Friday 14 October 2022

 

ప్రొ.​ సాయిబాబా నిర్దోషి!

యూఏపీఏ ను రద్దు చేయాలని డిమాండ్!

 


 

మావోయిస్టు సంబంధాల కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్  తీర్పు నిచ్చింది. 

ప్రొఫెసర్ సాయిబాబాకు నిషేధిత మావోయిస్ట్ సంస్థలతో ఎలాంటి సంబంధాలు లేవని, ఆయన్ను వెంటనే రిలీజ్ చేయాలని ఆదేశించింది. ఈ కేసులో మరో ఐదుగురు దోషుల అప్పీల్‌ను కూడా ధర్మాసనం అనుమతించి వారిని నిర్దోషులుగా ప్రకటించింది. ఐదుగురిలో ఒకరు అప్పీలు విచారణలో ఉండగానే మరణించారు.

తనకు జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్ కోర్టు 2017లో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జీఎన్ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ రోహిత్ డియో, అనిల్ పన్సారేలతో కూడిన డివిజన్ బెంచ్ విచార‌ణ చేప్ప‌టి నిర్దోషిలుగా ప్ర‌క‌టించింది. శారీరక వైకల్యం కారణంగా వీల్‌చైర్‌లో ఉన్న జీఎన్ సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో ఉన్నారు.

ప్రొఫెసర్ సాయిబాబా ఎవరు?

దిల్లీ యూనివర్సిటీ అనుబంధ కళాశాల రామ్‌లాల్ ఆనంద్ కాలేజ్‌లో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జి.ఎన్.సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై 2014 మేలో మహారాష్ట్ర పోలీసులు అరెస్టుచేశారు. 2017 మార్చిలో యూఏపీఏ చట్టం కింద ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. ఆయనను మహారాష్ట్రలోని నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో గల అండా సెల్‌లో నిర్బంధించారు.

వైద్య పరిభాషలో చెప్పాలంటే సాయిబాబాకు 90 శాతం వైకల్యముంది. ఐదేళ్ల వయసులోనే ఆయనకు పోలియో సోకింది. రెండు కాళ్లూ నడవడానికి వీలు లేకుండా ఉన్నాయి. చిన్ననాటి నుంచీ ఆయన వీల్‌చైర్‌కే పరిమితయ్యారు. 2014 నుంచి జైలులోనే ఉన్న ఆయన అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. నరాలు దెబ్బతినడం, కాలేయ సమస్యలు, బీపీ తదితర సమస్యలున్నాయి. మరోవైపు ఆయనకు హృద్రోగ సమస్యలూ ఉన్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

 

దీనిపై డా తోట శ్రీకాంత్ గారు మాట్లాడుతూ ..

సాయిబాబాపై మోపిన అక్రమ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ)ను రద్దు చేయాలని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, ఎన్‌సీపీ ఎమ్మెల్యే సుప్రియా సూలే, మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు, విద్యావేత్తలు గతంలో డిమాండ్ చేశారు.

''పౌర హక్కులు, ప్రజాస్వామ్యం, సమాఖ్య స్ఫూర్తిపై ప్రభుత్వం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలి''అని హేమంత్ సోరెన్ అప్పట్లో వ్యాఖ్యానించారు.

<script async src="https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js?client=ca-pub-2469006669274971"

     crossorigin="anonymous"></script>

8 comments:

  1. కొంత కాలం కిందటి వరకు ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు విరసం నేత వరవరరావు ఆరోగ్య విషయంలో వారి బంధువులు, అభిమానుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ప్రభుత్వం వారికి జైలులో సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలేదని, కరోనావైరస్ పేరుతో చంపేయడానికి కుట్ర చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
    అయితే, వారి ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది. కేస్లుల్లో తీవ్రత దృష్ట్యా వయసు, అనారోగ్య కారణాలతో బెయిల్ ఇవ్వకూడదని న్యాయస్థానాల్లో వాదిస్తూ వచ్చింది.
    తాజాగా బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ ఆయన్ను విడుదల చేయాలని తీర్పు ఇచ్చింది.

    ReplyDelete
  2. ప్రొఫెసర్ సాయిబాబా.. తన ఆరోగ్యం రీత్యా బెయిల్‌ ఇవ్వాలని గతంలో కూడా కోరినపుడు.. ఆయనపై మోపిన ఆరోపణల దృష్ట్యా వికలాంగుడనే కారుణ్య కారణాలతో బెయిల్ ఇవ్వలేమని అప్పట్లో గడ్చిరౌలి సెషన్స్‌ కోర్టు వ్యాఖ్యానించింది.
    ప్రస్తుతం ఆయనకు కనీస సదుపాయాలు కూడా కల్పించడంలేదని, అందుకే ఆయన నిరాహార దీక్ష చేపడుతున్నారని గతంలో సాయిబాబా భార్య ఎ.ఎస్.వసంతకుమారి 2020 అక్టోబర్ లో చెప్పారు. నాగ్‌పుర్ జైలు సూపరింటెండెంట్‌కు ఆమె ఓ లేఖ రాశారు.

    ReplyDelete
  3. ప్రొఫెసర్ సాయిబాబాకు వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలని 'కమిటీ ఫర్ ద డిఫెన్స్ అండ్ రిలీజ్ ఫర్ డాక్టర్ జీఎన్ సాయిబాబా' చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ కూడా జైలు సూపరింటెండ్‌కు లేఖ రాశారు

    ReplyDelete
  4. 'పౌర హక్కులు, ప్రజాస్వామ్యం, సమాఖ్య స్ఫూర్తిపై ప్రభుత్వం చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలి''

    ReplyDelete
  5. కొంత కాలం కిందటి వరకు ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు విరసం నేత వరవరరావు ఆరోగ్య విషయంలో వారి బంధువులు, అభిమానుల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ప్రభుత్వం వారికి జైలులో సరైన వైద్య సదుపాయాలు కల్పించడంలేదని, కరోనావైరస్ పేరుతో చంపేయడానికి కుట్ర చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు

    ReplyDelete
  6. తనకు తీవ్ర ఆరోగ్య సమస్యలున్నాయని, క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తల్లిని చూడాలంటూ సాయిబాబా పెరోల్ కోసం పిటిషన్ వేయగా, 2020 మేలో బాంబే హైకోర్టు దానిని తోసిపుచ్చింది. అదే ఏడాది ఆగస్టులో సాయిబాబా తల్లి మరణించారు.

    ReplyDelete
  7. బాంబే హైకోర్టులోని జస్టిస్ రోహిత్ దేవ్, జస్టిల్ అనిల్ పన్సారేలతో కూడా డివిజన్ బెంచ్ సాయిబాబాతోపాటు మరో ఐదుగురికి విధించిన శిక్షలను కొట్టివేసింది.
    ఇతర కేసులేమీ లేకుంటే, వారిని వెంటనే విడుదల చేయాలని కోర్టు పేర్కొన్నట్లు ది హిందూ పత్రిక వెల్లడించింది.
    సాయిబాబాతోపాటు ప్రశాంత్ రాహీ, హేం మిశ్రా, విజయ్ టిక్రి, పాండు నరోటె, మహేశ్ టిక్రి ల శిక్షలను కోర్టు కొట్టేసింది. ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న పాండు నరోటే ఈ ఏడాది ఆగస్టులో స్వైన్ ఫ్లూ సోకడంతో జైలులోనే మరణించారు.

    ReplyDelete
  8. ఆరోగ్య కారణాల వల్ల తనకు బెయిల్ ఇవ్వాలంటూ సాయిబాబా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను నాగపూర్ బెంచ్ జులై 28, 2020న కొట్టి వేసింది.

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...