Tuesday 12 July 2022

క్రిమినల్ కేసుల టాప్ లిస్టులో తెలంగాణ  సీఎం!

 

 

దేశంలోనే అత్యధికంగా క్రిమినల్ కేసులు నమోదైన‌ ఐదుగురు ప్రజాప్రతినిధుల్లో తెలంగాణ సీఏం కేసీఆర్ కూడా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) రిపోర్టులో ఇది వెల్లడైంది..

అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు, లోక్ సభ ఎంపీలు మాత్రమే ఓటర్లుగా ఉండే రాష్ట్రపతి ఎన్నికలు ఈనెల 18న జరుగనున్నాయి. ప్రతి ఎన్నికల సందర్భంలో చేసినట్లే ఇప్పుడు కూడా నేతల నేరచరితను బయటపెట్టాయి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సంస్థలు. ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఎన్నికై, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయబోయే వారిపై న‌మోదైన కేసులుకు సంబంధించి ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ తాజాగా ఒక రిపోర్ట్ ను విడుద‌ల చేశాయి. సదరు జాబితాలో ఎక్కువ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న తొలి ఐదుగురిలో తెలంగాణ సీఎం కేసీఆర్  పేరు కూడా ఉంది.. దేశంలోనే అత్యధికంగా క్రిమినల్ కేసులు నమోదైన‌ ఐదుగురు ప్రజాప్రతినిధుల్లో తెలంగాణ సీఏం కేసీఆర్ కూడా ఉన్నారు. ఏడీఆర్,  నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం.. కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, వాటిలో 37 తీవ్రమైన IPC సెక్ష‌న్లు కలిగి ఉన్నాయని వెల్ల‌డించారు. అత్యధిక క్రిమినల్ కేసులున్న టాప్ ఐదుగురు ప్రజాప్రతినిధుల్లో  కేరళ ఎంపీ డీన్ కురియకోస్ 204 కేసులతో మొద‌టి స్థానంలో ఉన్నారు. 99 పెండింగ్‌ కేసులతో (తమిళనాడు) DMK ఎంపీ ఎస్‌.కతిరవన్‌ రెండో స్థానంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్‌ ఆజం ఖాన్‌ 87 కేసుల‌తో మూడో స్థానంలో ఉన్నారు. మరో  ఎమ్మెల్యే ప్రిన్స్‌ జేజీ 73 కేసులతో నాలుగో స్థానంలో ఉండగా, 64 క్రిమినల్ కేసులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఐదో స్థానంలో నిలిచారు. ఈ నెల 18  రాష్ట్రపతి ఎన్నికలు ఉన్న నేప‌థ్యంలో ఈ రెండు వాచ్ బాడీలు మొత్తం సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల 4809 అఫిడవిట్‌లలో 4759 అధ్యయనం చేశాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న మొత్తం 4759 మంది ఎంపీలు/ఎమ్మెల్యేలలో 477 మంది అంటే 10% మాత్రమే మహిళలు ప్ర‌తినిధులు ఉండ‌డం గమనార్హం. ఏడీఆర్ రిపోర్టు ప్రకారం తెలంగాణ సీఎం కేసీఆర్ పై పెండింగ్ లో ఉన్న కేసుల్లో.. 13 నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన అభియోగాలు (IPC సెక్షన్-506), ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు అడ్డుకోవ‌డం, గాయపరచడానికి ప్ర‌య‌త్నించ‌డానికి సంబంధించిన 4 అభియోగాలు (IPC సెక్షన్-332), హత్య ప్రయత్నానికి సంబంధించిన 3 అభియోగాలు (IPC సెక్షన్-307),ప్రమాదకరమైన ఆయుధాలు లేదా మార్గాల ద్వారా గాయపరచడానికి సంబంధించిన 3 ఆరోపణలు (IPC సెక్షన్-324), ఎవరైనా ఒక వ్యక్తి నుండి దొంగతనంగా లేదా దాడి ద్వారా లేదా నేరపూరిత బలాన్ని ఉపయోగించి దొంగతనానికి పాల్పడి, ఆ వ్యక్తికి హాని కలిగించినా లేదా అతని ప్రాణానికి హాని కలిగించినా 'స్నాచింగ్స‌ నేరాలు 3 (IPC సెక్షన్-382) ఉన్నాయి. అంతేకాదు, మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలకు సంబంధించిన ఆరోపణలు (IPC సెక్షన్-153A),జీవిత ఖైదు లేదా ఇతర కారాగార శిక్షతో శిక్షార్హమైన నేరాలకు పాల్పడేందుకు ప్రయత్నించినందుకు శిక్షకు సంబంధించిన 2 ఆరోపణలు (IPC సెక్షన్-511),ప్రజా దుష్ప్రచారానికి దారితీసే స్టేట్‌మెంట్‌లకు సంబంధించిన ఆరోపణలు (IPC సెక్షన్-505),ధ్వంసం చేయడం లేదా తరలించడం మొదలైన చ‌ట్ట‌వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు సంబంధించిన 2 కేసులున్నాయి. ఇంకా

(IPC) సెక్షన్- 435),సంకల్పం, స్వీకరించే అధికారం లేదా విలువైన భద్రత (IPC సెక్షన్-477) యొక్క మోసపూరిత రద్దు, విధ్వంసం మొదలైన వాటికి సంబంధించిన 2 కేసులు, అభియోగాలకు సంబంధించిన అభియోగాలు, జాతీయ సమగ్రతకు విఘాతం కలిగించే వాదనలు సంబందించి 1 కేసు (IPC సెక్షన్-153B)  ఉన్నాయి. అయితే ఈ కేసుల్లో చాలా వ‌ర‌కు తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో న‌మోదైన కేసులు ఎక్కువ ఉన్నాయి. 

 ముందస్తు ఎన్నికలతో ప్రజలపై ఆర్థిక భారం జేడీ లక్ష్మీనారాయణ..



 

2024 ఎన్నికల్లో మార్పు తెచ్చేందుకు తనవంతు పనిచేస్తున్నాను అన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ  సమాజాన్ని చైతన్యవంతం చేసే పనిలో ఉన్నానని.. రెండేళ్ల సమయం ఉన్నా ఇప్పుడే ఎన్నికల వాతావరణం సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఎవరు కావాలో ప్రజలు నిర్ణయిస్తారని.. ముందస్తు ఎన్నికల ప్రచారం ప్రజల్లోనే ఉందని.. పార్టీల్లో కాదన్నారు. ముందస్తు ఎన్నికలతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజలు రాజకీయ నాయకులను ఐదేళ్ల కోసం ఎన్నుకుంటారని, ఎన్నికలు ముందుగా నిర్వహించటం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు లక్ష్మీ  నారాయణ. ముందస్తు ఎన్నికల ప్రచారంతో ప్రజలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయి అసలు సమస్యలు పక్కదారి పడతాయన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య, రాష్ట్రాల అప్పులపై చర్చలు జరగాలన్నారు.

వైఎస్సార్‌సీపీ (YSRCP) ప్లీనరీ తర్వాత ఆరు నెలల ముందుగానే ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోందన్నారు. వైఎస్సార్‌సీపీకి ఇది సరైన సమయమని.. రాష్ట్రపతి ఎన్నికలలో తమ అభ్యర్దిని గెలిపించేందుకు కావాల్సిన పూర్తి మెజారిటీ బీజేపీకి లేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీ (BJP)కి వైఎస్సార్‌సీపీ (YSRCP) మీద ఆధారపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చుకునేందుకు ఇది సరైన సమయమన్నారు. బీజేపీని ప్రత్యేక హోదా దిశగా ఒత్తిడి చేసి సాధించటంతో ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని వ్యాఖ్యానించారు లక్ష్మీనారాయణ.

 

మేధాపాట్కర్‌పై ఐపీసీ సెక్షన్ 420 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు

 

 

మధ్యప్రదేశ్‌లో సామాజిక కార్యకర్త మేధాపాట్కర్‌పై కేసు నమోదైంది. ట్రస్ట్‌ పేరుతో వసూలు చేసిన 13 కోట్ల రూపాయలకు సరైన అకౌంట్స్‌ లేవని ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 ఆదివాసీ పిల్లల చదువుల పేరుతో వసూలు చేసిన డబ్బును దుర్వినియోగం చేశారని ఆమెపై ఆరోపనలు వచ్చాయని, ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదైనట్టు పోలీసులు తెలిపారు. "ఆదివాసి పిల్లల చదువుల పేరుతో వసూలు చేసిన డబ్బును దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై బర్వానీ జిల్లాలో కార్యకర్త మేధా పాట్కర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సెక్షన్ 420 ఐపీసీ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది" అని బర్వానీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీపక్ కుమార్ శుక్లా తెలిపారు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లో మేధా పాట్కర్‌తో పాటు మరో 11 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది మహారాష్ట్రలో ఆదివాసి పిల్లలకు ప్రాథమిక విద్యను అందించేందుకు మేధా పాట్కర్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె సామాజిక కార్యకర్తగా నటించి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ప్రీతమ్ రాజ్ బడోలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆమెపై కేసు బుక్ అయింది. ఈ మేరకు పోలీసుల ప్రాథమిక విచారణలో నర్మదా నవనిర్మాణ అభియాన్ ట్రస్ట్ 14 ఏళ్లలో 13 కోట్ల రూపాయలు వసూలు చేసిందని, అవి ఎక్కడ నుంచి వచ్చాయి, వాటి ఖర్చుల వివరాలు సరిగ్గా లేవని పోలీసులు గుర్తించారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన నగదు ఉండడమే కాకుండా, వాటి వ్యయాలకు సంబంధించి ఆడిట్ అస్పష్టంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

అయితే ట్రస్ట్‌కు చెందిన పది బ్యాంకు ఖాతాల నుంచి రూ.4 కోట్లకుపైగా రికవరీ చేసినట్టు ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. మేధా పాట్కర్ తన వార్షిక ఆదాయాన్ని రూ. 6,000గా చూపి కోర్టును తపపుదోవ పట్టించారని, ఆమె సేవింగ్స్ ఖాతా నుంచి రూ.19 లక్షల మొత్తాన్ని రికవరీ చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను మేధాపాట్కర్ కొట్టిపారేశారు. పోలీసుల నుంచి తనకు ఎటువంటి అధికారిక నోటీసులు అందలేదని అన్నారు. అయితే ప్రతి ఆరోపణకు సమాధానంతో తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తనపై ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తికి ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్‌లతో సంబంధాలున్నాయని మేధా పాట్కర్ అన్నారు. తన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అన్ని స్పష్టంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. "ఆర్థిక స్థితికి సంబంధించిన ప్రతి ప్రశ్నకు ఆడిట్ నివేదిక అందుబాటులో ఉంది. వాస్తవానికి మేము గెలిచాం. మేము విదేశీ డబ్బును స్వీకరించం. మేం సమాధానం ఇస్తూనే ఉంటాం. సాక్ష్యాలను ముందుకు తెస్తాం." అని మేధా పాట్కర్ అన్నారు. గతంలో కూడా తాము ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొన్నాం. నిధులకు సంబంధించి ఇప్పటికే ఆడిట్ చేశామని ఆమె అన్నారు.

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...