Wednesday 22 June 2022

 

 

అదిరిపోయే 'నాయిస్' స్మార్ట్ గ్లాసెస్

 

ఈ రోజుల్లో స్మార్ట్ గ్లాసెస్‌కు భారీగా డిమాండ్ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు రకరకాల ఫీచర్లతో స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ దేశీయ ఆడియో, వేరబుల్ తయారీ సంస్థ నాయిస్ (Noise) కూడా ఐ-గ్లాసెస్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ కంపెనీ భారతదేశంలో తన తొలి స్మార్ట్ గ్లాసెస్ ఐ1 (Noise i1 Smart Eyewear)ను తాజాగా విడుదల చేసింది. ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో ఆఫర్ చేస్తున్న అదిరిపోయే ఫీచర్లు ఇప్పుడు టెక్ ప్రియులను బాగా ఆకట్టుకుంటున్నాయి. నాయిస్ ల్యాబ్స్‌లో అభివృద్ధి చేసిన ఈ స్మార్ట్ గ్లాసెస్ ప్రత్యేకమైన ఆడియో ఎక్స్‌పీరియన్‌ను అందజేస్తుందని కంపెనీ చెబుతోంది. మరి దీని ధర, ఫీచర్లు వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

వినియోగదారులు నాయిస్ ఐ1 స్మార్ట్ గ్లాసెస్ రూ.5,999కి సొంతం చేసుకోవచ్చు. మీరు gonoise.com వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లోనే దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ డివైజ్ లిమిటెడ్ ఎడిషన్‌గా మాత్రమే లాంచ్ అయిందని వినియోగదారులు గమనించాలి. నాయిస్ i1 స్మార్ట్ గ్లాసెస్ మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కాంపెన్సేషన్, కాలింగ్ కోసం మైక్రోఫోన్, మాగ్నెటిక్ ఛార్జింగ్, హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ కంట్రోల్ వంటి హైటెక్ ఫీచర్లతో లాంచ్ అయింది. ఇందులో ఆఫర్ చేసిన గైడెడ్ ఆడియో డిజైన్‌ అనేది చెవులలోకి మ్యూజిక్ సరిగ్గా వెళ్లేలా చేస్తుంది. ఈ గ్లాసెస్ చుట్టుపక్కల వస్తున్న అన్ని లౌడ్-సౌండ్స్‌ని బ్లాక్ చేసి, అద్భుతమైన ఆడియో ఎక్స్‌పీరియన్‌ను అందిస్తుంది. నాయిస్ i1 బ్లూటూత్ వెర్షన్ 5.1కి సపోర్ట్ చేస్తుంది కనుక ఓపెన్ చేయగానే మొబైల్ ఫోన్‌కి మిల్లి సెకన్లలో కనెక్ట్ అవుతుంది. యూజర్లు సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 9 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను పొందవచ్చు. విశేషమేంటంటే, ఈ స్మార్ట్ ఐవేర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. కేవలం 15 నిమిషాల ఛార్జ్‌తో యూజర్లు 120 నిమిషాల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను ఎంజాయ్ చేయవచ్చు.

ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో మల్టీ-ఫంక్షనల్ టచ్ కంట్రోల్స్‌ కూడా కంపెనీ ఆఫర్ చేసింది. ఈ టచ్ కంట్రోల్స్‌తో కాల్స్‌ను లిఫ్ట్ చేయొచ్చు, కట్ చేయవచ్చు. అంతేకాదు టచ్ చేయడం ద్వారా మ్యూజిక్ మేనేజ్ చేయవచ్చు, వాయిస్ అసిస్టెంట్‌ను కూడా ఆన్ చేయవచ్చు. ఈ గ్లాసెస్‌తో ఆడియో ఎంజాయ్ చేస్తూనే యూజర్లు తమ కళ్లను ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ల్యాప్‌టాప్‌, పీసీమొబైల్ మొదలైనవాటిని ఉపయోగించినప్పుడు కళ్లపై ఒత్తిడిని తగ్గించడానికి ఈ గ్లాసెస్‌ ఉపయోగపడతాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ చూస్తున్నప్పుడు క్లియర్ విజన్ అందించడానికి ఇందులో చక్కటి గ్లాసెస్ అందించారు. ఈ డివైజ్‌లో అందించిన బ్లూ లైట్ ఫిల్టరింగ్ ట్రాన్స్‌పరెంట్ లెన్స్‌లు యూజర్ల కళ్లను అన్ని లైట్స్, స్క్రీన్స్ నుంచి రక్షిస్తాయి. ఈ లెన్స్‌లు యూవీ కిరణాల నుంచి కూడా ప్రొటెక్షన్ అందిస్తాయని కంపెనీ చెబుతోంది. IPX4 రేటింగ్‌తో వాటర్-రెసిస్టెంట్, స్ప్లాష్-రెసిస్టెంట్‌గా ఈ ఇన్నోవేటివ్ గ్యాడ్జెట్ వస్తుంది.

 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై సీబీఐ కి ఫిర్యాదు 


సీబీఐ డైరెక్టర్ ను కలిసిన కెఏ పాల్


సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్ కు పిర్యాదు చేసిన కే ఏ పాల్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతిపై సీబీఐ కి ఫిర్యాదు


9 లక్షల కోట్ల అవినీతికి, కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతికి పాల్పడింది


ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అవినీతి చూడలేదు


రాష్ట్రప్రజలంతా సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాలని కోరుతున్నారు.


కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలని పాల్ డిమాండ్


రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కు 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంది


కేసీఆర్ సర్కార్ నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసింది


తెలంగాణ లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఎమ్మెల్సీ కవిత లు పెదఫా ఎత్తున అవినీతికి పాల్పడ్డారు


తెలంగాణ తో పాటూ సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారు


కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అవినీతికి పాల్పడ్డారు


ప్రాజెక్టు అంచనా బడ్జెట్ లక్షా 5 వేల కోట్లు కాగా 35 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు


75 వేల కోట్లు దోచుకున్నారు


యాదాద్రి అభివృద్ధిలోనూ అవినీతి జరిగింది


2 వేల కోట్ల అంచనా లో 200 కోట్లు ఖర్చు చేసి అంతా దోచుకున్నారు.


కేసీఆర్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలి


ప్రభుత్వ ఖజానాకు న్యాయం చెయ్యాలి.


కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల బినామీ లావాదేవీల పై కూడా విచారణ జరపాలి


కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు నాపై దాడులు చేస్తున్నారు


కేసీఆర్   అవినీతి అక్రమాలపై జరిగే దర్యాప్తుకు నా పూర్తి సహకారం అందిస్తాను.


సిబిఐ తో పాటూ కేంద్రమంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాలా కు పిర్యాదు కాపీలను పంపిన కెఏ పాల్

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...