Monday 25 July 2022

 

పాకిస్తాన్‌లో డీఎస్పీ అయిన తొలి హిందూ మహిళ

 


పాకిస్తాన్‌లో తొలి హిందూ డీఎస్పీగా మనీషా రూపేటా రికార్డులకెక్కారు. అమ్మాయిలు మెడిసిన్ తప్ప మరే ఇతర కోర్సుల్లో కూడా చేరకూడదన్న నిబంధనలున్నా.. ఆమె తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నారు పేరు మనీషా రూపేటా.  పాకిస్తాన్ లో తొలి హిందూ డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్. సింధ్ దగ్గరున్న చిన్న పట్టణం జాకోబా బాద్ తన  ఊరు. స్కూలు చదువు అంతా అక్కడే సాగింది. అక్కడ అమ్మాయిలను చదివించే ట్రెండ్ లేదు. అమ్మాయిలను చదివించడానికి ఎవరూ ప్రాధాన్యత ఇవ్వరు.

ఎవరైనా ఉన్నత విద్య అభ్యసించినా కూడా వారికి ఎంబీబీఎస్ తప్ప వేరే కోర్సు చేసే అవకాశం లేదు. చేస్తే ఎంబీబీఎస్ చేయాలి, లేదా ఉద్యోగం మానేయాలి. ఎంబీబీఎస్ ను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షలో ఫెయిల్ అయితే వారికి మరొక కోర్సులో చేరే అవకాశమే ఉండేది కాదు. అలాంటి వాళ్లంతా చదువును ఆపేయడం తప్ప మరో మార్గం లేదు.  రూపేటా ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష లో అర్హత సాధించలేదు. దాంతో, ఫిజికల్ థెరపీ కోర్సు ఎంపిక చేసుకున్నారు

మహిళలపై హింస జరిగే సమాజంలో వారికి రక్షణ కల్పించే స్థానాల్లో మహిళలు ఉండాలని తన  అభిప్రాయం. మహిళా రక్షకులు ఉండాల్సిన అవసరముంది. ఈ ఆలోచనే నేను పోలీసు ఉద్యోగం ఎంపిక చేసుకునేందుకు స్ఫూర్తినిచ్చిందని రూపేటా చెప్పారు

నేను ఒక్క మా సమాజానికి మాత్రమే ప్రతినిధిని కాదు. జీవితంలో ఏదైనా సాధించాలనుకునే ప్రతీ అమ్మాయికి ప్రతీకగా నిలుస్తూ, ప్రాతినిధ్యం వహిస్తాను. చిన్న చిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా పెద్ద పెద్ద కలలు ఉంటాయి.

బలవంతంగా మత మార్పిడులు చేయడం, అమ్మాయిలను అపహరించడం లాంటి వ్యవహారాలను మతపరమైన అంశాలుగా చూడటాన్ని నేను అంగీకరించను. ఇదొక సాంఘిక సమస్య. ఒక అమ్మాయి ఒక ఇంటి నుంచి పారిపోతే, ఆ అంశం చుట్టుపక్కల ఉన్నవారందరినీ ప్రభావితం చేస్తుంది. ఇది మొత్తం సమాజంపై ప్రభావం చూపిస్తుంది. ఈ సమస్యను మరింత విస్తృతంగా చూస్తే, ఇది సామాజిక ఆర్ధిక సమస్యగా కనిపిస్తుంది.

ఇలాంటి కారణాల వల్లే, మేధో వలసలు జరుగుతున్నాయి. ఇక్కడున్న భద్రతా కారణాల వల్ల చాలా మంది వలస వెళ్లిపోతున్నారు.

అందరూ కలిసి పని చేయడమే దీనికి పరిష్కారం. నేరం నేరమే. తప్పు తప్పే. బాధితులు ఎవరైనప్పటికీ అది మొత్తం సమాజం పై ప్రభావం చూపిస్తుంది.

నాకు ఎనలేని స్పందన లభించింది. మా చుట్టుపక్కల వారు కూడా అందరూ నన్ను ప్రశంసించారు.

జాతి మొత్తం ప్రశంసించింది. ప్రతీ ఒక్కరు పొగడ్తలతో ముంచెత్తారు. కానీ మా బంధువుల్లో కొంత మంది మాత్రం నేనీ ఉద్యోగాన్ని ఎక్కువ కాలం చేయలేనని అంటున్నారు. నేను ఈ రంగంలో కొనసాగలేనని మాట్లాడుతున్నారు.

నా గురించి ప్రత్యేకంగా వారికి ఎలాంటి అభిప్రాయమూ లేదు. కానీ, అమ్మాయిలు పోలీసు అధికారులు కాలేరనే సమాజంలో నెలకొన్న సాధారణ అభిప్రాయం వారు అలా మాట్లాడేలా చేస్తోంది. ఆ భయంతోనే వారలా మాట్లాడుతున్నారు.

వారికున్న మూస అభిప్రాయాల వల్లే అమ్మాయి ఈ ఉద్యోగంలో కొనసాగలేదని అభిప్రాయపడుతున్నారు. వారు కూడా వారి పిల్లలను ఈ వృత్తిని ఎంచుకోవడానికి అంగీకరించి ఉండరు.

పితృస్వామ్య సమాజంలో పురుషులు మాత్రమే పోలీసు వృత్తిలో రాణించగలరని అనుకుంటారు. అది వారి అభిప్రాయం.

మరో ఒకటి, రెండేళ్లలో వాళ్ళ మాటలను వెనక్కి తీసుకుంటారని నేననుకుంటున్నాను. అప్పటికి వారింట్లో కూడా ఒక అమ్మాయి పోలీసు వృత్తిని ఎంచుకోవచ్చు.

నేనొక ప్రైవేటు అకాడెమీలో పాఠాలు చెబుతున్నాను. నేను టీచింగ్ మాత్రమే కాకుండా విద్యార్థులకు మార్గదర్శకత్వం కూడా వహిస్తాను. నా మార్గదర్శకత్వంలో చాలా మంది అమ్మాయిలు ముందుకు వెళతారనే ఆలోచన ఈ పని చేసేందుకు నన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంది. విద్యార్థులకు కూడా ప్రోత్సాహకరంగా ఉండొచ్చు.

 

 

15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గారు  ప్రమాణస్వీకారం.



భారతదేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో వేడుకలా జరిగిన కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు. దేవుడి సాక్షిగా దేశ ప్రధమ పౌరురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముర్ము తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆమె తొలి సందేశం ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది. రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము తొలి ప్రసంగాన్ని.. మాజీ రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీకి నమస్కారాలతో మొదలుపెట్టి.. ప్రియమైన దేశవాసులారా..అంటూ కొనసాగించారు. ఇప్పటిదాకా పనిచేసిన రాష్ట్రపతుల్లో మోస్ట్ పాపులర్ గా నిలిచిన అబ్దుల్ కలాం కొటేషన్ కలలు కనండి..కి కొనసాగింపుగా ఇప్పుడు ద్రౌపది ముర్ము సందేశమిచ్చారు. దేశంలో అట్టడుగు పేదలు సైతం కేవలం కలలు కనడమేకాదు.. వాటిని సాకారం కూడా చేసుకోవచ్చని తన జీవిత గమనం రుజువు చేస్తుందని ముర్ము వ్యాఖ్యానించారు

‘‘భారత రాజ్యాంగం ప్రకారం అత్యున్నత పదవిని చేపట్టిన సందర్భంగా దేశంలోని చట్టసభలు అన్నిటికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కోట్ల మంది విశ్వాసం, నమ్మకాల ఆధారంగా నడిచే పవిత్రమైన పార్లమెంట్ సాక్షిగా దేశ ప్రజలకు నా నమస్సులు తెలియజేస్తున్నాను. మీ ఆత్మీయత, సహయోగత వల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. ఆజాదీకా అమృత్ మహోత్సవం సమయంలో నేను రాష్ట్రపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. మరికొద్ది రోజుల్లోనే మనం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనున్నాం. భారత్ 50వ స్వాతంత్ర్య వేడుకల ఏడాదే నా రాజకీయ జీవితం మొదలైంది. ఇప్పుడు 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ నాకీ గొప్ప అవకాశం లభించింది.. ఒడిశాలోని మారుమూల ఆదివాసీ గ్రామంలో పేద కుటుంబం నుంచి వచ్చిన నేను ఇవాళ దేశ అత్యున్నత పదవి చేపట్టడం గర్వకారణంగా ఉంది. ఇది నా వ్యక్తిగత విజయం కాదు.. దేశ ప్రజలందరికీ దక్కిన విజయం. ఈ దేశంలో పేదలు కూడా కలలు కనొచ్చని, వాటిని సాకారం చేసుకోవచ్చని చెప్పేందుకు నా నామినేషన్ ఓ రుజువు. ప్రైమరీ స్కూల్ చదువు పూర్తి చేయడమే అప్పట్లో నాకు కలగా ఉండేది. అలాంటి స్థాయి నుంచి ఇక్కడికి రాగలిగాను..

75వ స్వాతంత్ర్య దినోత్సవాల వేళ రాష్ట్రపతిగా ఎన్నిక కావడం గౌరవంగా ఉంది. అంతేకాదు, స్వాతంత్ర్య

 భారతంలో పుట్టి రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి వ్యక్తిగానూ నాకు అదృష్టం దక్కింది.

 స్వాతంత్ర్యయోధులు కలలుకన్న సుస్వరాజ్య నిర్మాణం కోసం మరింత వేగంగా మనం పనిచేయాల్సిన

 అవసరం ఉంది. అందరి సహకారంతో ఉజ్వల యాత్రను కొనసాగించాల్సి ఉంది. సబ్ కా సాథ్.. సబ్

 కా కర్తవ్య్..నినాదంతో ముందకు వెళదాం..’’ అని తొలి సందేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 పిలుపునిచ్చారు.

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...