Thursday, 21 July 2022
మావోయిస్టుల లేఖ!
భద్రాద్రి
కొత్త గూడెం-అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ పేరుతో లేఖ విడుదల చేసింది
మావోయిస్టు పార్టీ. గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో ఏపీ, తెలంగాణ
ప్రభుత్వాలు విఫలం అయ్యాయని లేఖలో ఆరోపించింది. పునరావాస కేంద్రాల్లో బాధితులు
ఆకలితో అలమటిస్తున్నారని, ఆదిలాబాద్ నుంచి భద్రాచలం వరకు సుమారు 500 గ్రామాలు
ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయని లేఖలో పేర్కొంది. ఇరు రాష్ట్రాల్లో గోదావరి వరదల
నుంచి శాశ్వత రక్షణ కోసం లక్ష కోట్ల ప్యాకేజి ప్రకటించాలని మావోయిస్టు పార్టీ
డిమాండ్ చేసింది. బీకే-ఏ.ఎస్.ఆర్. కమిటీ కార్యదర్శి ఆజాద్ పేరుతో ఈ లేఖ విడుదల
చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు భారీ నష్గం
వాటిల్లింది. ముఖ్యంగా తెలంగాణలోని నిర్మల్, బైంసా, మంచిర్యాల, మంథని,
రామగుండం, భద్రాచలం పట్టణాల్లోని చాలా కాలనీలు
నీట మునిగి ఆయా ప్రాంతాలు అస్తవ్యస్తమయ్యాయి. రోడ్లు, భవనాలు,
విద్యుత్ స్థంభాలు నెలకొరిగాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు,
గోదావరి వరదల తెలంగాణ లో
రూ. 1,400 కోట్ల నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా
వేసింది. వరద నష్టాలపై కేంద్రానికి నివేదిక కూడా అందించింది. తక్షణమే రూ. 1000
కోట్లు సాయం కింద విడుదల చేయాలని కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రోడ్లు భవనాల శాఖకు
సంబంధించి రూ.498 కోట్ల నష్టం వాటిల్లింది. పంచాయితీ రాజ్ శాఖలో రూ.449
కోట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రూ.33 కోట్లు
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో రూ.379 కోట్లు విద్యుత్ శాఖలో
రూ. 7 కోట్ల నష్టం వాటిల్లింది. ఏపీలోని గోదావరి పరివాహక
ప్రాంతాలు, లంక గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయి. భద్రాచలం కింద
వున్న విలీన గ్రామాల పరిస్థితి అధ్వాన్నంగా వుంది. ఇటు ఏపీ, అటు
తెలంగాణ సీఎంలు ఏరియల్ సర్వేల ద్వారా వరద ప్రాంతాలను పరిశీలించారు. వరద బాధితులను
ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.
భారీవర్షాలు, గోదావరి
వరదల)వల్ల వేలాది మంది ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.
వరద ప్రభావం వల్ల ఇళ్ళను కోల్పోయారు
Subscribe to:
Post Comments (Atom)
పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం. విద్యార్థి , విద్యార్థినిలు కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...
-
24 లక్షల జీతంతో ఉద్యోగం.. అదరగొట్టిన జేఎన్టీయూ హైదరాబాద్ విద్యార్థులు! విద్యార్థులు అదరగొట్టేశారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూని...
-
మహా అన్నదాన కార్యక్రమం. శ్రీ సిద్ది వినాయక ఫ్యామిలీ అసోషియన్ అన్నం పరబ్రహ్మ స్వరూపం" శ్రీ సిద్ది వినాయక ఫ్యామిలీ అసోసియన్ ఆధ్వర్యంలో...
-
ముదురుతున్న మునుగోడు రాజకీయం రాజకీయం తెలంగాణ కేంద్రంగా పరిభ్రమిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక , టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ (భారతీయ...
No comments:
Post a Comment