Sunday 17 July 2022

 

రాష్ట్రపతి ఎన్నికలు: పార్లమెంటుతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలలో




రాష్ట్రపతి ఎన్నికలకు అంతా సిద్ధమయ్యింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హాల్‌లో ఈ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటల నుంచి పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటల వరకూ సాగుతుంది.

ఏపీకి చెందిన 175 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎన్డీయే తరుపున ద్రౌపది ముర్ము, విపక్షాల తరుపున యశ్వంత్ సిన్హా పోటీపడుతున్నారు. ఇప్పటికే ముర్ము ఏపీలో కూడా పర్యటించారు. వైఎస్సార్సీపీ, టీడీపీ నేతలను కలిశారు. తనకు మద్ధతు ప్రకటించిన ఇరు పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్ 2 లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణకు చెందిన 119 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కందుకూరు శాసనసభ్యులు మహిధర్ రెడ్డి హైదరాబాదులోనే ఓటు వేయనున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, హన్మంత్ షిండే ఏజెంట్లుగా వ్యవహరిస్తుండగా, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు బీజేపీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారు.

ఏపీ అసెంబ్లీలో అధికారికంగా వైసీపీకి 151 మంది, టీడీపీకి 23 మంది, జనసేన తరుపున ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండు ప్రధాన పార్టీలు ద్రౌపది ముర్ముకి మద్ధతు ప్రకటించాయి. జనసేన బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. కానీ ఆపార్టీ ఎమ్మెల్యే ఇప్పటికే వైఎస్సార్సీపీ వైపు మొగ్గుచూపడంతో అధికారికంగా మద్ధతు ప్రకటించలేదు.

అయినపప్పటికీ అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే సహా అందరి ఓట్లు ముర్ముకి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో ఏర్పాట్లు చేశారు కేంద్ర పరిశీలకులు వాటిని పరిశీలించారు. అసెంబ్లీ హాల్ లో చేసిన ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రక్రియ ను వీడియో తీయబోతున్నారు. పోలింగ్ తర్వాత బాక్సులు స్ట్రాంగ్ రూమ్ కి తరలిస్తారు. ఈనెల 21వ తేదీన ఓట్లు లెక్కించబోతున్నారు.

 

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...