Sunday 25 September 2022

 

సిద్ది వినాయక ఫ్యామిలీ అసోషియన్ ఆధ్వర్యంలో బతుకమ్మవేడుకలు.

 



 

ప్రపంచంలో ప్రకృతి ఆరాధించే అరుదైన పండుగ ఏది అంటే ఏమాత్రం సందేహం లేకుండా చెప్పే పండుగ.

. బతుకమ్మ పండుగ. బతుకమ్మ అంటే ప్రకృతే. ఆడపిల్లలను బతుకు అమ్మాఅని మనసారా ఆశీర్వదించే పండుగ

 ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మనే బొడ్డెమ్మఅని కూడా అంటారు. దసరా శరన్నవరాత్రులు అంటే తొమ్మిది

 రోజులు జరిపే ఈ బతుకమ్మ పండుగను ఒక్కోరోజు ఒక్కో పేరుతో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు,

 వేడుకలు రోజూ ఒకేలా ఉండవు. తొమ్మిది రోజులు.. తొమ్మిది తీర్లుగా ఈ వేడుకలు సాగుతాయి.

మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానే బియ్యం బతుకమ్మ, ఐదోరోజు అట్ల బతుకమ్మ, ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడోరోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. ఇవి కూడా చాలా సంప్రదాయబద్దంగా జరుగుతాయి. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ. అంటే ఈ రోజుకంటే ఒక రోజు ముందుగానే బతుకమ్మను అలంకరించడానికి పూలు కోస్తారు. అవి మరుసటి రోజుకు వాడిపోకుండా నీళ్లలో వేసి, తర్వాతి రోజు బతుకమ్మగా పేరుస్తారు. అందుకే ఈ బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఈ రోజు మహిళలు తమలపాకులు, తులసి ఆకులను వాయనంగా ఇస్తారు. రెండోరోజు తంగేడు పూలు, గునుగు పూలు, బంతి పూలు, గడ్డి పూలను సేకరించి, గౌరమ్మను పేరుస్తారు. సాయంత్రం పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ అక్కడే నిమజ్జనం చేస్తారు. ఆ రోజు ప్రసాదంగా అటుకులు పంచుతారు. ఇక మూడోరోజు సీతమ్మ జడ, చామంతి, రామ బాణం వంటి పూలతో బతుకమ్మను పేర్చి, ముద్దపప్పు బతుకమ్మగా పూజిస్తారు. ఈ రోజు బెల్లం, సత్తుపిండి, చక్కెర, పెసలు వాయనంగా ఇస్తారు. నాలుగోరోజు నానబియ్యం బతుకమ్మ నిర్వహిస్తారు. ఈ రోజు గుమ్మడి, మందార పూలతో బతుకమ్మను పేరుస్తారు. ర్వాత నానబెట్టిన బియ్యం, బెల్లంతో కలిపి వాయనంగా ఇస్తారు. ఇక ఐదో రోజు అట్ల బతుకమ్మ నిర్వహిస్తారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ, ఏడో రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మగా పూజిస్తారు. చివరగా తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. బతుకమ్మ వేడుకల్లో ఈ రోజు చాలా ప్రత్యేకమైంది. ఆడపడుచులంతా బతుకమ్మలు పేర్చి, వాటి చుట్టూ చేరి చప్పట్లు, కోలలతో, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ బతుకమ్మను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. ఈ రోజుతో బతుకమ్మ వేడుకలు ముగుస్తాయి.

సనత్ నగర్ సిద్ది వినాయక ఫ్యామిలీ అసోషియన్ ఆధ్వర్యంలో మొదటి రోజు బతుకమ్మ సంబరాలు జరుపుకోవటం చాల ఆనందంగా ఉందని, కార్యక్రంలోపాల్గొన్న మహిళలు అన్నారు, ఈ కార్యక్రమంలో శ్రీలత, అఖిల కొన్నే, ఝాన్షి రాణి, స్వాతి, వాణి, పిల్లలు తదితరులు పాలొగొన్నారు 

 

 

మహా అన్నదాన కార్యక్రమం. కామధేనువు సేవాసమితి అద్వర్యంలో

 మహా అన్నదాన కార్యక్రమం. కామధేనువు సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీహనుమాన్ దేవాలయం  సనత్ నగర్  హైదరాబాద్ , ప్రాంగణంలో ఉన్న గోశాల నందు.. కుబేరుడు అన...