Wednesday 29 June 2022

 

రోజురోజుకూ పడిపోతున్న రూపాయి...


అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ అయిన రూపాయి విలువ రోజురోజుకీ క్షిణిస్తోంది. బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి 11 పైసలు క్షీణించి అమెరికా డాలర్‌తో పోలిస్తే సరికొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 78.96కి చేరుకుంది. విదేశీ పెట్టుబడులు స్థిరంగా వెనక్కు వెళ్లిపోవ

అమెరికా డాలర్‌ (Dollar)తో పోలిస్తే భారత కరెన్సీ అయిన రూపాయి (Rupee) విలువ రోజురోజుకీ క్షిణిస్తోంది. బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి 11 పైసలు క్షీణించి అమెరికా డాలర్‌తో పోలిస్తే సరికొత్త ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 78.96కి చేరుకుంది. విదేశీ పెట్టుబడులు స్థిరంగా వెనక్కు వెళ్లిపోవడం వల్ల దేశీయ కరెన్సీ గత కొన్ని నెలల్లో రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. 2021 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు FPIలు రూ. 2,69,424 కోట్లను ఉపసంహరించుకున్నాయి. అదే నెల నుంచి విదేశీ పెట్టుబడులు నిరంతరాయంగా తరలిపోతున్నాయి. ఇది రూపాయి క్షీణతకు ప్రధాన కారణం. గత కొన్ని నెలలుగా రూపాయి అస్థిరతను చవిచూస్తోంది. 2022, జనవరి 12న ఒక డాలర్‌కి రూపాయి మారకం రూ. 73.77గా ఉంది. అప్పటి నుంచి మన కరెన్సీ విలువ రూ.5 పడిపోయి, బుధవారం నాటికి రూ.78.96కి చేరుకుంది. అయితే జనవరి 12 నుంచి పతనం నిరంతరంగా లేదు. జనవరి 12 నుంచి మార్చి 8 మధ్య బలహీనపడి రూ.77.13కి చేరుకుంది. ఆపై ఏప్రిల్ 5 వరకు బలపడి డాలర్‌తో పోలిస్తే రూ.75.23కి చేరుకుంది. ఏప్రిల్ 5 నుంచి రూపాయి విలువ పతనాన్ని చూస్తూనే ఉంది. అప్పటి నుంచి అనేక సార్లు ఆల్ టైమ్ కనిష్ట స్థాయిలను తాకింది.

ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPIs) నిష్క్రమణ కారణంగా డాలర్ల అవుట్ ఫ్లో కొనసాగడమే గత కొన్ని నెలలుగా రూపాయి పతనానికి ప్రధాన కారణం. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితులు, US ఫెడరల్ రిజర్వ్ కఠినమైన ద్రవ్య విధానం నేపథ్యంలో FPIలు ఇండియా నుంచి తమ డబ్బును ఉపసంహరించుకుని, సురక్షిత పెట్టుబడుల కోసం USకి తరలివెళ్లారు. గత కొన్ని నెలలుగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, సాధారణ డాలర్ బలం కూడా రూపాయి పతనానికి కారణమని చెప్పవచ్చు.

 

1 comment:

  1. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (FPIs) నిష్క్రమణ కారణంగా డాలర్ల అవుట్ ఫ్లో కొనసాగడమే గత కొన్ని నెలలుగా రూపాయి పతనానికి ప్రధాన కారణం,గత కొన్ని నెలలుగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, సాధారణ డాలర్ బలం కూడా రూపాయి పతనానికి కారణమని చెప్పవచ్చు.

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...