్రాల్లో బీజేపీ దరిదాపుల్లోకి రాలేకపోతోంది కాంగ్రెస్. కానీ కర్నాటకలో మాత్రం టఫ్ పైట్ ఇస్తోంది.

జేడీఎస్ కింగ్ మేకర్ ఆశలు

జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ లేదా కింగ్ ఆశలు పెట్టుకున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మెజార్టీ రాకుంటే జేడీఎస్ కు డిమాండ్ పెరుగుతుంది. పాత మైసురు ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లోను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

 

 

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...