Monday 4 July 2022

 

 

పీకే రిపోర్టుల క్రమంలో..BRSకు బైబై..

 

టీఆర్ఎస్ ను జాతీయ స్థాయికి విస్తరించి, బీఆర్‌ఎస్‌ గా మార్చే ప్రతిపాదనను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని, ముందుగా ఇంటిని చక్కదిద్దుకుంటూ పార్టీలో, పాలనపై నెలకొన్న అసంతృప్తిని చల్లార్చాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది..

బీజేపీని బంగాళాఖాతంలో కలిపేలా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో కొత్త జాతీయ పార్టీ (KCR National Party) పెట్టాలనుకున్న తెలంగాణ సీఎం  ప్రస్తుతానికి వ్యూహం మార్చుకున్నారా? రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ కు బైబై చెప్పి కేవలం టీఆర్ఎస్ (TRS)పైనే ఫోకస్ పెంచనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు తప్పవనే అంచనాల నడుమ అధికార పార్టీలోని అసంతృప్తులు పెద్ద ఎత్తున జంపింగ్‌లు చేస్తుండటం, సంక్షేమ పథకాల నత్తనడక కారణంగా ప్రజల్లో పెరుగుతోన్న అసంతృప్తి, దాదాపు అన్ని జిల్లాల్లో అంతర్గత కుమ్ములాటలు, సాధారణంగానే ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత.. తదితర అంశాల నేపథ్యంలో ముందుగా ఇంటిని చక్కబెట్టుకోవాలని, ఆ తర్వాతే బీఆర్ఎస్ సంగతి చూడాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ ను జాతీయ స్థాయికి విస్తరించి, బీఆర్‌ఎస్‌ గా మార్చే ప్రతిపాదనను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని, ముందుగా ఇంటిని చక్కదిద్దుకుంటూ పార్టీలో, పాలనపై ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చే దిశగా అడుగులు వేయాలని సీఎం కేసీఆర్.. ప్రజాప్రతినిధులు, నేతలకు సంకేతాలు ఇచ్చారంటూ ఆంధ్రజ్యోతిఓ సంచలన కథనం రాసింది. బీఆర్ఎస్ కంటే ముందు టీఆర్ఎస్ ను బాగు చేసుకుందామంటూ ప్రగతిభవన్‌లో ఇటీవల తన తో సమావేశమైన ఎమ్మెల్యేలకు కేసీఆర్ నిర్దేశం చేసినట్లు వెల్లడైంది. టీఆర్ఎస్ నుంచి కీలక పదవుల్లో ఉన్నవారు, మాజీ ప్రజాప్రతినిధులు ఇటీవల కాంగ్రెస్బీజేపీ పార్టీల్లోకి వెళుతుండటం, రాబోయే రోజుల్లో వలసలు పెరగొచ్చనే అంచనాల నడుమ ఇంటిని చక్కబెట్టుకునే దిశగా సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనను ఈ నెల 20 అనంతరం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రతి జిల్లాలోనూ కార్యకర్తలకు సమయం ఇవ్వనున్నట్లు తెలిసింది. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు విజయావకాశాలపై ప్రభావం చూపే పరిస్థితులు ఉండటంతో వాటిని చక్కదిద్దే బాధ్యతను కేసీఆర్ స్వయంగా తీసుకోనున్నట్లు సమాచారం. తెలంగాణ కొత్త అప్పులకు కేంద్రం మోకాలడ్డడంతో సంక్షేమ పథకాల అమలుకూ కటకట ఏర్పడటం, ఉద్యోగులకు జీతాలు సకాలంలో ఇవ్వలేని దుస్థితి నెలకొనడంతో సర్వత్రా అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో నెలకొన్న అసంతృప్తిని సెంటిమెంట్‌తో అధిగమించాలన్న ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ బీఆర్‌ఎస్‌ను తెరపైకి తెచ్చారనే భావన కూడా ఉంది. ఈ వ్యూహం పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉన్నట్లు వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ బృందం సర్వేల్లో తేలిందని, పీకే రిపోర్టుల క్రమంలోనే కేసీఆర్ వ్యూహాలను మార్చుకున్నారని తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో పూర్తిగా టీఆర్ఎస్ పైనే ఫోకస్ పెట్టనున్న కేసీఆర్.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వడివడిగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు డబ్బులు, 57 ఏళ్లు నిండినవారికి పింఛన్లు తదితరాలను ఈ ఆగస్టు నుంచే విడుదల చేయాలని సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ధరణి అమల్లోకి వచ్చిన తర్వాత క్షేత్ర స్థాయిలో పెరిగిన భూ సమస్యలు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారిన నేపథ్యంలో వాటి పరిష్కారంపైనా సీఎం దృష్టిసారించినట్లు సమాచారం. త్వరలోనే జిల్లాలవారీగా రెవెన్యూ సదస్సు లు పెట్టి కలెక్టర్ల ఆధ్వర్యంలో ధరణి వల్ల ఏర్పడిన భూ సమస్యల పరిష్కారం చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

 

28 శాతం జీఎస్టీ శ్లాబ్ తొలగింపు..?

 

గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(Goods And Service Tax) అమలులోకి వచ్చిన తర్వాత నలుగు స్లాబ్ లల్లో ట్యాక్స్ లను వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం జీఎస్‌టీ శ్లాబ్‌లో ఎక్కువగా ఉన్న 28 శాతం కొనసాగుతోంది.

 

వన్ నేషన్.. వన్ రేషన్ లాగా.. ఒకే దేశం.. ఒకే పన్నులాగా మారడం చాలా క్లిష్టమైన పని అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక ఈ నాలుగు శ్లాబ్ లు కాకుండా.. బంగారం, నగలుపై 3 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.

గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమలులోకి వచ్చిన తర్వాత నలుగు స్లాబ్ లల్లో ట్యాక్స్ లను వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం జీఎస్‌టీ శ్లాబ్‌లో ఎక్కువగా ఉన్న 28 శాతం కొనసాగుతోంది. ఈ 28 శాతం జీఎస్టీ శ్లాబులో విలాసవంతమైన వస్తువులు, హానికరమైన వస్తువులు ఈ జాబితాలో ఉన్నాయి అయితే ప్రస్తుతం ఉన్న జీఎస్టీ శ్లాబులను సవరించాలని, 28 శాతం పన్నును తొలగించాలని చాలా కాలంగా డిమాండ్‌ ఉంది. అంతే కాదు.. 5,12, 18 మూడు రకాల శ్లాబులను కుదించి రెండే ఉండాలన్న దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. దీనిపై రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ మాట్లాడారు.  చాలా కాలం నుంచి డీజిల్ , పెట్రోల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న డామాండ్ కొనసాగుతోంది..కానీ దీనిపై వ్యతిరేకత కూడా ఉందని అన్నారు. ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు ఒక వేళ వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు కోల్పోయే అదాయంపై స్పష్టత రానంత వరకు దీనిపై ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ కార్యదర్శి కూడా దృవీకరించారు . అంతే కాకుండా.. కేంద్రం, రాష్ట్రాలకు మధ్య ఈ విషయంపై కొన్ని అభ్యంతరాలు ఉన్నట్లు పేర్కొన్నారు. జీఎస్టీ శ్లాబ్ లో ఉన్న 5,12,18 శాతం ట్యాక్స్ లను రెండుగా కుదించే విషయంపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు.  దీనిలో సెంట్రల్(CGST 1.5) మరియు స్టేట్ ట్యాక్స్(SGST 1.5) లు ఉంటాయి. ఇక ఈ పన్నుల్లో మార్పులు, జీఎస్టీ పరిధిని ఎలాంటి వాటికి మినహాయించాలనే దానిపై అధ్యాయనం చేయడానికి కమిటీని వేసినట్లు తెలిపారు.  దీనికి ఒక నివేదిక ఇవ్వాలని కర్ణాటక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదికి ఇవ్వడానికి 3 నెలల సమయం పడుతుందన్నారు

 

ప్రజలతో పాటు గన్నుకు కూడా స్వాతంత్రం వచ్చినట్టుంది!

అమెరికాలో సోమవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరుగుతోన్న పరేడ్‌పై ఒక సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆరుగురు చనిపోయారు.

షికాగో సమీపంలోని హైలాండ్ పార్క్‌ వద్ద జరిగిన ఈ దాడిలో కనీసం 24 మంది గాయపడ్డారు.

ఈదాడికి పాల్పడినట్లు అనుమానిస్తోన్న 22 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసినట్లు హైలాండ్ పార్క్ పోలీసు చీఫ్ తెలిపారు. ఒక రైఫిల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. హైలాండ్ పార్క్ దాడి ఘటనలో బాధితులను కాపాడేందుకు స్థానిక యంత్రాంగానికి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

పరేడ్‌పై దాడి గురించి తెలియగానే షాక్‌కు గురయ్యానని అన్నారు. అమెరికాలో తుపాకీ హింసకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పారు.

పరేడ్‌లో పాల్గొన్న ప్రజలపై ఎత్తైన భవనం నుంచి దుండగుడు కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. చిన్న పిల్లలతో సహా అక్కడికి వచ్చిన వందలాది మంది భయంతో పరుగులు తీశారని చెప్పారు.

అరెస్ట్ అయిన వ్యక్తిని 22 ఏళ్ల రాబర్ట్ ఎక్రిమోగా గుర్తించినట్లు హైలాండ్ పార్క్ పోలీస్ చీఫ్ లౌ జోగ్‌మన్ తెలిపారు.దాడి చేసిన వ్యక్తిని ఎలా గుర్తించారో వివరించడానికి పోలీసులు నిరాకరించినట్లు వార్తా సంస్థ పీటీఐ చెప్పింది.

అమెరికాలో వారానికోసారి కాల్పులు జరపడం ఆనవాయితీగా మారిందని ఇల్లినాయిస్ రాష్ట్ర గవర్నర్ జె. రాబర్ట్ హెచ్చరించారు.

కవాతు ప్రారంభమైన 10 నిమిషాలకే కాల్పులు ప్రారంభమయ్యాయి.అమెరికాలో గత నెలలో కూడా టెక్సస్, బఫెలో సూపర్‌ మార్కెట్‌ సహా పలు చోట్ల కాల్పులు జరిగాయి.

 

 

తెలంగాణా జర్నలిస్టుల అక్రిడెషన్ గడువు పెంపు

 

తెలంగాణా జర్నలిస్టుల అక్రిడెషన్ కార్డుల వ్యాలిడిటిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2022 మార్చి 31తో అక్రిడెషన్ కార్డుల గడువు ముగుస్తుంది. కానీ సాంకేతిక కారణాల వల్ల రెన్యూవల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్రిడెషన్ కార్డుల వ్యాలిడిని జూన్ 30 వరకు పొడిగిస్తునట్టు సమాచార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 2021 డిసెంబ‌ర్ 31వ తేదీతో మీడియా అక్రిడేష‌న్ల గ‌డువు ముగిసింది. తర్వాత ఈ గ‌డువును మ‌రో 3 నెల‌ల‌ (31-09-2022) వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పుడు తాజాగా మళ్లీ మరో 3 నెలలు గడువు పెంచడం గమనార్హం.

 

మరో కీలక నగరాన్ని స్వాధీనం చేసుకున్న రష్యా..

లూహాన్స్క్ ప్రాంతం మొత్తం ఇప్పుడు రష్యా బలగాల చేతుల్లోకి వచ్చిందని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఆదివారం నాడు దేశాధ్యక్షుడు పుతిన్‌తో చెప్పారు.

తీవ్రమైన యుద్ధం తర్వాత యుక్రెయిన్ సైనికులు తమ పోరాటాన్ని ఉపసంహరించుకున్నారని ఆ దేశ ఆర్మీ జనరల్ ప్రకటించారు.

అంతకుముందు.. లీసిచాన్స్క్ నగరం నడిబొడ్డున చెచెన్ ఫైటర్లు ఉన్న దృశ్యాలను చూపుతున్నట్లుగా కనిపిస్తున్న వీడియోను రష్యాకు చెందిన చెచెన్ రిపబ్లిక్ అధిపతి రమజాన్ కాదిరోవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మరోవైపు పశ్చిమాన యుక్రెయిన్ ఆధీనంలో ఉన్న స్లోవియాన్స్క్ నగరం మీద భారీ షెల్లింగ్ దాడులు జరిగాయి. ఈ కాల్పుల్లో కనీసం ఆరుగురు చనిపోయారు.

ఈ నగరం దోన్యస్క్ ప్రాంతంలో ఉంది. దోన్యస్క్, లూహాన్స్క్ ప్రాంతాలు కలిసివుండే పారిశ్రామిక డోన్బాస్ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవాలన్నది రష్యా వ్యూహం.

యుక్రెయిన్ మీద యుద్ధం ప్రారంభించటానికి ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్.. లూహాన్స్క్, దోన్యస్క్ ప్రాంతాలను యుక్రెయిన్ నుంచి స్వతంత్రమైన ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో రష్యా ప్రచ్ఛన్న బలగాలు 2014లో అంతర్గత తిరుగుబాటును ప్రారంభించాయి.

రష్యా బలగాలు వారం రోజుల కిందట సెవెరోదోన్యస్క్ నగరాన్ని హస్తగతం చేసుకున్నాయి. అప్పటికే కొన్ని వారాల పాటు సాగిన రష్యా బాంబుదాడుల్లో ఆ నగరం శిథిలాల మయంగా మారింది.

అయితే.. లూహాన్స్క్ ప్రాంతంలో యుక్రెయిన్ ఆధీనంలో ఉన్న చిట్టచివరి ప్రధాన నగరం లీసిచాన్స్క్. ఈ నగరాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఈ ప్రాంతం మొత్తంపైన ఇప్పుడు రష్యా పట్టు సాధించిందని రష్యా రక్షణ శాఖ మంత్రి ప్రకటించారు.

రష్యా సైన్యం ఆ నగరంలోకి ప్రవేశించినట్లు సోషల్ మీడియాలో చాలా వీడియోలు చూపుతున్నాయి. నగరంలోనే ఉండిపోయిన స్థానికులు కొందరు రష్యా సైనికులను 'విముక్తి ప్రదాతలు'గా హర్షాతిరేకాలతో ఆహ్వానిస్తున్న దృశ్యాలు కూడా కొన్ని వీడియోల్లో కనిపిస్తున్నాయని బీబీసీ డిఫెన్స్ కరెస్పాండెంట్ జొనాథన్ బాలే పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కొంతమేరకు రష్యా అనుకూల భావజాలం ఎల్లప్పుడూ ఉంది.

సెవెర్స్కీ డోనెట్స్ నదికి ఒకవైపు సెవెరోదోన్యస్క్ నగరం ఉంటే.. మరోవైపు లీసిచాన్స్క్ నగరం ఉంటుంది. ఎత్తు మీద నిర్మితమైన ఈ నగరం రష్యా బలగాల నుంచి సహజమైన రక్షణ కల్పిస్తుందనే ఆశ కొంతవరకూ ఉండింది. కానీ నగరం నుంచి రాకపోకలు సాగించే మార్గాలన్నిటినీ రష్యా బలగాలు నియంత్రిస్తుండటంతో ఈ నగరానికి ఉచ్చు బిగుసుకుంటోందని జొనాథన్ వివరించారు.

యుక్రెయిన్ సైనిక కమాండర్లు.. భారీ ప్రాణనష్టాన్ని పణంగా పెడుతూ పోరాటం కొనసాగించాలా, లేదంటే పోరాటాన్ని వాయిదా వేయటానికి తమ సైనికులను ఉపసంహరించుకోవాలా అని ఆలోచించుకుని, చివరకు కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. గత వారం రోజుల్లో దిగువ ప్రాంతాలకు కొన్ని యూనిట్లు వెనుదిరిగివెళ్లగా, ఇప్పుడు పూర్తి పోరాటాన్ని ఉపసంహరించుకుంది యుక్రెయిన్.

ఈ నగరంలో జరుగుతున్న పరిణామాల విషయంలో యుక్రెయిన్ ప్రభుత్వ పెద్దలు అసాధారణంగా మౌనం పాటిస్తున్నారు. సైనికచర్యల భద్రత కారణాలు ఇందుకు కొంతవరకూ కారణం కావచ్చు. వ్యూహాత్మకంగా వెనుకంజ వేయటం జరుగుతున్నట్లయితే.. ఆ విషయాన్ని ప్రసారం చేయాలని వారు కోరుకోకపోవచ్చు. అయితే లీసిచాన్స్క్ నగరాన్ని కోల్పోవటం తూర్పున యుక్రెయిన్‌కు మారో ఎదురుదెబ్బగా చూస్తారు.

లూహాన్స్క్ ప్రాంతానికి స్వాతంత్ర్యంలభించిందని రష్యా ప్రకటించింది. అయితే, తాము ఒక నగరంలో మాత్రమే ఓడిపోయామని, మొత్తం యుద్ధంలో ఓడిపోలేదని లూహాన్స్క్ గవర్నర్ సెర్హీయ్ హైదాయ్ బీబీసీ ప్రతినిధి జో ఇన్‌వుడ్‌తో చెప్పారు.

రష్యా వద్ద ఉన్న ఆయుధాలు, పేలుడు పదార్థాలతో లీసిచాన్స్క్ నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేసే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో ఇంక తమ దళాలు అక్కడ ఉండి పోరాడటం సరికాదనే తాము వెనక్కు తగ్గామని ఆయన తెలిపారు.

కాగా, లూహాన్స్క్ ప్రాంతాన్ని తిరిగి తాము స్వాధీనం చేసుకుంటామని యుక్రెయిన్ అద్యక్షుడు జెలియెన్‌స్కీ ప్రకటించారు.

లీసిచాన్స్క్ నగరం రష్యా చేతుల్లోకి వెళ్లిపోయినా డోన్బాస్ ప్రాంతంలో పోరాటం ముగిసినట్లు కాదు. దోన్యస్క్‌లోని చాలా పట్టణ ప్రాంతాలు ఇంకా యుక్రెయిన్ నియంత్రణలోనే ఉన్నాయి. ఆ దేశ బలగాలు బక్ముత్, స్లోవియాన్స్క్ ప్రాంతాల మధ్య కొత్త రక్షణ క్షేత్రాలను నిర్మిస్తున్నాయి. అయితే ఆ ప్రాంతాలపై భారీగా రష్యా షెల్లింగ్ దాడి జరుగుతోంది. ఇరువైపులా భారీగా ప్రాణ నష్టం సంభవిస్తోంది.

రష్యా పురోగతిని యుక్రెయిన్ ఆపగలదా? రష్యా ఈ గెలుపు పరంపరను కొనసాగించగలదా? అన్నది ఇప్పుడు ప్రశ్న.

దోన్యస్క్ ప్రాంతంలోని స్లోవ్యాన్స్క్, క్రమటోర్స్క్ నగరాలు ఇంకా యుక్రెయిన్ చేతుల్లోనే ఉన్నాయి. స్లోవ్యాన్స్క్ నగరం మీద రష్యా భారీగా బాంబు దాడులు చేస్తోంది.

ఇదిలావుంటే.. యుక్రెయిన్ ఉత్తర సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో.. రష్యా భూభాగంలో గల బల్గోరాడ్ నగరం మీద యుక్రెయిన్ ఉద్దేశపూర్వకంగా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిందని రష్యా ఆరోపించింది.

ఈ దాడుల్లో నలుగురు చనిపోయారని స్థానిక గవర్నర్ చెప్పారు. యుక్రెయిన్ టోచ్కా-యు మిసైళ్లు మూడింటిని తాము కూల్చివేశామని, వాటి శిథిలాలు ఒక అపార్ట్‌మెంట్ మీద పడ్డాయని రష్యా సైనిక కమాండర్ పేర్కొన్నారు.

రష్యా వాదనను యుక్రెయిన్ అధికారులు తిరస్కరించారు. రష్యా ఆ నగరంలో ప్రజలను రెచ్చగొట్టటానికి నాటకం ఆడిందని వారు ఆరోపించారు.

 

 

టెస్టుల్లో పంత్‌ అరుదైన రికార్డు!

టెస్టు క్రికెట్‌లో రిషబ్‌ పంత్‌ అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టులో సెంచరీతో చెలరేగిన పంత్‌.. రెండో ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీతో మెరిశాడు. తద్వారా ఒకే టెస్టులో సెంచరీ, అర్ద సెంచరీ సాధించిన రెండో భారత వికెట్‌ కీపర్‌గా పంత్‌ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో పంత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 146 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 57 పరుగులు సాధించాడు ఇక అంతకుముందు 1973లో భారత మాజీ వికెట్‌ కీపర్‌ ఫరోఖ్ ఇంజనీర్ ఇంగ్లండ్‌పై రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా సెంచరీ, హాప్‌ సెంచరీ సాధించాడు. అతడు తొలి ఇన్నింగ్స్‌లో 121 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేశాడు. అదే విధంగా ఒకే టెస్టులో అ‍త్యధిక పరుగులు చేసిన మూడో భారత వికెట్‌ కీపర్‌గా పంత్‌(203) నిలిచాడు. 230 పరుగులతో బుద్ధి కుందరన్ తొలి స్ధానంలో ఉండగా, ఎంస్ ధోని 224 పరగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

 

 

కళకలలాడే కళాభారతి ఇప్పుడు కష్టాల్లో

పౌరాణిక, జానపద కళలకు వస్త్ర, వేషధారణలు ఎంత ముఖ్యమో అప్పటి తరం ప్రజలకు తెలుసు. ఆ కళలు అంతరించి పోకుండా, తమ వంతుగా నేటి తరం యువతీయువకులకు పౌరాణిక, జానపదాల పట్ల ఆసక్తి కలిగేలా నాగర్‌కర్నూల్ జిల్లాలోని కళాభారతి కృషి చేస్తుంది.

పౌరాణిక, జానపద (Folk drama)కళలు అంతరించిపోతున్నాయి. సినిమాలు, ఓటీటీలకే ప్రేక్షకులు పరిమితం అవుతున్నారు. భారతీయ సాంప్రదాయ కళలు కనుమరుగవుతున్నా నేటి రోజుల్లో ఎక్కడోచోట..ఆ కళలతాలూకు గుర్తులు మిగిలే ఉంటున్నాయి. పౌరాణిక, జానపద కళలకు వస్త్ర, వేషధారణలు ఎంత ముఖ్యమో అప్పటి తరం ప్రజలకు తెలుసు. ఆ కళలు అంతరించి పోకుండా, తమ వంతుగా నేటి తరం యువతీయువకులకు పౌరాణిక, జానపదాల పట్ల ఆసక్తి కలిగేలా నాగర్‌కర్నూల్(Nagarkurnool)జిల్లాలోని కళాభారతి(Kala Bharati)కృషి చేస్తుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ కళాభారతి బృందం ఉంది. ఒకప్పుడు శాస్త్రీయ, సాంప్రదాయక, గిరిజన నృత్య కళల శిక్షణా కేంద్రంగా కళాభారతి విరాజిల్లింది. 1977లో కళా పిపాసి శేషబట్టర్ నరసింహ చార్యులు ఈ కళాక్షేత్రాన్ని స్థాపించారు. కళాకారులను, రంగస్థల నటులను ఎంతో ప్రోత్సహించేవారు నరసింహ చార్యులు. దాదాపు 40 ఏళ్లుగా కళలకు అంకితమైన కళాభారతి..నేడు కళ తప్పింది. కరోనా పరిస్థితులు, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరువై.. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతుంది. నాగర్‌కర్నూల్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో ఉన్న ఈ కళాభారతి క్షేత్రాన్ని కళాపిపాసి శేషబట్టర్ నరసింహచార్యులు 1977లో స్థాపించారు. వృత్తి రీత్యా ప్రభుత్వ ఉపాధ్యాయుడైన నరసింహచార్యులు ప్రవృత్తిగా నాటకాలు వేసేవారు. కళామతల్లి పట్ల తనకున్న మక్కువతో దేశవ్యాప్తంగా అనేక నాటకాలు వేశారు. రంగస్థల నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. నాటకాలు వేస్తున్న క్రమంలో మేకప్ సామాగ్రి కోసం, కస్ట్యూమ్స్ కోసం తరచూ కర్నూలు వెళ్లాల్సి వచ్చేది. నాటకాలు వేసిన ప్రతీసారి కర్నూలు వెళ్లడం, అక్కడ సామాగ్రిని అద్దెకు తీసుకుని.. తిరిగి నాటకం ముగిశాక అప్పగించేవారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో చింతమణి, బాలనాగమ్మ వంటి నాటకాలను 3,4 రోజుల తరబడి వేసేవారు. ఇలా నాటకాలు వేస్తున్న క్రమంలో కాస్ట్యూమ్స్ కోసం కర్నూల్ వెళ్లడం ఇబ్బందిగా మారడంతో తానే స్వయంగా డ్రామా, డ్రెస్ కంపెనీని ఏర్పాటు చేయాలని నరసింహచార్యులు ఆలోచన చేశారు. అనుకున్నదే తడువు... స్నేహితులు, బంధుమిత్రుల సహకారంతో వ్యాపార దృక్పధంతో కాకుండా కళకు సేవచేయాలని ఆలోచనతో నాగర్‌కర్నూల్ పట్టణ కేంద్రలో కళాభారతి క్షేత్రాన్ని స్థాపించారు. అప్పటి నుంచి నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్కడ నాటకాలు ప్రదర్శించినా కళాభారతి నుంచే డ్రామా, డ్రెస్ మెటీరియల్ వెళుతూ ఉండేవి. దాదాపు 40 ఏళ్ల పాటు కళాకారులను ప్రోత్సహిస్తూ కళకు జీవం పోస్తూ వచ్చింది కళాభారతి. భాద్యతగా భావించిన కుటుంబ సభ్యులు: తన జీవితకాలన్ని కళామతల్లికి సేవలు చేసిన శేషబట్టర్ నరసింహచార్యులు 90 ఏళ్ల వయసులో 2021 సెప్టెంబర్ 05న అనారోగ్యంతో మరణించారు. ఆయన అనంతరం వారి కుమారులైన బట్టర్ శ్రీనివాసచార్యులు కళాభారతి బాధ్యతలను స్వీకరించారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా నేటికి కళాకారులను ప్రోత్సహిస్తూ కళాభారతిని నిర్వహిస్తున్నారు. రంగస్థల నాటకాలపై అభిమానంతో ఆర్థికంగా ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా కళాభారతి పేరు ప్రఖ్యాతలు ఏమాత్రం తగ్గకుండా శాయశక్తుల కృషిచేసి కళాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. నిత్యకళ్యాణం పచ్చతోరణం అనే విధంగా ప్రతి రోజూ ఏదో ఒక కార్యక్రమంతో కళకలలాడే కళాభారతి ఇప్పుడు కష్టాల్లో ఉంది. కరోనా ప్రభావం కళాభారతి క్షేత్రంపై కూడా పడటంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. జనాలు గుమిగూడే అవకాశం ఉందని నాటకాలకు అనుతులు లభించకపోవడంతో నాటకాలపై కోలుకోలేని దెబ్బపడింది. కళాభారతి నిర్వహణ, ఉద్యోగులకు జీతాలు కూడా సరిపోక దాదాపు మూసేసి పరిస్థితికి వచ్చింది. ఈ కష్టాల నుంచి గట్టేందుకు నిర్వహకులు బట్టర్ శ్రీనివాసాచార్యులు ప్రభుత్వ సాయం కోరుతున్నారు. ప్రత్యేక గ్రాంటులతో కళను బతికించుకునేందుకు లోన్ సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వం చేసే సహాయం వలన నాటకరంగాన్ని కాపాడి కళాకారులను ప్రోత్సహించవచ్చని తెలిపారు

 

 ప్రైవేట్ హాస్టల్‌లో నైన్త్ క్లాస్ స్టూడెంట్ మృతి!!!?

కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఉద్రిక్తత నెలకొంది. ప్రైవేట్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న స్టూడెంట్ చనిపోవడంపై అనుమానం వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. కారణం చెప్పమంటే యాజమాన్యం చెప్పకపోవడంతో ధర్నా కొనసాగిస్తున్నారు.

ప్రైవేట్ హస్టల్‌లో ఉండి చదువుకుంటున్న విద్యార్ధిని అకస్మాత్తుగా చనిపోయింది. బాలిక మృతి( girl died)కి కారణం ఏమై ఉంటుందని పేరెంట్స్ హాస్టల్ నిర్వాహకుల్ని ప్రశ్నించారు. అందుకు రెసిడెన్షియల్ స్కూల్ యాజమాన్యం సమాధానం చెప్పకపోవడంతో చేపట్టిన ఆందోళన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఉద్రిక్త పరిసిస్థితులకు కారణమైంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని న్యూ మిలీనియం హాస్టల్లో తొమ్మిదవ తరగతి చదువుతోంది తిప్పిరెడ్డి అఖిల అనే బాలిక. ఆదివారం అఖిల హాస్టల్‌లో ఉన్న సమయంలోనే చనిపోయింది. హాస్టల్ యాజమాన్యం విషయాన్ని పేరెంట్స్‌కి తెలియపరిచారు. బిడ్డ మరణవార్త వినగానే హాస్టల్‌కి వచ్చిన అఖిల పేరెంట్స్ తమ బిడ్డ ఎలా చనిపోయింది..కారణం ఏమిటని హాస్టల్ యాజమాన్యాన్ని నిలదీశారు. కారణం చెప్పకపోగా హాస్టల్ యాజమాన్యం మృతురాలి తల్లిదండ్రులను మాటలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బిడ్డ చనిపోయిన బాధతోనే ఎలా చనిపోయిందో చెప్పమని పట్టుబట్టారు అఖిల తల్లిదండ్రులు. న్యూ మిలీనియం హాస్టల్ యాజమాన్యం, సిబ్బంది సరైన సమాధానం చెప్పకపోవడంతో అఖిల తల్లిదండ్రులు, బంధువులు ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. అఖిల మృతికి కారణాలు చెప్పాల్సిందేనంటూ ఆదివారం నుంచి స్కూల్‌ ముందు టెంట్ వేసుకొని ఆందోళనకు దిగారు. దీంతో హాస్టల్‌ దగ్గరకు భారీగా పోలీసులు చేరుకొని వారి ధర్నాను భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు కదిలేది అఖిల తల్లిదండ్రులు పట్టుబట్టారు మరోవైపు అఖిలది సహజ మరణమా లేక హత్య, ఆత్మహత్య అర్ధం కాకపోవడంతో అఖిలపక్షం విద్యార్ధి సంఘాలు సైతం ఆందోళన చేపట్టాయి. స్టూడెంట్‌ మృతిపై నెలకొన్న అనుమానాలకు సమాధానం చెప్పాలంటూ హుజురాబాద్‌- జమ్మికుంట హైవేపై భైఠాయించారు. విద్యార్ధి సంఘాల రాస్తారోకోతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు ఘటన స్తలానికి చేరుకొని విద్యార్ధి సంఘాల నాయకుల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. మరోవైపు చనిపోయిన స్టూడెంట్ అఖిల మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచి బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు. న్యూమిలీనియం హాస్టల్ యజమాని అధికార పార్టీకి చెందిన వీణవంక ఎంపీపీ ముషఇపట్ల రేణుకా భర్త తిరుపతిరెడ్డి కావడం వల్లే తమ ఆందోళనను పట్టించుకోవడం లేదని విద్యార్ది తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈవిషయంలో తమకు న్యాయం జరిగే వరకు ..కాలేజీ యాజమాన్యం సమాధానం చెప్పే వరకూ ఆందోళన కొనసాగిస్తామని చెబుతున్నారు.

 

అగ్నిపథ్ పిటిషన్ల పై విచారణకు స్వీకరిస్తున్నట్లు సుప్రీం వెల్లడి!!

 

సాయుధ బలగాల్లో ఉద్యోగాల భర్తీ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ (Agnipath Scheme) పథకంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. వచ్చేవారం ఈ వ్యవహారంపై వాదనలు విననున్నట్లు దేశ సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. అగ్నిపథ్ స్కీమ్ కింద ఇప్పటికే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో దరఖాస్తు ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది ధరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే, ఈ పథకం ప్రకటించిన నాటి నుంచే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అగ్నిపథ్‌ను రద్దు చేయాలంటూ పలు ప్రాంతాల్లో చేపట్టిన నిరసన.. హింసాత్మక ఘటనలకు దారితీసింది. అగ్నిపథ్ పథకంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇండియన్ నేవీ అభ్యర్థుల తరఫున దాఖలైన పిటిషన్‌పై వారి తరఫు లాయర్ మాట్లాడుతూ.. ఆ అభ్యర్థులు ఇప్పటికే శిక్షణ పొందారని, అపాయింట్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇలాంటి సమయంలో వారు ఉద్యోగంలో ఉండే కాలం.. ఒక్కసారిగా 20 ఏళ్ల నుంచి 4 సంవత్సరాలకు తగ్గిపోనుందని వివరించారు. ఇది చాలా ముఖ్యమైన విషయమని, దీనిపై సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపించాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఎంతో మంది అభ్యర్థుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. త్రివిధ బలగాల్లో స్వల్పకాలం సేవలందించే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం గత నెల అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకొచ్చింది. కొవిడ్ కారణంగా రెండేళ్ల నుంచి రిక్రూట్‌మెంట్ చేపట్టకపోవడంతో.. ఆ మేరకు అర్హత వయసు రెండేళ్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగాలకు 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులుగా ఉండగా.. ఈ ఏడాదికి ఆ పరిమితిని 23 ఏళ్లకు పెంచింది. ఎంపికైన వారు అగ్నివీరులుగా నాలుగేళ్ల పాటు సేవలు అందిస్తారు. ఆ తర్వాత 25 శాతం మందిని శాశ్వత కేడర్‌కు ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. మిగిలిన 75 శాతం మంది పెన్షన్ లేకుండా రిలీవ్‌ అవుతారు. అయితే, రిలీవ్‌ సమయంలో కేంద్రం వారికి సుమారు రూ.11 లక్షలు ఇవ్వనుంది.

సైన్యంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు, ముఖ్యంగా కొవిడ్ కారణంగా రెండేళ్లుగా నిరీక్షిస్తున్న అభ్యర్థులు కేంద్రం ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా దీనిపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సమ్మర్ వెకేషన్ తర్వాత తిరిగి కార్యకలాపాలను ప్రారంభిస్తున్న న్యాయస్థానం.. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించనుంది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనున్నట్లు తెలుస్తోంది.

 

అమెరికా పౌరసత్వాల్లో పెరిగిన భారతీయులు

  ఆర్థిక, సైనిక రంగాల్లో చైనా ఎంతగా ఎదుగుతున్నప్పటికీ వలసదారులకు పెద్దన్నలా ఉండటమే అమెరికాను అగ్రరాజ్యంగా నెలబెడుతోందనడం అతిశయోక్తికాదేమో. ప్రపంచం నలుమూలల నుంచి అమెరికాకు వలసలు ఇప్పటికీ పెద్ద సంఖ్యలోనే సాగుతున్నాయి. అమెరికాలో పుట్టినవారికి, నిర్దిష్ట కాలంపాటు అక్కడ పనిచేసి, ఇకపైనా ఉండాలనుకునే వారికి పౌరసత్వాలు (US Citizenship) జారీ చేయడం చాలా కాలంగా వస్తున్నదే. అయితే, అమెరికా పౌరసత్వం పొందుతోన్న వారిలో భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది.

అమెరికాలో 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కొత్తగా పౌరసత్వం పొందినవారు ఎక్కువగా ఉన్న తొలి 5 దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. అమెరికా అంతర్గత భద్రతా విభాగం గణాంకాల ప్రకారం.. ఈ త్రైమాసికంలో మొత్తం 1,97,148 మందికి పౌరసత్వం ఇవ్వగా ఈ 5 దేశాలకు చెందినవారే 34% ఉన్నారు.

అమెరికా పౌరసత్వం పొందినవారిలో అత్యధికంగా మెక్సికో నుంచి 24,508 మంది ఉండగా.. భారత్‌కు చెందిన వారు 12,928 మంది ఉన్నారు. ఫిలిప్పీన్స్‌ (11,316), క్యూబా (10,689), డొమినికన్‌ రిపబ్లిక్‌ (7,046)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2021లోనూ తొలి త్రైమాసికంలో మొదటి 5 స్థానాల్లో ఉన్న దేశాల్లో మెక్సికో, భారత్‌లు ముందంజలో ఉండగా క్యూబా, ఫిలిప్పీన్స్‌, చైనాలు తర్వాతి వరుసలో నిలిచాయి. అమెరికాలో అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆర్థిక సంవత్సరంగా పరిగణిస్తారు. ఈమేరకు 2022 ఆర్థిక సంవత్సరంలో జూన్‌ 15 నాటికి మొత్తం 6,61,500 మంది కొత్తగా పౌరసత్వం పొందినట్లు అమెరికా పౌరసత్వ, వలసల సేవా విభాగం (యూఎస్‌సీఐఎస్‌) తెలిపింది. '2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 8,55,000 మందికి పౌరసత్వం ఇచ్చినట్లు యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. అమెరికా జులై 4న స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకొంటున్న నేపథ్యంలో ఈనెల 1 నుంచి 8వ తేదీ మధ్య కొత్తగా 6,600 మందికి పైగా పౌరసత్వాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...