Monday 4 July 2022

 

ప్రజలతో పాటు గన్నుకు కూడా స్వాతంత్రం వచ్చినట్టుంది!

అమెరికాలో సోమవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరుగుతోన్న పరేడ్‌పై ఒక సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆరుగురు చనిపోయారు.

షికాగో సమీపంలోని హైలాండ్ పార్క్‌ వద్ద జరిగిన ఈ దాడిలో కనీసం 24 మంది గాయపడ్డారు.

ఈదాడికి పాల్పడినట్లు అనుమానిస్తోన్న 22 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసినట్లు హైలాండ్ పార్క్ పోలీసు చీఫ్ తెలిపారు. ఒక రైఫిల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. హైలాండ్ పార్క్ దాడి ఘటనలో బాధితులను కాపాడేందుకు స్థానిక యంత్రాంగానికి పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

పరేడ్‌పై దాడి గురించి తెలియగానే షాక్‌కు గురయ్యానని అన్నారు. అమెరికాలో తుపాకీ హింసకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పారు.

పరేడ్‌లో పాల్గొన్న ప్రజలపై ఎత్తైన భవనం నుంచి దుండగుడు కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. చిన్న పిల్లలతో సహా అక్కడికి వచ్చిన వందలాది మంది భయంతో పరుగులు తీశారని చెప్పారు.

అరెస్ట్ అయిన వ్యక్తిని 22 ఏళ్ల రాబర్ట్ ఎక్రిమోగా గుర్తించినట్లు హైలాండ్ పార్క్ పోలీస్ చీఫ్ లౌ జోగ్‌మన్ తెలిపారు.దాడి చేసిన వ్యక్తిని ఎలా గుర్తించారో వివరించడానికి పోలీసులు నిరాకరించినట్లు వార్తా సంస్థ పీటీఐ చెప్పింది.

అమెరికాలో వారానికోసారి కాల్పులు జరపడం ఆనవాయితీగా మారిందని ఇల్లినాయిస్ రాష్ట్ర గవర్నర్ జె. రాబర్ట్ హెచ్చరించారు.

కవాతు ప్రారంభమైన 10 నిమిషాలకే కాల్పులు ప్రారంభమయ్యాయి.అమెరికాలో గత నెలలో కూడా టెక్సస్, బఫెలో సూపర్‌ మార్కెట్‌ సహా పలు చోట్ల కాల్పులు జరిగాయి.

 

2 comments:

  1. ఈ మధ్య గన్ కల్చర్ బాగా పెరిగిపోయినది

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...