Monday 18 July 2022

 

సామాన్యుడి నడ్డి విరిచేలా జి. ఎస్. టి సవరణలు



సవరించిన వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. దీంతో.. బ్రాండ్ పేరుతో ప్యాకెట్లలో అమ్మే బియ్యం, గోదుమలు, గోదుమ పిండి వంటి వివిధ సరకులు కొనుగోలు చేయాలంటే వినియోగదారులు ఇప్పుడిక మరిన్ని డబ్బులు వెచ్చించాల్సి ఉంటుందని ఏఎన్ఐ వార్తా సంస్థ ఒక కథనంలో వెల్లడించింది.

దీని ప్రకారం, ముందుగా ప్యాకేజ్ చేసి, లేబుల్ వేసిన బియ్యం, గోధుమలు, గోధుమ పిండి వంటి పప్పులు, ధాన్యాలపై ఇక నుంచి 5 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తారు.

ఈ సరకుల మీద జీఎస్‌టీ పెంచాలని చండీగఢ్‌లో జరిగిన 47వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

పెరుగు, లస్సీ, మరమరాలు వంటి ఇతర సరకులను కూడా ప్యాకేజ్ చేసి, లేబుల్ వేస్తే.. వాటికి సైతం 5 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది.

అయితే.. ఇవే వస్తువులు (పప్పులు, ధాన్యాలు, పిండి మొదలైనవి) 25 కిలోలు లేదా 25 లీటర్లకు మించి ఒకే ప్యాకేజీగా ఉన్నట్లయితే అవి ప్రీ-ప్యాకేజ్డ్ అండ్ లేబుల్డ్ కేటగిరీ కిందకు రావని ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రచురించిన తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్ఏక్యూ) పత్రంలో వివరించింది.

అలాగే.. ముద్రణ, రాత, డ్రాయింగ్ ఇంకు, కత్తులు, పేపర్ కత్తులు, పెన్సిల్ షార్పెనర్లు, బ్లేడ్లు, స్పూన్లు, ఫోర్కులు, స్కిమ్మర్లు, కేక్ సర్వర్లు వంటి ఇతర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఈ వస్తువుల మీద ఇప్పుడు జీఎస్‌టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు.

ఇక ఎల్ఈడీ బల్బులు, సోలార్ వాటర్ హీటర్ల మీద ఇంతకు ముందు 12 శాతం జీఎస్‌టీ ఉండగా, ఇక నుంచి 18 శాతం వసూలు చేస్తారు.

ద్రవ పానీయాలు లేదా డెయిరీ ఉత్పత్తులను ప్యాక్ చేయటానికి ఉపయోగించే టెట్రా ప్యాక్ (అసెప్టిక్ ప్యాకేజింగ్ పేపర్) మీద జీఎస్‌టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు.

అంటే టెట్రా ప్యాకుల్లో కొనే పాలు, పెరుగుల్లాంటివి ఇక ముందు ధర పెరుగుతాయి.

కట్ చేసిన, పాలిష్ చేసిన వజ్రాల మీద ఇంతకుముందు 0.25 శాతంగా ఉన్న జీఎస్‌టీని ఇప్పుడు 1.5 శాతానికి పెంచారు.

అలాగే.. రూ. 1,000 వరకూ ఉన్న హోటల్ గదుల అద్దెల మీద ఇప్పుడు 12 శాతం జీఎస్‌టీ విధించారు.

బ్యాంకులు చెక్కులు ఇష్యూ చేసేందుకు ఇకపై 18 శాతం జీఎస్‌టీని వసూలు చేస్తాయి.

తగ్గింపు కొన్నింటికే

రోప్‌వేల ద్వారా సరకులు, ప్రయాణికుల రవాణా మీద విధించే జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.

ఇంధన ఖర్చు కూడా కలిసివుండే.. ట్రక్కులు, గూడ్స్ క్యారేజీల అద్దె తగ్గనుంది. దీని మీద 18 శాతంగా ఉన్న జీఎస్‌టీని 12 శాతానికి తగ్గించారు.

 

 

పొరపాటును ఒప్పుకోవటం తెలిసిన మహా నాయకురాలు సీతక్క



రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లోని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క పొర‌పాటు చేశారు. విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా, ఎన్‌డీఏ కూట‌మి త‌ర‌పున ద్రౌప‌ది ముర్ము బ‌రిలో నిలిచారు. య‌శ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ స‌హా మెజార్టీ ప్ర‌తిప‌క్ష పార్టీలు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి.

ఈ నేప‌థ్యంలో ఇవాళ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు దేశ వ్యాప్తంగా ప్రారంభ‌మయ్యాయి. తెలంగాణ‌లో ఆ రాష్ట్రానికి చెందిన 119 ఎమ్మెల్యేల‌తో పాటు ఏపీకి చెందిన కంద‌కూరు వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మ‌హీంద‌ర్‌రెడ్డి ఆ రాష్ట్ర అసెంబ్లీలో హ‌క్కు వినియోగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మ‌హీంద‌ర్‌రెడ్డితో పాటు అత్య‌ధిక శాతం మంది ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు.

ఇదిలా వుండ‌గా త‌మ అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు బ‌దులు ద్రౌప‌ది ముర్ముకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క ఓటు వేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ద్రౌప‌ది ముర్ము గిరిజ‌న మ‌హిళ‌. సీత‌క్క కూడా అదే సామాజిక వ‌ర్గం కావ‌డంతో చ‌ర్చ‌కు దారి తీసింది. తాను పొరపాటున ముర్ముకు ఓటు వేసినట్టు అధికారుల దృష్టికి సీతక్క తీసుకెళ్లారు. మళ్లీ ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను సీత‌క్క కోర‌డం గ‌మ‌నార్హం.

అయితే ఒక్క‌సారి ఓటు హ‌క్కు వినియోగించుకున్న త‌ర్వాత నిబంధ‌న‌ల ప్రకారం మరోసారి అవకాశం ఇవ్వలేమని అధికారులు స్ప‌ష్టం చేయ‌డంతో సీత‌క్క నిరాశ చెందారు. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత త‌న వైపు నుంచి పొర‌పాటు జ‌ర‌గ‌డాన్ని మీడియాతో సీత‌క్క పంచుకోవ‌డం విశేషం.

 

 

ప్రజల తప్పుల వల్లే ఈ కుంభవృష్టి



 

లష్కర్ బోనాల  జాతరలో రెండో రోజైన సోమవారం ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి భక్తురాలైన స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. వారి  మాటల్లోనే..

మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు. గతంలో చేసినట్టుగా పూజలు చేయడంలేదు. ఆలయంలో పూజలు సరిగా జరగడంలేదు. గర్భాలయంలో శాస్త్రోక్తంగా పూజలు చేయాలి. నా రూపాన్ని ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు. నా రూపాన్ని స్థిరంగా ఉంచండి. నా సంతోషానికి కాదు.. మీ సంతోషానికే పూజలు.. మీ కళ్లు తెరిపించడానికే ఇలా వర్షాలు కురిపిస్తున్నాను. ఎన్ని తప్పులు చేసినా నా బిడ్డలేనని క్షమిస్తున్నాను’’ అని అన్నారు.  మీ సంతోషం కోసం పూజలు చేస్తున్నారే తప్ప నాకోసం కాదు. మీరు చేసే తప్పులన్నీ కడుపులోనే దాచుకుంటున్నాను. నా గర్భగుడిలో పూజలు శాస్త్రోస్తకంగా పూజలు చేయండి. మీరు ఎన్ని తప్పులు చేస్తున్నా నా బిడ్డలే కదాని భరిస్తున్నాను. మీకు ఇష్టం వచ్చినట్లు నా రూపాన్ని మార్చేస్తున్నారు. నావన్నీ కాజేస్తున్నారు. నాకు శాశ్వతరూపం కల్పించండి. భక్తులు నన్ను కనులారా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయండి. మీరంతా నా పట్ల చేసే తప్పుల విషయంలో నా ఆగ్రహాన్ని వర్షాల రూపంలో చూపించాను. ఆగ్రహంతోనే భారీవర్షాలు కురిపించాను. నా గురించి మీకు తెలియాలనే ఇలా చేశాఅని అమ్మవారు స్పష్టం చేశారు.

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...