Tuesday 18 October 2022

 

హైదరాబాద్ లో దారుణం..4 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి!




హైదరాబాద్ నగరంలో DAV  స్కూల్ లో ప్రిన్సిపాల్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న రజిని కుమార్ అనే దుర్మార్గుడు స్కూల్ లో ఉన్న డిజిటల్ క్లాస్ రూమ్ లోకి వెళ్లి గత రెండునెలలుగా   ఎల్కేజీ చదువుతున్న విద్యార్థిని (4) పై లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్టు బాధితురాలి బంధువులు తెలిపారు. ఈ మధ్య కాలంలో పాపా ప్రవర్తన లో తేడా గమనించి తల్లి తండ్రులు ఆరా తీయగా దారుణం వెలుగు వెలుగుచూసింది. ఇలాంటి దుర్మార్గులను వెంటనే కఠినంగా శిక్షించాలని తల్లితండ్రులు కోరుతున్నారు

3 comments:

  1. డ్రైవర్ రజనీ కుమార్ డిజిటల్ క్లాస్ రూమ్‌లోకి ప్రవేశించి పిల్లలను ఇబ్బంది పెట్టేవాడని తెలిపారు. చాలా మంది పిల్లలు అతనికి చూస్తే భయపడుతున్నారని పోలీసులు వెల్లడించారు. "ఆ స్కూలు మంచిదని పాఠశాలకు డొనేషన్ కూడా ఇచ్చాం. ఇక మా పాపను మళ్లీ ఆ స్కూలుకు పంపం. అది ఎంతో పేరున్న స్కూల్ కావచ్చు. ఇంత జరుగుతున్నా ప్రిన్సిపల్‌కు తెలియకపోవటం.., తన డ్రైవర్ చేస్తున్న పనిని పట్టించుకోకపోవడం దారుణం. ఇలాంటి నిందితులను కఠినంగా శిక్షించాలని" చిన్నారి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

    ReplyDelete
  2. మంగళవారం సాయంత్రం స్కూల్‌లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరైన స్పందన లేదని.., ప్రిన్సిపల్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారని.., స్కూల్‌లో చదివే ఓ స్టూడెంట్ తండ్రి డీజీపీని ట్యాగ్ చేస్తూ ట్వీట్టర్‌లో పోస్టు చేశారు

    ReplyDelete
  3. ప్రిన్సిపల్ డ్రైవర్ ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మేం అందరం బంజారాహిల్స్ పీఎస్‌కి వచ్చాం. పోలీసులు మాత్రం ప్రిన్సిపాల్‌కి మద్దతు ఇస్తున్నారు. మాకు న్యాయం కావాలి" అని ట్వీట్ చేశారు.

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...