Friday 14 October 2022

 

ప్రొ.​ సాయిబాబా నిర్దోషి!

యూఏపీఏ ను రద్దు చేయాలని డిమాండ్!

 


 

మావోయిస్టు సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్  తీర్పు నిచ్చింది. 

ప్రొఫెసర్ సాయిబాబాకు నిషేధిత మావోయిస్ట్ సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని, ఆయన్ను వెంటనే రిలీజ్ చేయాలని ఆదేశించింది. ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్‌ను కూడా ధర్మాసనం అనుమతించి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఐదుగురిలో ఒకరు అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు.

తనకు జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్ కోర్టు 2017లో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జీఎన్ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ రోహిత్ డియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ విచార‌ణ చేప్ప‌టి నిర్దోషిలుగా ప్ర‌క‌టించింది. శారీరక వైకల్యం కారణంగా వీల్‌చైర్‌లో ఉన్న జీఎన్ సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.

ప్రొఫెసర్ సాయిబాబా ఎవరు?

దిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జి.ఎన్.సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు అరెస్టుచేశారు. 2017 మార్చిలో యూఏపీఏ చట్టం కింద ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. ఆయనను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో గల అండా సెల్‌లో నిర్బంధించారు.

వైద్య పరిభాషలో చెప్పాలంటే సాయిబాబాకు 90 శాతం వైకల్యముంది. ఐదేళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. రెండు కాళ్లూ నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచీ ఆయన వీల్‌చైర్‌కే పరిమితయ్యారు. 2014 నుంచి జైలులోనే ఉన్న ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలున్నాయి. మరోవైపు ఆయనకు హృద్రోగ సమస్యలూ ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

 

దీనిపై డా తోట శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ..

సాయిబాబాపై మోపిన అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)ను రద్దు చేయాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్‌సీపీ ఎమ్మెల్యే సుప్రియా సూలే, మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, విద్యావేత్తలు గతంలో డిమాండ్ చేశారు.

''పౌర హక్కులు, ప్రజాస్వామ్యం, సమాఖ్య స్ఫూర్తిపై ప్రభుత్వం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలి''అని హేమంత్ సోరెన్ అప్పట్లో వ్యాఖ్యానించారు.

<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-2469006669274971"

     crossorigin="anonymous"></script>

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...