Thursday 23 June 2022

 

 

బీజేపీ ప్రతీకారచర్య !??? ఉద్ధవ్ దే ముమ్మాటికీ తప్పు

 

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది ఒక అభిప్రాయం. దానిని పూర్తిగా నమ్మింది, ఒంటబట్టించుకున్నది చంద్రబాబునాయుడు వంటి నాయకులు. 

అందుకే అప్పటివరకు మద్దతిచ్చి చేతిలో చేయి వేసి నడిచిన మోదీని వెన్నుపోటు పొడిచి అమాంతం బద్ధశత్రువైన కాంగ్రెస్ తో జతకట్టగలిగాడు. 

తెరాసాతో కూడా చేతులు కలిపి మళ్లీ తెలంగాణాలో తెదేపాకి ఊపిరులూదుకునే ఆలోచనలు చేయగలిగాడు (ఈ విషయం కేటీఆర్ ఒక సందర్భంలో చెప్పాడు). 

కానీ అన్ని సామెతలూ ఎల్లవేళలా నిజాలు కావు. ఒక్కసారి శత్రువుగా మనసులో నమోదైతే ఇక పిడక కాలేవరకు ఆ శత్రుత్వాన్ని అలాగే ఉంచుకునే ఉద్దండ రాజకీయవేత్తాలున్నారు మన దేశంలో. మోదీ, అమిత్ షాలు ఈ పద్ధతికి నిలువెత్తు రూపాలు. 

నిన్నటికి నిన్న మహరాష్ట్ర ఉదంతమే దీనికి మచ్చుతునక. 

అక్కడ శివసేన-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. ఆశ్చర్యకరంగా ఏకనాథ్ షిండే అనే శివసేన నాయకుడు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుని ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూల్చిపారేసాడు. ఉన్న 56 ఎమ్మెల్యేలలో 40 మందిని పక్కకు లాగేస్తే ఇక చేసేదేముంది? ఉద్ధవ్ తప్పుకున్నాడు. 

పైకి చూస్తే ఇది కేవలం శివసేనలో చిచ్చులాగ కనిపించొచ్చు. కానీ ఆ చిచ్చు పెట్టిందెవరు? అసలు కారణమేమిటి, కథేమిటి అని చూస్తే 2019 ఎన్నికల ముందు కాలానికి వెళ్లాలి. 

శివసేన, బీజేపీ కలిసే పోటీ చేసాయి 2019 సార్వత్రిక ఎన్నికల్లో. బీజేపీకి 106 సీట్లు రాగా, శివసేనకి 56 వచ్చాయి. ఆ రెండు పార్టీలు కలిసి 288 స్థానాల మహరాష్త్ర అసంబ్లీలో జయకేతనం ఎగరవేయడం కష్టం కాదు. కానీ ఉద్ధవ్ థాకరేకి ముఖ్యమంత్రైపోవాలన్న కోరికపుట్టింది. బీజేపీ దానికి ఒప్పుకోలేదు. అంతే వెంటనే బీజేపీని తూచ్ అని శరద్ పవార్ నీడలోని ఎన్.సి.పి కి మద్దతిస్తానన్నాడు. 

ఈ వెన్నుపోటుని తాళలేని మోదీ-షాలు శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ వర్గాన్ని తమవైపుకు లాక్కుని మద్దతు కూడగట్టుకుని బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫద్నవీస్ ని ముఖ్యమంత్రిని చేసారు. శరద్ పవార్ మళ్లీ ఏం నమ్మబలికాడో ఏమో అజిత్ పవార్ వర్గం మళ్లీ ప్లేటు ఫిరాయించి వెనక్కి పోయింది. పర్యవసానంగా ప్రమాణ స్వీకారం చేసిన రెండ్రోజుల్లోనే దేవేంద్ర ఫద్నవీస్ పదవీచ్యుతుడయ్యాడు. 

ఈ వెన్నుపోట్ల పరంపరని తట్టుకోలేని మోదీ-షాలు సమయం కోసం చూసారు. జాగ్రత్తగా రాజకీయ పథకరచన చేసారు. నిజానికి ఇది కనీసం రెండేళ్ల క్రితమే జరగాల్సిన విషయం. ఆలశ్యమైనా ఎట్టకేలకి 40 మంది ఎమ్మెల్యేలని పక్కకు తప్పించి మరీ ఉద్ధవ్ ప్రభుత్వాన్ని కూల్చేసారు. 

రాజకీయంగా ఇందులో మోదీ-షాలు చేసింది తప్పు కాదనిపిస్తుంది. ఉద్ధవ్ దే ముమ్మాటికీ తప్పు. ఎందుకంటే బాల్ థాకరే హిందుత్వవాది. కాంగ్రెస్ కి బద్ధవ్యతిరేకి. శివసేన ఆవిర్భావమే కరడుగట్టిన హిందూవాదంతో జరిగింది. బీజేపీ తో బాల్ థాకరే భావజాలం కలుస్తుంది. 1993 నుంచి 1998 వరకు శివసేన-బీజేపీ లు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపాయి. అప్పట్లో శివసేనదే పైచేయి. బీజేపీది ఇంకా ఎదుగుతున్న వయసు. 

ఈ నేపథ్యంలో తుచ్ఛమైన పదవి కోసం శివసేనని కాంగ్రెస్ పక్కలో పడుకోబెట్టడం బాల్ థాకరే అభిమానులకు అస్సలు మింగుడుపడని వ్యవహారం. ఏ మాత్రం ప్రజల్లో కరిష్మాలేని ఉద్ధవ్ కి ముఖ్యమంత్రి కావడానికి 2019 నాటి పరిస్థితి కంటే మెరుగైన పరిస్థితి రాదని అనుకుని ఉండొచ్చు. అందుకే పదవి కోసం పార్టీ భావజాలాన్ని మంటలో కలిపాడు.

అలా ఏ ఎండకి ఆ గొడుకు పట్టుకునే నాయకులకి మోదీ-షాలు సమయం చూసి గుణపాఠం చెప్తుంటారు. అంతటితో ఆగరు కూడా. రాజకీయాన్ని తిప్పి శత్రువు అనుకున్న పార్టీని నామరూపాల్లేకుండా భూస్థాపితం కూడా చేయగలరు. అదీ మోదీ మార్కు రాజకీయం. 

 

 

లంచం కోసం పుస్తెల తాడు!!??

ఏడడుగులు. మూడుముళ్ల బంధంతో కొత్త జీవితాన్ని ఆరంభించే మహిళలు తాళికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తమ మెడలో తాళిని అత్యంత గౌరవిస్తారు. అంతటి విలువనిచ్చే తాళే లంచంగా ఇస్తూ .. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు అక్కడి మహిళలు. రాజన్న సిరిసిల్లీ(Rajanna sircilla)జిల్లాలో లంచగొండి అధికారులతో విసిగిపోతున్న బాధిత మహిళలు చివరకు మంగళసూత్రాన్ని సైతం ఇస్తున్నారు. డబ్బుల కోసం కక్కూర్తి పడుతున్న అవినీతి అధికారులు తీరును సమాజానికి ఎత్తి చూపుతున్నారు బాధిత మహిళలు. జిల్లాలోని వేములవాడ(Vemulawada)నియోజకవర్గం లంచాలు, లంచగొండి యంత్రాగానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందనే విషయాన్ని పలు ఘటనలు స్పష్టంగా చూపిస్తున్నాయి. వేములవాడ నియోజకవ రంలో తమకు న్యాయం చేయాలంటూ బాధితురాళ్లు తమ మంగళ సూత్రాలను లంచంగా తీసుకోవాలని ఆందోళనకు దిగుతున్న తీరు ప్రభుత్వ యంత్రాంగం పనితీరుకు పరాకాష్టగా మారాయని చెప్పకతప్పదు . లంచం తీసుకోని తమ భూమిని వేరే వ్యక్తుల పేరుతో పట్టా ఇచ్చారంటూ రుద్రంగి తహశీల్దార్ కార్యాలయం ఎదుట మంగ అనే బాధితురాలు గతంలో ఆందోళనకు దిగింది. మండలంలోని మానాలలో 130/14 సర్వే నంబర్ లోని రెండెకరాల భూమి పట్టాదారుల పేర్లను రెవెన్యూ అధికారులు మార్చేశారు . దీంతో తన మెడలోని మంగళసూ త్రాన్ని తహసీల్దార్ కార్యాలయం గేటుకు కట్టింది మంగ అనే మహిళ. తన తాళి బొట్టును లంచంగా తీసుకోని అధికారులు న్యాయం చేయాలంటూ ఆఫీస్ ముందు బైఠాయించింది. ఆమె భర్త రాజేశం మృతి చెందడంతో ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమే వారికి జీవనాధారమైంది. మంగకు చెందిన భూమిని అధికారులు పట్టాదారులుగా మరొకరి పేరుతో మార్చి రికార్డుల్లోకి ఎక్కించడంతో చివరకు బాధితురాలు ఈవిధంగా న్యాయపోరాటానికి దిగింది. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తాళి బొట్టును కార్యాలయం గేటుకు కట్టి దానిని తీసుకోని న్యాయం చేయండి సారూ .. అంటు వేడుకుంది. ఇక్కడ మహిళ ఆవేదన ఇలా ఉంటే రుద్రంగి మండల కేంద్రంలో లంచావతారానికి ఓ ప్రాణం బలైపోయింది. నర్సయ్య , కిషన్ అనే అన్నదమ్ముల మధ్య భూ పంచాయితీ కొనసాగుతోంది. భూ తగాదాలతో కిషన్ ట్రాక్టర్‌తో నర్సయ్యను ఢీ కొట్టి హత్య చేశాడు. ప్రమాదంగా చిత్రీకరించాలని నిర్ణయించుకున్నాడని బాధిత కుటుంబం ఆరోపించింది. నర్సయ్య బ్రతికి ఉన్నప్పుడే న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నా పట్టించుకోకుండా కిషన్‌కే మద్దతిచ్చారనే విమర్శించారు. నర్సయ్యను హతమార్చిన కిషన్ పోలీసులకు లొంగిపోవడంతో అతడ్ని అప్పగించమని మృతదేహంతో స్టేషన్‌ ముందు భైటాయించారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలోనే నర్సయ్య భార్య దేవెంద్ర తన మెడలోని తాళిబొట్టు తీసి లంచంగా తీసుకోని తనకు న్యాయం చేయాలంటూ గుండెలవిసేలా రోధించింది. సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోనే అవినీతికి అలవాటు పడిన రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు సమస్యను బాధితులు మొదట్లోనే పరిష్కరించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. చివరికి ఈ పరిస్థితి ఎలా మారిపోయిందంటే లంచాలకు అలవాటు పడిన అధికారుల కారణంగా నిజాయితీగా పనిచేసే అధికారుల ప్రతిష్టను దిగజార్చే విధంగా తయారైంది.

 

ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోరిన శివసేన

మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ఎప్పటికీ ముగుస్తుందనే అంశంపై ఇంకా క్లారిటీ రావడం లేదు. పతనం అంచున ఉన్న మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు శివసేన(Shiv Sena) ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా.. అందులోని 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని మహారాష్ట్ర(Maharashtra) అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌కి శివసేన అప్పీల్ దాఖలు చేస్తోందని మహారాష్ట్ర ప్రభుత్వ లీగల్ టీమ్ వర్గాలు తెలిపాయి. గౌహతిలో క్యాంప్ చేస్తున్న తిరుగుబాటుదారుల సంఖ్య 40కి పైగా ఉంది. జాబితాలో ఏక్నాథ్ షిండే, తానాజీ ఉన్నారు. సావంత్, మహేష్ షిండే, అబ్దుల్ సత్తార్, సందీపన్‌రావ్ బుమ్రే, భరత్‌షేత్ గోగావాలే, సంజయ్ శిర్సత్, యామిని జాదవ్, లతా చంద్రకాంత్, అనిల్ బాబర్, ప్రకాష్ సర్వే, బాలాజీ కినికర్ వంటి వాళ్లు ఉన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో పడిపోకుండా అసెంబ్లీలో సేనను చీల్చేందుకు ఏక్నాథ్ షిండే (Eknath Shinde)ఇప్పటికే కీలక సంఖ్య 37కి చేరుకున్నారు. తిరుగుబాటు శిబిరంలోని 17 మంది ఎమ్మెల్యేలు తిరిగి మళ్లీ బరిలోకి దిగే అవకాశం ఉందని మహా వికాస్ అఘాడీ గతంలో ప్రకటించింది. మహా వికాస్ ఆఘాడీ కూటమి ప్రభుత్వం దాఖలు చేయాలనుకుంటున్న దరఖాస్తు తిరుగుబాటుదారులకు నిరోధకంగా పనిచేస్తుందని ఆ కూటమి పార్టీలు భావిస్తున్నారు. షిండే క్యాంపు నుండి వచ్చిన ఏదైనా ఇతర దరఖాస్తును డిప్యూటీ స్పీకర్ పరిష్కరించే ముందు ముఖ్యమంత్రి నుండి అనర్హత దరఖాస్తును ముందుగా నిర్ణయించాల్సి ఉంటుంది. మరోవైపు మహారాష్ట్రలో ఎవరికి బలం ఉందని ఫ్లోర్ టెస్ట్ నిర్ణయిస్తుందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలను గుజరాత్‌కు, ఆపై అస్సాంకు ఎలా తీసుకెళ్లారో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. వారికి సహాయం చేస్తున్న వారందరి పేర్లను మనం తీసుకోవలసిన అవసరం లేదని.... అస్సాం ప్రభుత్వం వారికి సహాయం చేస్తోందని అన్నారు. ఎన్సీపీ-కాంగ్రెస్‌తో శివసేన పొత్తును వ్యతిరేకిస్తున్న ఏక్‌నాథ్ షిండే.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది. ఐతే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాత్రం.. ఏక్‌నాథ్ షిండేకు సీఎం పగ్గాలు అప్పగిద్దామని ఉద్ధవ్ థాక్రేకు సూచించినట్లు తెలుస్తోంది. కానీ ఏక్‌నాథ్ షిండే ఒప్పుకునే ప్రసక్తే లేదని సమాచారం. ఎందుకంటే.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో శివసేన పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆయన... మళ్లీ వాళ్లతో ఎందుకు కలుస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శివసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. కానీ గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.

  

బిజెపి కన్నా కాంగ్రెసు నుంచే టి ఆర్ ఎస్ కి ప్రమాదం

తెలంగాణ‌లో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్ర‌భుత్వ‌ ప‌నితీరుపై ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వే నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అందులోని వివ‌రాల ప్ర‌కారం.. ఇప్ప‌టిక‌ప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ గెలుపు ఖాయ‌మ‌ని సర్వే స్ప‌ష్టం చేసింది. ఇతరులపై ఆధారప‌డాల్సిన అవ‌స‌రం లేకుండా సొంత మెజార్టీతోనే మ‌ళ్లీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంద‌ని ప్ర‌శాంత్ కిషోర్ త‌న నివేదిక‌లో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ద్వితీయ స్థానంలో ఉంటుంద‌ని, ఆ పార్టీ నుంచి టీఆర్ ఎస్‌కు గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని వెల్ల‌డించారు. అయితే కొద్దిరోజులుగా రాష్ట్రంలో హ‌డావిడి చేస్తున్న భార‌తీయ జ‌న‌తాపార్టీ మాత్రం ఈ రెండు పార్టీల‌కు చాలా దూరంలో ఉన్న‌ట్లు వివ‌రించారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ ప్ర‌త్య‌ర్థుల‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వ‌లేద‌ని స్థితిలో ఉంద‌ని త‌న నివేదిక‌లో పేర్కొన్నారు

తెలంగాణ రాష్ట్ర స‌మితిలో కొన్ని సంవ‌త్స‌రాలుగా ఉన్న సీనియ‌ర్ నేత‌లు, ఎమ్మెల్యేల ప‌నితీరుపై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉంద‌ని, వారిని మార్చాల్సిందేన‌ని స‌ర్వే స్ప‌ష్టం చేసింది. కొత్త‌గా పింఛ‌న్లు, రేష‌న్ కార్డులు మంజూరు చేస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్ విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌క‌లా ఉంటుంద‌న్నారు. అన్ని చోట్ల సాధార‌ణంగానే అసంతృప్తి క‌నిపిస్తోంద‌ని, పార్టీవ‌ర్గాలు కృషిచేస్తే ఈ అసంతృప్తిని త‌గ్గించుకోవ‌చ్చ‌న్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌భుత్వం కూడా పింఛ‌న్లు, రేష‌న్ కార్డులు మంజూరు చేసే యోచ‌న‌లో ఉంది. కొన్నాళ్లుగా టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం వీటిని మంజూరు చేయ‌డంలేదు. ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వే ప్ర‌కారం ఏయే నియోజ‌క‌వ‌ర్గంలో అసంతృప్తి ఉంది? ఎక్క‌డెక్క‌డ లోపాలున్నాయో మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుసుకొని వాటిని స‌వ‌రించుకోవాల్సిందేన‌ని, లేదంటే సీటు ఇవ్వ‌డం క‌ష్ట‌మేన‌ని తేల్చిచెప్పిన‌ట్లు తెలుస్తోంది.


 

నర్సింగ్ స్టూడెంట్ మిస్సింగ్ …. హైకోర్టు న్యాయవాది ఇంట్లో ఎన్ఐఏ సోదాలు

 

 

 

తెలంగాణ హైకోర్టు లాయర్ శిల్ప ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ ఉప్పల్‌ ప్రాంతం చిలుకానగర్‌‌లోని ఆమె నివాసంలో ఎన్ఐఏ అధికారులు గురువారం ఉదయం సోదాలు చేశారు. ఇటు మరో అడ్వొకేట్ దేవేంద్రతో పాటుగా చేగుంటకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఇంటిలోనూ సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే సోదాలు ముగియగానే అడ్వొకేట్ శిల్పను అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు.. గచ్చిబౌలి కార్యాలయానికి తరలించినట్లు తెలిసింది.

ఏపీలోని విశాఖపట్నంలో మూడేళ్లుగా కనిపించకుండా పోయిన రాధ అనే నర్సింగ్ విద్యార్థిని మావోయిస్టుల్లో చేర్చారంటూ శిల్పతో పాటు దేవేంద్ర, మరో సామాజిక కార్యకర్తపై అభియోగాలున్నాయి. విశాఖపట్నంలో మిస్సింగ్‌ కేసుగా నమోదైన ఈ కేసును తాజాగా ఎన్‌ఐఏకు అప్పగించారు. విశాఖ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఎన్‌ఐఏ అధికారులు శిల్ప, తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తమ కూతురు రాధను కిడ్నాప్ చేశారని గతంలో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టు అనుబంధ సంస్థ సీఎంఎస్ నాయకులు శిల్ప, దేవేంద్ర తదితరులు రాధను కిడ్నాప్ చేసి బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చారని రాధ తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్ప, తదితరులు తమ నివాసానికి వచ్చేవారని ఫిర్యాదులో వివరించారు. వైద్యం పేరుతో రాధను దేవేంద్ర తీసుకెళ్లినట్లు.. ఆ తర్వాత తన కూతురు ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

ఉసరవెల్లే కాదు కప్ప కూడా రంగు మార్చ గలదు

 

మాట మార్చే వ్యక్తులను ఊసరవెల్లి అంటారు. ఎందుకంటే అది ఏ ప్రదేశంలో ఉంటే ఆ రంగులో తన శరీర వర్ణం మార్చేసుకుంటుంది. ఇది ఒక్క ఊసరవెల్లికి మాత్రమే సాధ్యం అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ(Telangana)లో చాలా ప్రాంతాల్లో కప్పలు కూడా ఊసరవెల్లిలా రంగులు మార్చేశాయి. మనుషులు స్వార్ధం కోసం మాట మార్చుతారు. ఉసరవెల్లి రక్షణ కోసం రంగులు మారుస్తుంది. మరి కప్పలు(Frogs) ఎందుకు రంగు మారుతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమవడం.. తొలకరి చినుకులు కురవడంతో వాతావరణం కాస్త కొత్తగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పటి వరకు కనిపించని కప్పలు ఒక్కసారిగా చెరువులు, నీటి కుంటల్లో విచిత్రమైన శబ్ధం చేస్తూ కనిపిస్తాయి. నిజామాబాద్ జిల్లా భీంగల్‌ మండలం బడా భీంగల్‌ గ్రామంలో కురిసిన వర్షానికి పసుపు పచ్చని రంగులో ఉన్న కప్పలు (frogs)నూతన గ్రామపంచాయితీ కార్యాలయం ముందున్న నీటి కుంటలో దర్శనమిచ్చాయి. పసుపు పచ్చని రంగులో బెక బెక శబ్ధం చేస్తూ వందల సంఖ్యలో వచ్చిన కప్పలను నీళ్లలో చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆసక్తిగా తిలకించారు. కొందరైతే సెల్‌ఫోన్లలో వీడియో తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోనే కాదు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో కూడా ఇదే తరహాలో రంగులు మార్చిన కప్పలు నీటి కుంటలో ప్రత్యక్షమయ్యాయి. హైదరాబాద్ , సనత్ నగర్ లో ని కంజర్ల యాదవ్ పార్కు నందు ఉన్న కొలనులో కూడా ఉన్నాయి,  మన తెలంగాణలో పసుపు పచ్చ రంగులో కనిపిస్తున్న ఈ కప్పులు ఎందుకిలా రంగును మార్చుకున్నాయంటే ...వర్షకాలం వచ్చింది కాబట్టి సంభోగం కోసం లింగభేదం కలిగిన కప్పను ఆకర్షించడానికే ఈవిధంగా పసుపు పచ్చగా రంగును మార్చుకొని..శబ్ధం చేస్తాయని జంతుశాస్త్ర అధ్యాపకులు చెబుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్న పసుపు పచ్చని కప్పలు పోలినట్లుగా ఉండే టెర్రిబిల్లిస్ కప్పలు ఎక్కువగా కొలంబియా అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని గోల్డెన్‌ ఫాయిజన్ ఫ్రాగ్స్ అంటారు. మన దేశంలో కనిపించే కప్పలను బుల్ ఫ్రాగ్స్ అని పిలుస్తారు. అయితే వీటి వల్ల ఎవరికి ఎలాంటి నష్టం ఉండదని కేవలం లైంగిక కలయిక కోసమే కప్పలు ఈవిధంగా రంగుమార్చుకుంటాయని జంతుశాస్త్రంలో ఉంది. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం నీటి కుంటల్లో కనిపిస్తున్న పసుపు రంగు కప్పలు కూడా సంభోగం(లింగభేదం) కలిగిన ఆడ, మగ కప్పలు రెండు శారీరకంగా కలిసేందుకే రంగులు మార్చుకుంటున్నట్లు దృశ్యాలు చూస్తే అర్ధమవుతోంది. ఇది కొత్త విషయం కాకపోయినప్పటికి వందలాది కప్పలు ఇలా ఊరి మధ్యలో ఉన్న చెరువు కుంటలో చేరి శబ్ధం చేయడాన్ని స్థానికులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

 

మిషన్ భగీరథ-- వాటర్​ బోర్డు కు ఉన్న బాకీ అక్షరాలా 601.32 కోట్లు!!!  

 

ప్రభుత్వ తాగునీటి పథకం మిషన్ భగీరథ.. వాటర్​ బోర్డు (Water Board)కు ఎంత చెల్లించాలో తెలిస్తే షాక్ అవుతారు.  తెలంగాణ (Telangana) ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్ట‌త్మంగా తీసుకొచ్చిన ప్రభుత్వ తాగునీటి పథకం మిషన్ భగీరథ హైదరాబాద్ మెట్రో నీటి సరఫరా మురుగునీటి బోర్డు (HMWSSB)కి 601.32 కోట్లు  బ‌కాయిలు చెల్లించాల్సి ఉంది.  ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన RTI లో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. మిష‌న్ భ‌గీర‌థకు బకాయిలతో ఇప్పుడు వాట‌ర్ బోర్దు లిస్ట్ లో మొద‌టి ప్లేస్ లో ఉంది. ఇదిలా ఉంటే ప్ర‌భుత్వంలో ఇత‌ర విభాగాలైన‌ రెవెన్యూ శాఖ వివిధ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ శాఖలు మరియు ఏజెన్సీల నుండి 1,519 కోట్లు బకాయిలు వాట‌ర్ బోర్డు కు పెండింగ్ ఉన్నాయి. ఇందులో 1,267 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సి ఉండగాకేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి 252 కోట్లుకేంద్ర ప్రభుత్వ సంస్థలు  233.69 కోట్లుప్రభుత్వ రంగ యూనిట్లు 18.15 కోట్లు , హైద‌రాబాద్ వాట‌ర్ బోర్డు కు రావాల్సి ఉంది.  అయితే బ‌కాయిలు చెల్లింపుకు సంబంధించి తాము నిత్యం లేఖ‌లు రాస్తూనే ఉన్నామ‌ని అయిన‌ప్ప‌ట‌టికి సంబంధిత డిపార్ట్మెంట్స్ నుంచి ఎటువంటి స్పంద‌న లేద‌ని అంటున్నారు వాట‌ర్ బోర్డు అధికారులు. ఈ బ‌కాయిల్లో శాఖ‌ల‌వారీగా చూస్తే పంచాయతీరాజ్గ్రామీణాభివృద్ధి శాఖ 539.63 కోట్లుఆరోగ్యవైద్యకుటుంబసంక్షేమ శాఖకు 41.70 కోట్లుపురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ 18.13 కోట్లుగృహనిర్మాణ శాఖ 22.33 కోట్లుహోం శాఖ‌ 14.56 కోట్లుసాధారణ పరిపాలన శాఖ 9.40 కోట్లురవాణారోడ్లుభవనాల శాఖలు 7.11 కోట్లు వాట‌ర్ బోర్డుకు బ‌కాయిలు ఉన్నాయి. RTI ప్రకారం నివేధిక ప్ర‌కారం.. బకాయిలను క్లియర్ చేయమని ప్రభుత్వ శాఖలకు గుర్తు చేస్తూ చివరిసారిగా 17 జూన్ 2021న నోటీసులు వాట‌ర్ బోర్డు అధికారులు పంపించిన‌ట్లు తెలుస్తోంది. "మేం అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రతి నెలా బిల్లును జారీ చేస్తాము. అయితే ఈ బిల్లుల‌ను కొన్ని సంద‌ర్భ‌ల్లో ప్రభుత్వ శాఖలు  ఒకేసారి చెల్లిస్తాయి . కొన్నిసార్లు 3-4 నెలలకు ఒకసారి. కాని గ‌త కొద్ది రోజులుగా ఎన్ని సార్లు ఎన్ని లేఖ‌లు రాసిన‌ప్ప‌టికి బిల్లులు చెల్లింపుకు సంబంధించి స‌రైన స్పంద‌న రావ‌డం లేద‌ని పేరు చెప్ప‌డానికి నిరాక‌రించిన ఒక HMWSSB అధికారి న్యూస్18 కి తెలిపారు. GHMC చట్టంలోని సెక్షన్ 199 ప్రకారంఆస్తి పన్నులో నీటి పన్నుడ్రైనేజీ పన్నులైటింగ్ పన్నుపరిరక్షణ పన్ను మొదలైనవి ఉంటాయి.

ఒక పౌరుడు GHMCకి ఆస్తి పన్ను (ఇంటి పన్ను) చెల్లించినప్పుడుఅతను నీరు మరియు పారుదల పన్ను కూడా చెల్లించిన‌ట్లు అందులో ఉంటుంది. . మళ్ళీనీటి బోర్డు విడిగా నీరునీటి పారుదల పన్నును వసూలు చేస్తుంది. అయితే సామాన్యుడు ఒక నెల పెండింగ్ పెడితేనే వ‌చ్చిన క‌నెక్ష‌న్ క‌ట్ చేసే అధికారులు ప్ర‌భుత్వ సంస్థ‌లు కొట్ల రూపాయిలు పెండింగ్ పెట్టినా చూసి చూడ‌న‌ట్లు వ‌దిలేస్తున్నారనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇలాగే కొనసాగితే కొద్ది రోజ‌ల్లో వాట‌ర్ బోర్డు న‌ష్టాల్లోకి వెళ్ల‌డం ఖాయం అనే వాదన‌లు వినిపిస్తున్నాయి

 

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...