Thursday 21 July 2022

 

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేము!



కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని తేల్చిచెప్పింది. కాళేశ్వరానికి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ లేదని.. ఈ నేపథ్యంలో జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది.  లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిఅడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. 

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని సీఎం కేసీఆర్ 2016, 2018లో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. అయితే ఆ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. పర్మిషన్లు ఉంటేనే కాళేశ్వర ప్రాజెక్టును హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలిస్తుంది. హైపవర్ కమిటీ అనుమతిస్తేనే జాతీయ హోదా ఇచ్చే అవకాశం ఉంటుంది.  కాళేశ్వరానికి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ లేదు. జాతీయ ప్రాజెక్టుల జాబితాలో చేర్చే అర్హత దానికి లేదు. '' అని కేంద్ర జలశక్తి శాఖ సహాయకమంత్రి బిశ్వేశ్వర్ తుడు స్పష్టం చేశారు.

 

 

ఆంధ్ర వద్దు తెలంగాణే ముద్దు అంటున్న5  గ్రామాలు

ద్రాచలం వరదలు - పోలవరం డ్యాం వ్యవహారంలో ఏపీ, తెలంగాణ మధ్య మాటలయుద్ధం కొనసాగుతుండగా.. ఏపీలోని ఐదు గ్రామాలు కీలక తీర్మానం చేశాయి. తమను తెలంగాణలో కలపాలంటూ ఆయా గ్రామాల పాలక వర్గాలు గ్రామ పంచాయతీలో తీర్మానం చేశాయి. పురుషోత్తపట్నం, పిచుకలపాడు, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం గ్రామాల పాలక వర్గాలు ఏకగ్రీవ తీర్మానం చేశాయి.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో విలీనం చేసిన 7 మండలాల పరిధిలో ఈ ఐదు గ్రామాలు ఉన్నాయి. విలీనం తర్వాత వీటిని తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా చేర్చగా.. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్విభజన అనంతరం అల్లూరి మన్యం జిల్లాలో భాగంగా ఉన్నాయి. ఎటపాకను మండలంగా చేశారు. అయితే, జిల్లా కేంద్రం పాడేరు తమకు చాలా దూరంగా ఉందని ఈ ఐదు గ్రామాల ప్రజలు చెబుతున్నారు. సరకులు, వైద్య చికిత్స, ఇతర అవసరాల నిమిత్తం తాము తరచూ భద్రాచలం పట్టణానికి వెళ్తామని చెబుతున్నారు. ఏపీలో ఉన్నమాటే గానీ.. ఏ అవసరం వచ్చినా తెలంగాణకే వెళ్తున్నామని అంటున్నారు. ఈ నేపథ్యంలో తమను తిరిగి తెలంగాణ రాష్ట్రంలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం వల్ల భద్రాచలం పట్టణానికి ముందు ముప్పు ఎక్కువైందని తెలంగాణ

 వాదిస్తోంది. ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్.

 డిమాండ్ చేశారు. ఆ గ్రామాల్లో కరకట్టలు నిర్మించి, గోదావరి వరదలతో ముంపు ముప్పును తగ్గించే

 ప్రయత్నాలు చేస్తామని ఆయన అన్నారు. ఆయా గ్రామాల ప్రజల కోరిక కూడా ఇదేనని అన్నారు. అయితే
,
ఎవరో ఐదుగురు గ్రామస్థులు చెబితే.. ఆ గ్రామాలను తెలంగాణలో కలిపేస్తారా అంటూ ఏపీ జల వనరుల శాఖ

 మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. అంబటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఐదు గ్రామాల

 పంచాయతీ తీర్మానాలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

 

అంబులెన్సుకె ఆపద..!

 కొన్ని సార్లు.. వాహనాలు అదుపు తప్పి ఘోర ప్రమాదాలు జరుగుతుంటాయి. మనం తరుచుగా టూవీలర్స్, ఫోర్ వీలర్ వెహికిల్స్ వాహనాలు రోడ్డుప్రమాదానికి గురవ్వడం చూస్తుంటాం. భారీ వర్షం వలన లేదా కొన్ని సార్లు బ్రేకులు ఫెయిల్ కావడం వలన కూడా వాహనాలు ప్రమాదానికి గురౌతుంటాయి. చూస్తుండగానే.. ఘోరమైన రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘెర ప్రమాదం ప్రస్తుతం వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలో  ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కుందాపూర్ సమీపంలో ఉన్న షిరూర్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక అంబూలెన్స్ వేగంగా వస్తుంది. అక్కడ వర్షంకూడా భారీగా కురుస్తుంది. ఈ క్రమంలో.. అంబులెన్స్ సైరన్ ను విన్న సిబ్బంది.. పరిగెత్తుకుంటు బైటకు వచ్చారు. అడ్డుగా ఉన్న బారికెడ్లను తొలగిస్తున్నారు.

ఇంతలో.. డ్రైవర్ సడెన్ గా బ్రేక్ వేసిట్టున్నాడు. అసలే.. వర్షం.. ఆపైన స్పీడ్.. దీంతో అంబూలెన్స్ 

  అదుపు తప్పి బోర్లా పడింది. అదే విధంగా.. బోర్లుకుంటూ.. అక్కడే ఉన్న టోల్ బూత్ కు

 గుద్దుకుంది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ ప్రమాదంలో నలు

గురు స్పాట్ లోనే చనిపోయినట్లు సమాచారం. అంబూలెన్స్ లో ఉన్న వస్తువులు అన్న చెల్లాచెదురుగా

 బయట పడ్డాయి. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ షాకింగ్

 వీడియో సోషల్ మీడియాలో మారింది.

 

మావోయిస్టుల లేఖ!

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు భారీ నష్గం వాటిల్లింది. ఈ నేపథ్యంలో మావోయిస్టులు రెండు ప్రభుత్వాలకు లేఖ విడుదల చేశారు.

భద్రాద్రి కొత్త గూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరుతో లేఖ విడుదల చేసింది మావోయిస్టు పార్టీ. గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని లేఖలో ఆరోపించింది. పునరావాస కేంద్రాల్లో బాధితులు ఆకలితో అలమటిస్తున్నారని,  ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు సుమారు 500 గ్రామాలు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయని లేఖలో పేర్కొంది. ఇరు రాష్ట్రాల్లో గోదావరి వరదల నుంచి శాశ్వత రక్షణ కోసం లక్ష కోట్ల ప్యాకేజి ప్రకటించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. బీకే-ఏ.ఎస్.ఆర్. కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో ఈ లేఖ విడుదల చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు భారీ నష్గం వాటిల్లింది.  ముఖ్యంగా తెలంగాణలోని నిర్మల్, బైంసా, మంచిర్యాల, మంథని, రామగుండం, భద్రాచలం పట్టణాల్లోని చాలా కాలనీలు నీట మునిగి ఆయా ప్రాంతాలు అస్తవ్యస్తమయ్యాయి. రోడ్లు, భవనాలు, విద్యుత్ స్థంభాలు నెలకొరిగాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల  తెలంగాణ లో రూ. 1,400 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. వరద నష్టాలపై కేంద్రానికి నివేదిక కూడా అందించింది. తక్షణమే రూ. 1000 కోట్లు సాయం కింద విడుదల చేయాలని కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రోడ్లు భవనాల శాఖకు సంబంధించి రూ.498 కోట్ల నష్టం వాటిల్లింది. పంచాయితీ రాజ్ శాఖలో రూ.449 కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రూ.33 కోట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో రూ.379 కోట్లు విద్యుత్ శాఖలో రూ. 7 కోట్ల నష్టం వాటిల్లింది. ఏపీలోని గోదావరి పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. భద్రాచలం కింద వున్న విలీన గ్రామాల పరిస్థితి అధ్వాన్నంగా వుంది. ఇటు ఏపీ, అటు తెలంగాణ సీఎంలు ఏరియల్ సర్వేల ద్వారా వరద ప్రాంతాలను పరిశీలించారు. వరద బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

భారీవర్షాలు, గోదావరి వరదల)వల్ల వేలాది మంది ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. వరద ప్రభావం వల్ల ఇళ్ళను కోల్పోయారు

 

 కేరళలో NEET పరీక్షపై మానవ హక్కుల సంఘం సీరియస్...

 

మెటల్ హుక్స్ ఉన్న బ్రాలను తొలగించాలని పరీక్షా కేంద్రంలో సిబ్బంది ఒత్తిడి చేశారు. దాంతో ఓ అమ్మాయి 

 బ్రా లేకుండానే మూడు గంటలు పరీక్ష రాసింది. ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పగా.. ఆయన మీడియా 

ముందు విషయాన్ని తెలియజేశారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత మరికొంతమంది 

విద్యార్థినులు కూడా ఇదే తరహాలో ఫిర్యాదు చేశారు. లో దుస్తుల లేకుండా పరీక్ష రాయడంతో చాలా ఒత్తిడికి గురయ్యామని వారంతా వాపోయారు. దాంతో వివాదం ముదిరింది. ఈ అంశంపై మానవ హక్కుల సంఘం స్పందించి. పదిహేను రోజుల్లోగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని కొల్లాం రూరల్ ఎస్పీని ఆదేశించింది. కేరళ విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఎన్‌టీఏపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు లేఖ రాశారు. అయితే మొదట ఇవన్నీ ఆరోపణలని, బాలికలు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ కొట్టిడేసింది. కానీ కొల్లంలో పర్యటించేందుకు ఎన్టీఏ నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది.

 నాలుగు వారాల్లో ప్యానెల్ తన నివేదికను సమర్పించనుందని అధికారులు తెలిపారు.పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. గురువారం నీట్ అబ్జర్వర్, ఎగ్జామ్ కో ఆర్డినేటర్‌ను పోలీసులు విచారించి తర్వాత అరెస్ట్ చేసినట్టు ఒక అధికారి తెలిపారు. వీరి అరెస్ట్‌తో ఇప్పటి వరకు ఏడుగురుని అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయిల లో దుస్తులను విప్పించిన సమయంలో డ్యూటీలో ఉన్న ఐదుగురు మహిళలను మంగళవారం అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నియమించిన ఏజెన్సీలో పనిచేస్తుండగా.. ఇద్దరు ఘటన జరిగిన ఆయూర్‌లోని ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేస్తున్న వారు. కొల్లాంలోని మార్థమాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ కేంద్రంలో విద్యార్థినులను లో దుస్తులను తీసేసిన తర్వాతే లోపలికి అనుమతించినట్టు మొదట ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఐదుగురు ఫిర్యాదు చేశారు. దీంతో కాలేజీలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించినట్టు తెలుస్తుంది.




               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...