Tuesday 12 July 2022

 ముందస్తు ఎన్నికలతో ప్రజలపై ఆర్థిక భారం జేడీ లక్ష్మీనారాయణ..



 

2024 ఎన్నికల్లో మార్పు తెచ్చేందుకు తనవంతు పనిచేస్తున్నాను అన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ  సమాజాన్ని చైతన్యవంతం చేసే పనిలో ఉన్నానని.. రెండేళ్ల సమయం ఉన్నా ఇప్పుడే ఎన్నికల వాతావరణం సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఎవరు కావాలో ప్రజలు నిర్ణయిస్తారని.. ముందస్తు ఎన్నికల ప్రచారం ప్రజల్లోనే ఉందని.. పార్టీల్లో కాదన్నారు. ముందస్తు ఎన్నికలతో ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజలు రాజకీయ నాయకులను ఐదేళ్ల కోసం ఎన్నుకుంటారని, ఎన్నికలు ముందుగా నిర్వహించటం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు లక్ష్మీ  నారాయణ. ముందస్తు ఎన్నికల ప్రచారంతో ప్రజలు ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయి అసలు సమస్యలు పక్కదారి పడతాయన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య, రాష్ట్రాల అప్పులపై చర్చలు జరగాలన్నారు.

వైఎస్సార్‌సీపీ (YSRCP) ప్లీనరీ తర్వాత ఆరు నెలల ముందుగానే ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరుగుతోందన్నారు. వైఎస్సార్‌సీపీకి ఇది సరైన సమయమని.. రాష్ట్రపతి ఎన్నికలలో తమ అభ్యర్దిని గెలిపించేందుకు కావాల్సిన పూర్తి మెజారిటీ బీజేపీకి లేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికలలో గెలిచేందుకు బీజేపీ (BJP)కి వైఎస్సార్‌సీపీ (YSRCP) మీద ఆధారపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను నెరవేర్చుకునేందుకు ఇది సరైన సమయమన్నారు. బీజేపీని ప్రత్యేక హోదా దిశగా ఒత్తిడి చేసి సాధించటంతో ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని వ్యాఖ్యానించారు లక్ష్మీనారాయణ.

2 comments:

  1. వాళ్లకు వేరే ప్రయోజనం ఉంది అందుకే వారు ప్రత్యేక హోదా అడగరు

    ReplyDelete
  2. ఎం చెప్పారు !!

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...