Thursday 15 December 2022

 

మూడు సార్లు విషప్రయోగం జరిగినా బతికి బయటపడిన షానుబీ

 

 

ఎంత పకడ్బందీగా హత్య చేసినా, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో హంతకుడ్ని పట్టుకోగలుగుతున్నారు. అందుకే ఓ దుర్మార్గుడు వెరైటీగా ఆలోచించాడు. పాము కాటుతో హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. పథకాన్ని సక్సెస్ ఫుల్ గానే అమలు చేశాడు కానీ ఫలితం మాత్రం రివర్స్ కొట్టింది

మధ్యప్రదేశ్ లోని మాల్యా ఖేడీ గ్రామానికి చెందిన మోజిమ్ స్మగ్లింగ్ చేసి దొరికిపోయాడు. రెండేళ్లు జైలుశిక్ష పడింది. దీంతో అతడి భార్య షాను బీ, వేరే ఊరు వెళ్లిపోయింది. జైలు నుంచి తిరిగొచ్చిన మోజిమ్, మొదటి భార్యను పట్టించుకోలేదు. హలీమా అనే అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

రెండో పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న మొదటి భార్య పంచాయితీ పెట్టింది. దీంతో ఇద్దరితో కాపురం చేయడానికి అంగీకరించాడు మోజిమ్. అయితే రెండో భార్యకు ఇది నచ్చలేదు. దీంతో మొదటి భార్య షానుబీని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు మోజిమ్.

పాము కాటుతో హత్య..

ఎలా చంపినా పోలీసులకు దొరికిపోతాని మోజిమ్ కు బాగా తెలుసు. పైగా పోలీస్ ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో అతడికి అనుభవం కూడా ఉంది. అందుకే పాములు పట్టే తన స్నేహితుడి సహాయం తీసుకున్నాడు. ఓ విష నాగును తీసుకొచ్చి మొదటి భార్య దగ్గర వదిలాడు. ప్లాన్ వర్కవుట్ అయింది. పాము గట్టిగా కాటేసింది. కానీ ఆ పాము కాటు నుంచి షానుబీ కోలుకుంది.

దీంతో రెండోసారి ఇదే ప్లాన్ ను అమలు చేశాడు. ఆశ్చర్యంగా రెండో సారి కూడా షానుబీ పాముకాటు నుంచి తప్పించుకుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో భార్యను కట్టేసి, విషం ఇంజెక్షన్ ఇచ్చాడు మోజిమ్. గట్టిగా అరిచిన భార్య, తన తండ్రి సహాయంతో హాస్పిటల్ లో జాయిన్ అయి ప్రాణాలు దక్కించుకుంది.

మొదటి భార్య ఇచ్చిన ఫిర్యాదుతో మోజిమ్ తో పాటు, మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మూడు సార్లు విషప్రయోగం జరిగినా బతికి బయటపడిన షానుబీ, స్థానికంగా అందరి దృష్టిని ఆకర్షించింది. 

 

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...