Friday 1 July 2022

 

ఆర్మీ క్యాంపు మీద విరిగిపడిన కొండ చరియలు..

నోనీ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. టుపుల్ యార్డ్ రైల్వే నిర్మాణ ప్రాంతానికి సమీపంలోని 107 టెరిటోరియల్ ఆర్మీ క్యాంపు వద్ద భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఊహించని ఘటన సంభవించింది.

మణిపూర్‌లో  విషాదకర సంఘటన చోటు చేసుకుంది. నోనీ జిల్లాలో Army camp) సమీపంలో.. భారీగా కొండ చరియలు (Land slide)  విరిగి పడ్డాయి. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి సంభవించింది. కాగా, తూపుల్ యార్డ్ రైల్వే నిర్మాణ స్థలం సమీపంలోని 107 టెరిటోరియల్ ఆర్మీ (టీఏ) క్యాంపు వద్ద బుధవారం రాత్రి జరిగిన భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో.. ఇప్పటికే తొమ్మిది మంది టీఏ జవాన్లతో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆర్మీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పెద్ద ఎత్తున జవాన్లు ప్రమాద స్థలానికి చేరుకున్నారు.

నది నుంచి మృతదేహాలను (Dead bodies) బయటకు తీయడానికి ఎక్స్‌కవేటర్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ ఘటనలో.. పలువురు జవాన్లతో (Army jawans) సహా కనీసం 55 మంది ఆచూకి లభించలేదు. ఇజాయ్ నదికి సమీపంలో కొన్ని మృతదేహాలను అధికారులు కనుగొన్నారు. కొన్ని ప్రాంతాల్లో వెళ్లడానికి అధికారులకు కష్టతరమైంది. దీంతో.. అధికారులు.. మృతదేహాలను బయటకు తీయడానికి నది దిగువన కష్టతరమైన భూభాగంలో ఎక్స్‌కవేటర్‌లను మోహరించారు. ఘటనలో.. కేంద్ర, రాష్ట్ర విపత్తు దళాలతో పాటు ఇండియన్ ఆర్మీ, అస్సాం రైఫిల్స్, టెరిటోరియల్ ఆర్మీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

జిరిబామ్ జిల్లా నుంచి రాష్ట్ర రాజధాని ఇంఫాల్ వరకు నిర్మించబడుతున్న రైలు మార్గానికి టెరిటోరియల్ ఆర్మీ భద్రతను అందిస్తుంది. శిథిలాల కింద కూరుకుపోయిన.. సిబ్బంది ఉనికిని గుర్తించడానికి గాలి ద్వారా త్రూ వాల్ రాడార్ ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు, టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 13 మంది సిబ్బంది, ఐదుగురు పౌరులను రక్షించామని, తప్పిపోయిన సిబ్బంది కోసం రోజంతా అన్వేషణ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.

అయితే, ఘటనపై ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రభుత్వం నుంచి... మరణించిన వారి కుటుంబానికి ఒక్కొక్కరికి ₹ 5 లక్షలు, గాయపడిన వారికి ₹ 50,000 ఆర్థిక సహాయం ప్రకటించారు.

1 comment:

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...