Tuesday 18 April 2023

  

శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా  తీర్చిదిద్దాలి---- పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

 



ముషీరాబాద్ చౌరస్తా గల శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయాన్ని ఎంతో అద్భుతంగా  తీర్చిదిద్దాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గత నెలలో శ్రీ రామనవమి సందర్భంగా మంత్రి  శ్రీనివాస్ యాదవ్ ఈ సీతా రామచంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించారు. ప్రధాన రహదారి వెంట ఉన్న ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ అమలులో భాగంగా మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసంలో దేవాదాయశాఖ అధికారులతో ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించారు. ప్రస్తుతం ఆలయం కు 3200 గజాల స్థలం ఉన్నదని, దానిని  పరిగణలోకి తీసుకొని సీతారాములు, ఆంజనేయ స్వామి ఆలయాల నిర్మాణానికి, రోడ్ వైపు షాప్స్ నిర్మాణం చేపట్టే విధంగా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ఆలయానికి ఆనుకొని ఉన్న కొంత ప్రయివేటు భూమిని కొనుగోలు చేసి అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. దేవాదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, స్ధాపతి బుధవారం ఆలయాన్ని సందర్శించి అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆదేశించారు. త్వరలోనే మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్ లతో కలిసి ఆలయ పునర్నిర్మాణ, అభివృద్ధి పనులు ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆలయ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ప్రస్తుతం ఉన్న షాప్స్ నిర్వాహకులకే ఇచ్చే విధంగా అగ్రిమెంట్ చేసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రికి ఆలయ కమిటీ సభ్యులు, షాప్స్ నిర్వహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ హేమలత లక్ష్మీపతి, పద్మారావు నగర్ BRS పార్టీ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఆలయ EO రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...