Tuesday 12 July 2022

 

మేధాపాట్కర్‌పై ఐపీసీ సెక్షన్ 420 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు

 

 

మధ్యప్రదేశ్‌లో సామాజిక కార్యకర్త మేధాపాట్కర్‌పై కేసు నమోదైంది. ట్రస్ట్‌ పేరుతో వసూలు చేసిన 13 కోట్ల రూపాయలకు సరైన అకౌంట్స్‌ లేవని ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 ఆదివాసీ పిల్లల చదువుల పేరుతో వసూలు చేసిన డబ్బును దుర్వినియోగం చేశారని ఆమెపై ఆరోపనలు వచ్చాయని, ఈ మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదైనట్టు పోలీసులు తెలిపారు. "ఆదివాసి పిల్లల చదువుల పేరుతో వసూలు చేసిన డబ్బును దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై బర్వానీ జిల్లాలో కార్యకర్త మేధా పాట్కర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. సెక్షన్ 420 ఐపీసీ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది" అని బర్వానీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దీపక్ కుమార్ శుక్లా తెలిపారు. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లో మేధా పాట్కర్‌తో పాటు మరో 11 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది మహారాష్ట్రలో ఆదివాసి పిల్లలకు ప్రాథమిక విద్యను అందించేందుకు మేధా పాట్కర్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె సామాజిక కార్యకర్తగా నటించి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ ప్రీతమ్ రాజ్ బడోలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆమెపై కేసు బుక్ అయింది. ఈ మేరకు పోలీసుల ప్రాథమిక విచారణలో నర్మదా నవనిర్మాణ అభియాన్ ట్రస్ట్ 14 ఏళ్లలో 13 కోట్ల రూపాయలు వసూలు చేసిందని, అవి ఎక్కడ నుంచి వచ్చాయి, వాటి ఖర్చుల వివరాలు సరిగ్గా లేవని పోలీసులు గుర్తించారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన నగదు ఉండడమే కాకుండా, వాటి వ్యయాలకు సంబంధించి ఆడిట్ అస్పష్టంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

అయితే ట్రస్ట్‌కు చెందిన పది బ్యాంకు ఖాతాల నుంచి రూ.4 కోట్లకుపైగా రికవరీ చేసినట్టు ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. మేధా పాట్కర్ తన వార్షిక ఆదాయాన్ని రూ. 6,000గా చూపి కోర్టును తపపుదోవ పట్టించారని, ఆమె సేవింగ్స్ ఖాతా నుంచి రూ.19 లక్షల మొత్తాన్ని రికవరీ చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను మేధాపాట్కర్ కొట్టిపారేశారు. పోలీసుల నుంచి తనకు ఎటువంటి అధికారిక నోటీసులు అందలేదని అన్నారు. అయితే ప్రతి ఆరోపణకు సమాధానంతో తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తనపై ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తికి ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్‌లతో సంబంధాలున్నాయని మేధా పాట్కర్ అన్నారు. తన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అన్ని స్పష్టంగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. "ఆర్థిక స్థితికి సంబంధించిన ప్రతి ప్రశ్నకు ఆడిట్ నివేదిక అందుబాటులో ఉంది. వాస్తవానికి మేము గెలిచాం. మేము విదేశీ డబ్బును స్వీకరించం. మేం సమాధానం ఇస్తూనే ఉంటాం. సాక్ష్యాలను ముందుకు తెస్తాం." అని మేధా పాట్కర్ అన్నారు. గతంలో కూడా తాము ఇలాంటి ఆరోపణలను ఎదుర్కొన్నాం. నిధులకు సంబంధించి ఇప్పటికే ఆడిట్ చేశామని ఆమె అన్నారు.

2 comments:

  1. నర్మదా నవనిర్మాణ అభియాన్ ట్రస్ట్ 14 ఏళ్లలో 13 కోట్ల రూపాయలు వసూలు చేసిందని, అవి ఎక్కడ నుంచి వచ్చాయి, వాటి ఖర్చుల వివరాలు సరిగ్గా లేవని పోలీసులు గుర్తించారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన నగదు ఉండడమే కాకుండా, వాటి వ్యయాలకు సంబంధించి ఆడిట్ అస్పష్టంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

    ReplyDelete
  2. పోలీసుల నుంచి తనకు ఎటువంటి అధికారిక నోటీసులు అందలేదని అన్నారు. అయితే ప్రతి ఆరోపణకు సమాధానంతో తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...