Friday 1 July 2022

 

 

రైల్వే స్టేషన్లలో కొత్త రూల్స్..

 

మీరు ట్రైన్ జర్నీ ఎక్కువగా చేస్తుంటారా? అయితే మీకు శుభవార్త. రైల్వే స్టేషన్లలో వచ్చే నెల నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉండనున్నాయి. ప్రతి స్టాల్‌లోనూ క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్ ఫెసిలిటీ అందుబాటులో ఉండాల్సిందే. లేదంటే మాత్రం రైల్వేస్ వారికి భారీ మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉంటుంది. దీని వల్ల రైల్వే ప్రయాణికులకు ఊరట కలుగనుంది. వెండర్లు ఎంఆర్‌పీ రేట్లకు మించి వస్తువులను విక్రయించలేరు.

 

యాణికులకు మెరుగైన సేవలు అందించడానికి ఇండియన్ రైల్వేస్ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. రైల్వే బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లలో కేటరింగ్ క్యాష్‌లెస్ పేమెంట్లకు ఆమోదం తెలిపింది. అన్ని రైల్వే స్టేషన్లలోనూ ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 2022 ఆగస్ట్ 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి వస్తాయి. అంటే వెండర్లు రైల్వే స్టేషన్లలో డిజిటల్ పేమెంట్లను స్వీకరించనున్నారు. ఈ రూల్స్‌ను అతిక్రమిస్తే.. వారికి రూ. 10 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎంఆర్‌పీ రేటుకు మించి డబ్బులు తీసుకోకూడదు. ఎంఆర్‌పీ రూ. 15 ఉంటే.. గరిష్టంగా రూ. 15 మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోకూడదు. రైల్వే బోర్డు ఇప్పటికే ఈ అంశాలకు సంబంధించి అన్ని రైల్వే జోన్లకు, ఐఆర్‌సీటీసీ‌కి ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం చూస్తే.. ప్లాట్‌ఫామ్‌పై కేటరింగ్ సహా అన్ని స్టాల్స్‌లో డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉండాలి. అలాగే ప్రయాణికులకు కంప్యూటరైజ్డ్ బిల్లు ఇవ్వాలి. డిజిటల్ పేమెంట్స్‌కు యూపీఐ, పేటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్, స్వైప్ మెషీన్స్ వంటివి కలిగి ఉండాలి. రైల్వే బోర్డు సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్లలోని అన్ని స్టాళ్లలో క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్లు నిర్వహించొచ్చు. డిజిటల్ పేమెంట్ సర్వీసులు అందుబాటులో లేకపోతే అప్పుడు రైల్వేస్ వెండర్లకు రూ. 10 వేల నుంచి రూ. లక్ష వరకు పెనాల్టీ వేసే అవకాశం ఉంటుంది. డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురావడం వల్ల వెండర్లు ప్రయాణికులకు నుంచి ఎక్కువ మొత్తాన్ని తీసుకోవడం వీలు కాదు.

అంతేకాకుండా ట్రైన్ ప్యాసింజర్లు ఫుడ్ సరిగా లేకపోయినా, ఎక్స్‌పైరీ అయిన ఫుడ్ ప్యాకెట్స్ పొందినా ఫిర్యాదు చేయొచ్చు. డిజిటల్ పేమెంట్స్, బిల్లులు లేకపోవడం వల్ల ప్యాసింజర్లు ఫిర్యాదు చేయడం కష్టంగా ఉండేది. క్యాష్‌లెస్ పేమెంట్ల ద్వారా ప్రయాణికులు ఫ్రెష్ ఫుడ్‌ను సరైన ధరలో పొందడానికి వీలుంటుంది. అయితే ఈ విధానం ఎంత వరకు విజయవంతం అవుతుందో వేచి చూడాల్సి ఉంది.

 

జీఎస్టీకి అర్ధ దశాబ్దం 


జీఎస్టీ పన్ను విధానం అమల్లోకి వచ్చి నేటికి ఐదేళ్లు పూర్తయ్యాయి. సరిగ్గా ఇదే రోజున 2017లో ఈ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. జీఎస్టీ అర్ధ దశాబ్ద వేడుకలు జరుపుకుంటోన్న ఈ తరుణంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జూన్ నెల వసూళ్ల డేటాలో ఖజానాకు భారీగా రెవెన్యూలు వచ్చినట్టు తెలిసింది. జూన్ నెలలో రూ.1.45 లక్షల కోట్ల జీఎస్టీ పన్ను వసూళ్లను కేంద్ర ప్రభుత్వం చేపట్టినట్టు వెల్లడైంది

GST : దేశంలో జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ) అమల్లోకి తెచ్చి నేటికి అర్ధ దశాబ్దం అయిన సందర్భంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జూన్ నెల వసూళ్ల డేటాలో ఖజానా ఘల్‌ఘల్ మంది. జూన్ నెలలో రూ.1.45 లక్షల కోట్ల జీఎస్టీ పన్ను వసూళ్లైనట్టు తెలిసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ వసూళ్లు 56 శాతం పెరిగాయి. 2021 జూన్ నెలలో జీఎస్టీ పన్ను వసూళ్లు రూ.92,800 కోట్లుగా ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల పైన ఉంటున్నాయి. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టడం, మెరుగైన పన్ను ఎగవేత చర్యలతో జీఎస్టీ పన్ను వసూళ్లు పెరిగినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు జీఎస్టీ అమల్లోకి వచ్చి నేటితో ఐదేళ్లు పూర్తయ్యాయి. జూలై 1, 2017న జీఎస్టీ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద పన్ను సంస్కరణ ఇది. పరోక్ష పన్ను విధానంలో జీఎస్టీ గణనీయమైన మార్పులు తీసుకొచ్చింది. ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే ట్యాక్స్ అనే విధానంలో భాగంగా జీఎస్టీని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత.. సేవా పన్ను, వ్యాట్, కొనుగోళ్ల పన్ను, ఎక్సైజ్ డ్యూటీ, వంటి పలు రకాల పన్నులు రద్దయ్యాయి. వీటిని జీఎస్టీ రీప్లేస్ చేసింది. అయితే పెట్రోలియం, ఆల్కాహాల్, స్టాంప్‌ డ్యూటీలు ఇంకా జీఎస్టీ పరిధిలోకి రాలేదు అయితే జీఎస్టీ విధానం అమల్లోకి తెచ్చే ప్రతిపాదనకు 2000 ఏడాదిలోనే బీజం పడింది. జీఎస్టీ చట్టానికి సంబంధించిన డ్రాఫ్ట్‌ను రూపొందించేందుకు ఒక కమిటీ ఏర్పాటైంది. 2004లో ఈ కమిటీ తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించింది. ఆ తర్వాత రెండేళ్లకు అప్పటి ఆర్థిక మంత్రి పి చిదంబరం దేశంలో 2010 నుంచి జీఎస్టీని అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆ విధానం 2010లో అమల్లోకి రాలేకపోయింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలతో ఈ విధానం అమలుకు బ్రేక్ పడింది. కొత్త పన్ను విధానం దేశంలో అమల్లోకి రావడానికి 17 ఏళ్లు పట్టింది. 2016లో జీఎస్టీకి లోక్‌సభ, రాజ్యసభలు ఆమోదం తెలపడంతో.... జూలై 1, 2017 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. దేశంలో జీఎస్టీ విధానాన్ని సరిగ్గా అమల్లోకి తెచ్చేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటైంది. ఈ కౌన్సిలే జీఎస్టీ రేట్లను నిర్ణయిస్తుంది.

 

ఆర్మీ క్యాంపు మీద విరిగిపడిన కొండ చరియలు..

నోనీ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. టుపుల్ యార్డ్ రైల్వే నిర్మాణ ప్రాంతానికి సమీపంలోని 107 టెరిటోరియల్ ఆర్మీ క్యాంపు వద్ద భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఊహించని ఘటన సంభవించింది.

మణిపూర్‌లో  విషాదకర సంఘటన చోటు చేసుకుంది. నోనీ జిల్లాలో Army camp) సమీపంలో.. భారీగా కొండ చరియలు (Land slide)  విరిగి పడ్డాయి. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి సంభవించింది. కాగా, తూపుల్ యార్డ్ రైల్వే నిర్మాణ స్థలం సమీపంలోని 107 టెరిటోరియల్ ఆర్మీ (టీఏ) క్యాంపు వద్ద బుధవారం రాత్రి జరిగిన భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో.. ఇప్పటికే తొమ్మిది మంది టీఏ జవాన్లతో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆర్మీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పెద్ద ఎత్తున జవాన్లు ప్రమాద స్థలానికి చేరుకున్నారు.

నది నుంచి మృతదేహాలను (Dead bodies) బయటకు తీయడానికి ఎక్స్‌కవేటర్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ ఘటనలో.. పలువురు జవాన్లతో (Army jawans) సహా కనీసం 55 మంది ఆచూకి లభించలేదు. ఇజాయ్ నదికి సమీపంలో కొన్ని మృతదేహాలను అధికారులు కనుగొన్నారు. కొన్ని ప్రాంతాల్లో వెళ్లడానికి అధికారులకు కష్టతరమైంది. దీంతో.. అధికారులు.. మృతదేహాలను బయటకు తీయడానికి నది దిగువన కష్టతరమైన భూభాగంలో ఎక్స్‌కవేటర్‌లను మోహరించారు. ఘటనలో.. కేంద్ర, రాష్ట్ర విపత్తు దళాలతో పాటు ఇండియన్ ఆర్మీ, అస్సాం రైఫిల్స్, టెరిటోరియల్ ఆర్మీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

జిరిబామ్ జిల్లా నుంచి రాష్ట్ర రాజధాని ఇంఫాల్ వరకు నిర్మించబడుతున్న రైలు మార్గానికి టెరిటోరియల్ ఆర్మీ భద్రతను అందిస్తుంది. శిథిలాల కింద కూరుకుపోయిన.. సిబ్బంది ఉనికిని గుర్తించడానికి గాలి ద్వారా త్రూ వాల్ రాడార్ ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు, టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 13 మంది సిబ్బంది, ఐదుగురు పౌరులను రక్షించామని, తప్పిపోయిన సిబ్బంది కోసం రోజంతా అన్వేషణ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.

అయితే, ఘటనపై ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రభుత్వం నుంచి... మరణించిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికి ₹ 5 లక్షలు, గాయపడిన వారికి ₹ 50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు.

 

హైదరాబాద్ మెట్రో స్టేషన్ల నుంచి ఆఫీస్ వర్క్

 

హైదరాబాద్ మెట్రో స్టేషన్లు సరికొత్తగా రూపుదిద్ధుకొంటున్నాయి. దేశ చరిత్రలోనే మొదటి సారిగా మెట్రో స్టేషన్ల నుంచే ఆఫీసు కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలుగా L And T మెట్రలో రైల్ కొత్తగా ఆఫీస్ బబుల్స్ పేరుతో కో వర్కింగ్ స్పెస్ ను ఆఫర్ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి.

హైదరాబాద్ మెట్రో స్టేషన్లు(Hyderabad Metro Stations) సరికొత్తగా రూపుదిద్ధుకొంటున్నాయి. దేశ చరిత్రలోనే మొదటి సారిగా మెట్రో స్టేషన్ల(Metro Stations) నుంచే ఆఫీసు కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలుగా L And T మెట్రోలో రైల్(Metro Rail) కొత్తగా ఆఫీస్ బబుల్స్(Office Bubbles) పేరుతో కో వర్కింగ్ స్పెస్ ను(Working Space) ఆఫర్ చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. ఆఫీస్ బబుల్స్ ద్వారా.. హైదరాబాద్‌లో కో-వర్కింగ్ స్పేస్‌లు(Hyderabad Co Working Spaces) , లొకేషనల్ ఫ్లెక్సిబిలిటీ(Flexibility) కోసం పెరుగుతున్న డిమాండ్‌ను L&T MRHL నెరవేరుస్తున్నట్లు అవుతుంది. సాఫ్ట్ వేర్ కంపెనీలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి ఆఫర్ ను తీసుకొచ్చినట్లు మెట్రో అధికారులు పేర్కొన్నారు. అంతే కాదు.. వీటి ద్వారా ఆయా కంపెనీలు నగరవ్యాప్తంగా చిన్న చిన్న ఆఫీసులుగా ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ట్రాన్సిట్‌ ఓరియెంటెడ్‌ స్పేస్‌ డెవలప్‌మెంట్‌ (ToD) పార్కింగ్ , సర్క్యులేషన్ ఏరియాతో పాటు పని, షాపింగ్, లీజర్, వినోదం, ఆరోగ్య సంరక్షణ విభాగాల కోసం దాదాపు 18.5 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని అందిస్తుంది. IT కంపెనీలపై దృష్టి సారించి, ఆఫీస్ బబుల్స్ కాన్సెప్ట్ 'హబ్ మరియు స్పోక్' మోడల్‌ను అందిస్తుంది. మెట్రో స్టేషన్లలో అన్-పెయిడ్ (ప్రీ-టికెటింగ్) ప్రాంతాలలో ట్రాన్సిట్ ఓరియెంటెడ్ స్పేస్‌లను ఉపయోగించుకుంటుంది. 49 సాధారణ మెట్రో స్టేషన్లలో 1750 చదరపు అడుగులతో రెండు యూనిట్లు, 8 నాన్-టిపికల్ మెట్రో స్టేషన్లలో 5,000-30,000 చదరపు అడుగుల యూనిట్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉందని కంపెనీ పేర్కొంది. మొత్తంగా ఖాళీగా ఉంటే.. 4 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఆఫీస్ బబుల్స్‌కు లీజుకు ఇవ్వనుంది.


జీవో నంబ‌ర్ 69 పై హైకోర్టు స్టే...


 ఏపీ స‌ర్కార్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. సినిమా టికెట్ల‌ను ఆన్‌లైన్‌లో విక్ర‌యించాల‌ని నిర్ణ‌యించి ఏపీ స‌ర్కార్ జారీ చేసిన జీవో నంబ‌ర్ 69పై ఇవాళ హైకోర్టు స్టే విధించింది. దీంతో ప్ర‌భుత్వమే ఆన్‌లైన్‌లో టికెట్లు విక్ర‌యించాల‌నే ప‌ద్ధ‌తికి బ్రేక్ ప‌డిన‌ట్టైంది. ఈ నేప‌థ్యంలో హైకోర్టు తీర్పు సినీ ప‌రిశ్ర‌మ‌కు కొండంత ఊర‌ట‌నిచ్చేదే.

సినీ పెద్ద‌ల కోరిక మేర‌కు ఆన్‌లైన్‌లో టికెట్ల విక్ర‌యానికి ప్ర‌భుత్వం ముందుకొచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో అస‌లు విష‌యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల ముందు పెట్టింది. ఆన్‌లైన్‌లో ప్ర‌భుత్వమే టికెట్లు విక్ర‌యించాల‌నే నిర్ణ‌యం త‌మ‌కు తాముగా తీసుకోలేద‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం వివ‌ర‌ణ ఇచ్చింది. 

మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున త‌దిత‌ర టాలీవుడ్ హీరోలు, పెద్ద‌ల సూచ‌న మేర‌కే ఆన్‌లైన్‌లో ప్ర‌భుత్వ‌మే టికెట్ల విక్ర‌యానికి ముందుకొచ్చిన‌ట్టు నాటి సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు గ‌త ఏడాది జీవో నంబ‌ర్ 69ను ప్ర‌భుత్వం జారీ చేసింది.

సినిమా టికెట్ల‌ను ప్ర‌భుత్వ‌మే విక్ర‌యించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త ఏడాది తీసుకొచ్చిన స‌వ‌ర‌ణ చ‌ట్టం, ఆ త‌ర్వాత జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను స‌వాల్ చేస్తూ కొంత మంది హైకోర్టును ఆశ్ర‌యించారు. ప‌లు ద‌ఫాలు హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఇవాళ కీల‌క తీర్పును హైకోర్టు వెలువ‌రించింది.  

ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల‌ను విక్ర‌యిస్తూ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త విధానంపై హైకోర్టు స్టే విధించింది. జీవో నెంబర్ 69 పై తదనంతర చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. తుది వ్యాజ్యాల విచార‌ణ‌కు ఈ నెల 27కు వాయిదా వేసింది. ఆన్‌లైన్‌లో ప్ర‌భుత్వమే సినిమా టికెట్ల విక్ర‌యించాల‌నే నిర్ణ‌యంపై స్టే విధించ‌డంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ త‌గిలిన‌ట్టైంది.

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...