Wednesday 29 June 2022

 

కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 1000 జరిమానా:



హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయినప్పటికీ చాలా మంది ప్రజలు మాస్కులు ధరించడం లేదు. కరోనా నిబంధనలు పూర్తిగా మర్చిపోయారు. హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలో అంతటా ఇదే పరిస్థితి ఉంది. కొందరు మాస్కులు పెట్టుకుని కనిపిస్తున్నప్పటికీ.. చాలా మంది మాత్రం మాస్కులు లేకుండా తిరుగుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు(డీహెచ్) శ్రీనివాస్ తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 1000 జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

రాష్ట్రంలో కరోనా కేసులు 500కు చేరువలో ఉన్నాయని డీహెచ్ వెల్లడించారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో కొవిడ్ వేగంగా వ్యాపిస్తోందని తెలిపారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైన దృష్ట్యా విద్యార్థులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యాజమాన్యాలు కూడా పాఠశాలల్లో కరోనా నిబంధలు కఠినంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరోవైపు, హైదరాబాద్ మెట్రో రైలు, స్టేషన్లలో కూడా మాస్కులు పెట్టుకోవాల్సిందేనని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు.

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 27,130 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 485 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. మరో 236 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం సాయంత్రం బులిటెన్ విడుల చేసింది. తెలంగాణలో ఇప్పటి వరకు 8,00,476 కరోనా కేసులు నమోదు కాగా, 7,91,944 మంది కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 4111 మంది మరణించారు

 

యాదమ్మ చేతి వంట రుచి చూడనున్న మోదీ..





హైదరాబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ రుచులు సందడి చేయనున్నారు. ప్రధాని మోదీ సహా ఇతర ప్రముఖులకు యాదమ్మ అనే మహిళ ప్రత్యేకంగా వంట చేయనుంది.

భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ ముస్తాబవుతోంది. జులై 2, 3 తేదీల్లో జరిగే సమావేశాల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరుకానున్నారు. దీంతో ఆ సమావేశాలను తెలంగాణ బీజేపీ నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. వీరందరికీ తెలంగాణ సంప్రదాయ రుచులు రుచి చూపించాలని నిర్ణయించారు. దీంతో తెలంగాణ స్పెషల్ వంటకాలను ఏరికోరి మెనూలో చేర్చారు. ముఖ్యంగా ప్రధాని మోదీకి తెలంగాణ రుచులు చూపించాలని బీజేపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకోసం కరీంనగర్‌ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మను అనే మహిళను హైదరాబాద్‌ తీసుకొచ్చారు. అసలు ఎవరీ యాదమ్మ...గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆ మహిళకు ఏకంగా దేశ ప్రధానికే వంటచేసి పెట్టే అవకాశం ఎలా వచ్చింది?.. దీని వెనుక పెద్ద కథే ఉంది.. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం గౌరవెల్లి గ్రామానికి చెందిన యాదమ్మకు 15వ ఏటనే కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన వ్యక్తితో పెళ్లయింది. దీంతో మెట్టినింటికి చేరుకున్న యాదమ్మ మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. దీంతో 29ఏళ్లుగా వంట వృత్తే ఆమెకు జీవనాధారమైంది. యాదమ్మ చేసే శాకాహార, మాంసాహార వంటకాలు తిన్నవారు ఎవరైనా ఆహా అనకుండా ఉండలేరు. ఒకేసారి 10వేల మందికి కూడా వండివార్చే నేర్పరితనం ఆమె సొంతం. దీంతో పెద్ద సభలు, భారీ కార్యక్రమాలకు చాలామంది ఆమెనే పిలుస్తుంటారు. తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌ పాల్గొనే కార్యక్రమాల్లోనూ యాదమ్మే వంటలు చేస్తుంటుంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి కూడా యాదమ్మ వంటలంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో యాదమ్మతో వంటలు చేయించాలని నిర్ణయించారు. ఆయన నుంచి పిలుపు అందిన వెంటనే యాదమ్మ హైదరాబాద్‌ చేరుకున్నారు. హైదరాబాద్‌కి వస్తున్న మోదీ సారుకి నువ్వే వంటలు చేయాలని చెప్పడంతో యాదమ్మ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మోదీ సారు ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలు కావాలని అడగడంతో సంజయ్ సారు నన్ను హైదరాబాద్‌కి పిలిపించారని యాదమ్మ చెబుతోంది. ఆయన పూర్తిగా శాఖాహారి కావడంతో పులిహోర, పప్పు అన్నం, దద్దోజనం, బగార వంటి వంటకాలతో పాటు గుత్తి వంకాయ, పచ్చిపులుసు, గంగవాయిలి కూర పప్పు, సాంబారు మొదలైన వంటకాలు వండేందుకు సిద్ధం చేస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు పప్పు గారెలు, సకినాలు, అరిసెలు, పాయసం, సర్వపిండి, భక్షాలు, పాయసం వంటివి కూడా తయారుచేయనున్నట్లు చెబుతోంది. మోదీ సారు తన వంట తింటే అంతకంటే భాగ్యం ఏముంటుందని యాదమ్మ ఆనందంలో మునిగితేలుతోంది.

 

రోజురోజుకూ పడిపోతున్న రూపాయి...


అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ అయిన రూపాయి విలువ రోజురోజుకీ క్షిణిస్తోంది. బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి 11 పైసలు క్షీణించి అమెరికా డాలర్‌తో పోలిస్తే సరికొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 78.96కి చేరుకుంది. విదేశీ పెట్టుబడులు స్థిరంగా వెనక్కు వెళ్లిపోవ

అమెరికా డాలర్‌ (Dollar)తో పోలిస్తే భారత కరెన్సీ అయిన రూపాయి (Rupee) విలువ రోజురోజుకీ క్షిణిస్తోంది. బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి 11 పైసలు క్షీణించి అమెరికా డాలర్‌తో పోలిస్తే సరికొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 78.96కి చేరుకుంది. విదేశీ పెట్టుబడులు స్థిరంగా వెనక్కు వెళ్లిపోవడం వల్ల దేశీయ కరెన్సీ గత కొన్ని నెలల్లో రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. 2021 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు FPIలు రూ. 2,69,424 కోట్లను ఉపసంహరించుకున్నాయి. అదే నెల నుంచి విదేశీ పెట్టుబడులు నిరంతరాయంగా తరలిపోతున్నాయి. ఇది రూపాయి క్షీణతకు ప్రధాన కారణం. గత కొన్ని నెలలుగా రూపాయి అస్థిరతను చవిచూస్తోంది. 2022, జనవరి 12న ఒక డాలర్‌కి రూపాయి మారకం రూ. 73.77గా ఉంది. అప్పటి నుంచి మన కరెన్సీ విలువ రూ.5 పడిపోయి, బుధవారం నాటికి రూ.78.96కి చేరుకుంది. అయితే జనవరి 12 నుంచి పతనం నిరంతరంగా లేదు. జనవరి 12 నుంచి మార్చి 8 మధ్య బలహీనపడి రూ.77.13కి చేరుకుంది. ఆపై ఏప్రిల్ 5 వరకు బలపడి డాలర్‌తో పోలిస్తే రూ.75.23కి చేరుకుంది. ఏప్రిల్ 5 నుంచి రూపాయి విలువ పతనాన్ని చూస్తూనే ఉంది. అప్పటి నుంచి అనేక సార్లు ఆల్ టైమ్ కనిష్ట స్థాయిలను తాకింది.

ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPIs) నిష్క్రమణ కారణంగా డాలర్ల అవుట్ ఫ్లో కొనసాగడమే గత కొన్ని నెలలుగా రూపాయి పతనానికి ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితులు, US ఫెడరల్ రిజర్వ్ కఠినమైన ద్రవ్య విధానం నేపథ్యంలో FPIలు ఇండియా నుంచి తమ డబ్బును ఉపసంహరించుకుని, సురక్షిత పెట్టుబడుల కోసం USకి తరలివెళ్లారు. గత కొన్ని నెలలుగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, సాధారణ డాలర్ బలం కూడా రూపాయి పతనానికి కారణమని చెప్పవచ్చు.

 

 

ఉద్ధవ్‌ సెలవు.. షిండేకు కొలువు

 

పది రోజులుగా రోజుకో మలుపు తిరిగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు బుధవారం ఓ కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి పదవికి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్‌ ఆదేశించడం, దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టినా లాభం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి స్వయంగా కారు నడుపుకుంటూ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. రాజీనామాను గవర్నర్‌ ఆమోదించినట్లు రాజ్‌భవన్‌ ప్రకటించింది. దాంతో సేనఎన్సీపీకాంగ్రెస్‌ కలయికతో రెండున్నరేళ్ల కింద ఏర్పాటైన మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వం కథ కంచికి చేరింది. ఏక్‌నాథ్‌ షిండే సారథ్యంలోని శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ శుక్రవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. బీజేపీ మహారాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సీటీ రవి ఇప్పటికే రంగంలోకి దిగి మంత్రివర్గ కూర్పు తదితరాలపై షిండేతో చర్చలు జరుపుతున్నారు. షిండేకు ఉప ముఖ్యమంత్రితో పాటు ఆయన వర్గానికి 9 మంత్రి పదవులిస్తారని సమాచారం. ఎనిమిది రోజులుగా గువాహటిలో ఓ హోటల్లో మకాం చేసిన 39 మంది సేన రెబల్‌ ఎమ్మెల్యేలు, 10 మంది స్వతంత్రులు బుధవారం రాత్రి ప్రైవేట్‌ చార్టర్‌ విమానంలో గోవా చేరుకున్నారు. వారంతా గురువారం ఉదయం ముంబై రానున్నట్టు సమాచారం. ‘‘మేం రెబల్స్‌ కాదు. నిజమైన శివ సైనికులం మేమే’’అని ఈ సందర్భంగా షిండే అన్నారు సంకీర్ణ సారథి శివసేనపై మంత్రి ఏక్‌నాథ్‌ షిండే సారథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో జూన్‌ 21న మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. కనీసం 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి జూన్‌ 20న అర్ధరాత్రి షిండే రాష్ట్రం వీడి సూరత్‌ చేరుకున్నారు. మర్నాడు గౌహతికి మకాం మార్చారు. 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో చూస్తుండగానే 39 మందికి పైగా షిండే శిబిరంలో చేరిపోయారు. దాంతో ఉద్ధవ్‌ సర్కారు మైనారిటీలో పడింది. ఉద్ధవ్‌ బెదిరింపులు, బుజ్జగింపులు, ఇరువర్గాల సవాళ్లూ ప్రతి సవాళ్లతో వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ వచ్చింది. మంగళవారం రాత్రి ఫడ్నవీస్‌ గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీని కలిసి బలపరీక్షకు ఉద్ధవ్‌ను ఆదేశించాలని కోరడంతో ముదురు పాకాన పడింది.

ఆ వెంటనే సీఎంను గురువారం సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్‌ ఆదేశించారు. అందుకు ఏర్పాట్లు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి మంగళవారం రాత్రే లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా లేవు. 39 మంది సేన రెబల్‌ ఎమ్మెల్యేల కార్యాలయాలు తదితరాలపై దాడుల నేపథ్యంలో వారికి, వారి కుటుంబ సభ్యులకు ముప్పుంది. విపక్ష నేత ఫడ్నవీస్‌ కూడా నన్ను కలిసి బలపరీక్షకు ఆదేశించాలంటూ విజ్ఞాపన సమర్పించారు. అందుకే గురువారం సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా సీఎంను ఆదేశిస్తున్నా’’అని పేర్కొన్నారు. దీన్ని సవాలు చేస్తూ శివసేన బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్‌ ఆదేశంపై స్టే కోరింది.

అందుకు కోర్టు నిరాకరించింది. బల నిరూపణే సమస్యకు పరిష్కారమని న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జేబీ పార్డీవాలాలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ అభిప్రాయపడింది. సేన పిటిషన్‌ను ఈ ఉదంతంపై దాఖలైన ఇతర కేసులతో కలిపి జూలై 11న విచారిస్తామని ప్రకటించింది. బలపరీక్ష ఫలితం తమ తుది తీర్పుకు లోబడి ఉంటుందంటూ తీర్పు వెలువరించింది. అసెంబ్లీ కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసి, ఐదు రోజుల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

కూలదోసి ఆనందిస్తున్నారు: ఉద్ధవ్‌
సుప్రీం తీర్పు వెలువడ్డ కొద్ది నిమిషాల్లోనే సీఎం పదవి నుంచి ఉద్ధవ్‌ తప్పుకున్నారు. రాజీనామా చేస్తున్నట్టు ఫేస్‌బుక్‌ లైవ్‌లో ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. ‘‘పదవిని వీడుతున్నందుకు నాకు ఏ బాధా లేదు. నంబర్‌గేమ్‌పైనా ఏ మాత్రం ఆసక్తి లేదు. పార్టీ ఎమ్మెల్యేల్లో నన్ను ఒక్కరు వ్యతిరేకించినా నాకది అవమానమే’’అన్నారు. ‘‘రెబల్స్‌ను ముంబై రానివ్వండి. ఎలాంటి ఆందోళనలకు, నిరసనలకు దిగొద్దు’’అని శివసేన కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

శివసేన, బాల్‌ ఠాక్రే కారణంగా రాజకీయంగా ఎదిగిన రెబల్‌ ఎమ్మెల్యేలు చివరికి ఆయన కుమారున్నే సీఎం పదవి నుంచి దించేసి ఆనందిస్తున్నారని వాపోయారు. ఈ పరిణామాన్ని ఉద్ధవ్‌ బుధవారం ఉదయమే ఊహించారు. దాంతో మధ్యాహ్నం జరిగిన కేబినెట్‌ భేటీ ఒకరకంగా ఉద్ధవ్‌ వీడ్కోలు సమావేశంగా మారింది. తనకు రెండున్నరేళ్లుగా సహకరించినందుకు సంకీర్ణ భాగస్వాములైన ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీల చీఫ్‌లు శరద్‌ పవార్, సోనియా గాంధీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

‘‘రెబల్స్‌ కోరితే సంకీర్ణం నుంచి తప్పుకుని బయటినుంచి మద్దతిచ్చేందుకు కూడా సిద్ధమని కాంగ్రెస్‌ ప్రకటించింది. నన్ను మోసగిస్తారనుకున్న వాళ్లు ఇలా మద్దతుగా నిలబడితే సొంతవాళ్లే మోసగించారు’’అంటూ ఆవేదన వెలిబుచ్చారు. రెబల్స్‌ తమ సమస్యలపై తన దగ్గరికి వచ్చి ఉండాల్సిందన్నారు. ‘‘శివసేన సామన్యుల పార్టీ. గతంలోనూ ఇలాంటి ఎన్నో సవాళ్లను విజయవంతంగా అధిగమించింది’’అన్నారు. పార్టీని పునర్నిర్మిస్తానని ప్రకటించారు.

కర్మ సిద్ధాంతం పని చేసింది: బీజేపీ
ఉద్ధవ్‌ రాజీనామా విషయంలో కర్మ సిద్ధాంతం పని చేసిందని బీజేపీ వ్యాఖ్యానించింది. ‘‘కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. చేసిన దాన్ని అనుభవించే తీరాలి. ఉద్ధవ్‌ విషయంలోనూ అదే జరిగింది’’అని కేటీ రవి అన్నారు. ‘‘శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ ఠాక్రే ఎన్నడూ అధికార పదవులు చేపట్టకపోయినా ప్రభుత్వాలను శాసించారు. ఆయన కుమారునిగా ఉద్ధవ్‌ మాత్రం అధికారంలో ఉండి కూడా సొంత పార్టీనే అదుపు చేయలేకపోయారు. ఎంతటి పతనం!’’అంటూ బీజేపీ నేత అమిత్‌ మాలవీయ ట్వీట్‌ చేశారు

 

 

 

జీఎస్‌టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు


చండీగఢ్‌లో జరిగిన 47వ జీఎస్‌టీ (GST) కౌన్సిల్‌ సమావేశం బుధవారం (wednesday) ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వెల్లడించారు.

చండీగఢ్‌లో జరిగిన 47 జీఎస్‌టీ కౌన్సిల్‌ (GST Council) సమావేశం బుధవారం ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman) వెల్లడించారు. సమావేశం ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పన్ను (Tax) చెల్లింపుదారుల భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే గూడ్స్‌, సర్వీస్‌ టాక్స్‌(GST) కౌన్సిల్ ఆర్థిక సంవత్సరం 2021-22కు సంబంధించి GSTR-4 ఫారమ్‌ను దాఖలు చేయడంలో ఆలస్యమైతే విధించే రుసుమును మాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించి ఫారమ్ GST CMP-08ని దాఖలు చేయడానికి గడువును పొడిగించింది.

జీఎస్‌టీ కౌన్సిల్‌ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో.. జీఎస్‌టీ కౌన్సిల్ 47వ సమావేశం 2022 జూన్ 28, 29 తేదీల్లో చండీగఢ్‌లో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. వస్తువులు, సేవల సరఫరాపై జీఎస్‌టీ రేట్లలో మార్పులు, జీఎస్‌టీ యాక్ట్‌, విధానానికి సంబంధించిన మార్పులకు సంబంధించి కౌన్సిల్ కొన్ని సిఫార్సులను చేసిందిఅని తెలిపింది.

జీఎస్‌టీ కౌన్సిల్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫారమ్ GSTR-4ని దాఖలు చేయడంలో జాప్యం చేసినందుకు సెక్షన్ 47 కింద ఆలస్య రుసుము మినహాయింపును దాదాపు నాలుగు వారాల పాటు, జూలై 28 వరకు పొడిగించింది. ప్రస్తుతం ఉన్న మినహాయింపు మే 1 నుంచి జూన్ 30 వరకు ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఫారమ్ GST CMP-08 దాఖలు చేయడానికి గడువు తేదీని జూలై 18 నుంచి జూలై 31 వరకు పొడిగించాలని కౌన్సిల్ నిర్ణయించింది.

 

 

మా పైసలు ఏపీలోకి..! మొత్తం రికవరీ చేయాలంటూ హరీశ్ రావు కంప్లయింట్

గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (GST)కి సంబంధించి ఉత్పన్నమవుతున్న సమస్యలను కేంద్ర ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు. చండీగఢ్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అధ్యక్షతన జరిగిన 47 జీఎస్‌టీ కౌన్సిల్ మీటింగ్ బుధవారం జూన్ 29తో ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు కూడా పాల్గొన్నారు.

 

చాలామంది పన్ను చెల్లింపుదారుల అడ్రస్ ఇంకా ఆంధ్రప్రదేశ్ పేరుతోనే కొనసాగుతోంది. దీని కారణంగా.. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన భారీ పన్ను ఆదాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిపోతోంది.

 

 

తెలంగాణ టెన్త్ ఫలితాలు వచ్చేశాయ్.. 10 సెకండ్లలో మీ రిజల్ట్ తెలుసుకోండిలా

తెలంగాణ టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలు (TS Tenth Results) విడుదలయ్యాయి. ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Reddy) ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విడుదల చేశారు. విద్యార్థులు bse.telangana.gov.inbseresults.telangana.gov.in తదితర వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. విద్యార్థుల కోసం న్యూస్18 సైతం ఫలితాలను అందించే ఏర్పాట్లు చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను https://telugu.news18.com/ వెబ్ సైట్లోనూ సులువుగా చెక్ చేసుకోవచ్చు. తెలంగాణలో నిర్వహించిన టెన్త్ ఎగ్జామ్స్ కు దాదాపు 5.09 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించి గతంలో 11 పేపర్లతో పరీక్ష నిర్వహించారు. అయితే.. కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈసారి కేవలం 6 పేపర్లకే ఎగ్జామ్ నిర్వహించారు అధికారులు. సిలబస్ ను సైతం 30 శాతానికి తగ్గించారు. విద్యార్థులకు ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు.

 

కరెంటువైరు ఆటోపై పడి.. 8మంది సజీవదహనం..


వారంతా రెక్కాడితేగాని డొక్కాడని వ్యవసాయ కూలీలు.. వానకాలం సీజన్ ఊపందుకోవడంతో సంతోషంగా ఉన్నారు.. ఇవాళ ఉదయం కూడా ఉత్సాహంగా పనుల్లోకి బయలుదేరారు.. ప్రతిరోజులాగే గురువారం కూడా ఎంగేజ్ ఆటోలో ప్రయాణిస్తోన్న వారిని అనూహ్యంగా మృత్యువు కబళించింది. హైటెన్షన్ విద్యుత్ వైరు ఒక్కసారిగా తెగిపడి ఆటోపై పడటం.. ఆటో నిలువునా తగలబడిపోవడం.. అందులోని వారు సజీవదహనం కావడం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది.. ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుందీ ఘోర ప్రమాదం..

ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తాడిమర్రి మండలంలో పెను విషాద ఘటన జరిగింది. చిల్లకొండయ్యపల్లిలో గురువారం ఉదయం వ్యవసాయ పనుల కోసం 8 మంది ఆటోలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటోపై.. హైటెన్షన్‌ కరెంట్‌ తీగలు తెగిపడ్డాయి దీంతో..

ఒక‍్కసారిగా మంటలు చెలరేగాయి. కిందికి దూకే వీలు కూడా లేకుండా క్షణాల్లో కరెంటు, మంటలు ఆటోలో వెళ్తున్న ఎనిమిది మంది ప్రాణాలను తీసేసేశాయి. లోపలున్న అందరూ సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని గుడ్డంపల్లి వాసులుగా గుర్తించారు.

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...