Thursday 23 June 2022

  

బిజెపి కన్నా కాంగ్రెసు నుంచే టి ఆర్ ఎస్ కి ప్రమాదం

తెలంగాణ‌లో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితి ప్ర‌భుత్వ‌ ప‌నితీరుపై ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వే నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అందులోని వివ‌రాల ప్ర‌కారం.. ఇప్ప‌టిక‌ప్పుడు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ గెలుపు ఖాయ‌మ‌ని సర్వే స్ప‌ష్టం చేసింది. ఇతరులపై ఆధారప‌డాల్సిన అవ‌స‌రం లేకుండా సొంత మెజార్టీతోనే మ‌ళ్లీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తుంద‌ని ప్ర‌శాంత్ కిషోర్ త‌న నివేదిక‌లో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ద్వితీయ స్థానంలో ఉంటుంద‌ని, ఆ పార్టీ నుంచి టీఆర్ ఎస్‌కు గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని వెల్ల‌డించారు. అయితే కొద్దిరోజులుగా రాష్ట్రంలో హ‌డావిడి చేస్తున్న భార‌తీయ జ‌న‌తాపార్టీ మాత్రం ఈ రెండు పార్టీల‌కు చాలా దూరంలో ఉన్న‌ట్లు వివ‌రించారు. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో బీజేపీ ప్ర‌త్య‌ర్థుల‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వ‌లేద‌ని స్థితిలో ఉంద‌ని త‌న నివేదిక‌లో పేర్కొన్నారు

తెలంగాణ రాష్ట్ర స‌మితిలో కొన్ని సంవ‌త్స‌రాలుగా ఉన్న సీనియ‌ర్ నేత‌లు, ఎమ్మెల్యేల ప‌నితీరుపై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉంద‌ని, వారిని మార్చాల్సిందేన‌ని స‌ర్వే స్ప‌ష్టం చేసింది. కొత్త‌గా పింఛ‌న్లు, రేష‌న్ కార్డులు మంజూరు చేస్తే రాష్ట్రంలో టీఆర్ఎస్ విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌క‌లా ఉంటుంద‌న్నారు. అన్ని చోట్ల సాధార‌ణంగానే అసంతృప్తి క‌నిపిస్తోంద‌ని, పార్టీవ‌ర్గాలు కృషిచేస్తే ఈ అసంతృప్తిని త‌గ్గించుకోవ‌చ్చ‌న్నారు. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌భుత్వం కూడా పింఛ‌న్లు, రేష‌న్ కార్డులు మంజూరు చేసే యోచ‌న‌లో ఉంది. కొన్నాళ్లుగా టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం వీటిని మంజూరు చేయ‌డంలేదు. ప్ర‌శాంత్ కిషోర్ స‌ర్వే ప్ర‌కారం ఏయే నియోజ‌క‌వ‌ర్గంలో అసంతృప్తి ఉంది? ఎక్క‌డెక్క‌డ లోపాలున్నాయో మంత్రులు, ఎమ్మెల్యేలు తెలుసుకొని వాటిని స‌వ‌రించుకోవాల్సిందేన‌ని, లేదంటే సీటు ఇవ్వ‌డం క‌ష్ట‌మేన‌ని తేల్చిచెప్పిన‌ట్లు తెలుస్తోంది.


No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...