Thursday 23 June 2022

 

ఉసరవెల్లే కాదు కప్ప కూడా రంగు మార్చ గలదు

 

మాట మార్చే వ్యక్తులను ఊసరవెల్లి అంటారు. ఎందుకంటే అది ఏ ప్రదేశంలో ఉంటే ఆ రంగులో తన శరీర వర్ణం మార్చేసుకుంటుంది. ఇది ఒక్క ఊసరవెల్లికి మాత్రమే సాధ్యం అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ(Telangana)లో చాలా ప్రాంతాల్లో కప్పలు కూడా ఊసరవెల్లిలా రంగులు మార్చేశాయి. మనుషులు స్వార్ధం కోసం మాట మార్చుతారు. ఉసరవెల్లి రక్షణ కోసం రంగులు మారుస్తుంది. మరి కప్పలు(Frogs) ఎందుకు రంగు మారుతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమవడం.. తొలకరి చినుకులు కురవడంతో వాతావరణం కాస్త కొత్తగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇప్పటి వరకు కనిపించని కప్పలు ఒక్కసారిగా చెరువులు, నీటి కుంటల్లో విచిత్రమైన శబ్ధం చేస్తూ కనిపిస్తాయి. నిజామాబాద్ జిల్లా భీంగల్‌ మండలం బడా భీంగల్‌ గ్రామంలో కురిసిన వర్షానికి పసుపు పచ్చని రంగులో ఉన్న కప్పలు (frogs)నూతన గ్రామపంచాయితీ కార్యాలయం ముందున్న నీటి కుంటలో దర్శనమిచ్చాయి. పసుపు పచ్చని రంగులో బెక బెక శబ్ధం చేస్తూ వందల సంఖ్యలో వచ్చిన కప్పలను నీళ్లలో చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆసక్తిగా తిలకించారు. కొందరైతే సెల్‌ఫోన్లలో వీడియో తీసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోనే కాదు మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో కూడా ఇదే తరహాలో రంగులు మార్చిన కప్పలు నీటి కుంటలో ప్రత్యక్షమయ్యాయి. హైదరాబాద్ , సనత్ నగర్ లో ని కంజర్ల యాదవ్ పార్కు నందు ఉన్న కొలనులో కూడా ఉన్నాయి,  మన తెలంగాణలో పసుపు పచ్చ రంగులో కనిపిస్తున్న ఈ కప్పులు ఎందుకిలా రంగును మార్చుకున్నాయంటే ...వర్షకాలం వచ్చింది కాబట్టి సంభోగం కోసం లింగభేదం కలిగిన కప్పను ఆకర్షించడానికే ఈవిధంగా పసుపు పచ్చగా రంగును మార్చుకొని..శబ్ధం చేస్తాయని జంతుశాస్త్ర అధ్యాపకులు చెబుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్న పసుపు పచ్చని కప్పలు పోలినట్లుగా ఉండే టెర్రిబిల్లిస్ కప్పలు ఎక్కువగా కొలంబియా అడవుల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వాటిని గోల్డెన్‌ ఫాయిజన్ ఫ్రాగ్స్ అంటారు. మన దేశంలో కనిపించే కప్పలను బుల్ ఫ్రాగ్స్ అని పిలుస్తారు. అయితే వీటి వల్ల ఎవరికి ఎలాంటి నష్టం ఉండదని కేవలం లైంగిక కలయిక కోసమే కప్పలు ఈవిధంగా రంగుమార్చుకుంటాయని జంతుశాస్త్రంలో ఉంది. నిజామాబాద్ జిల్లాలో ప్రస్తుతం నీటి కుంటల్లో కనిపిస్తున్న పసుపు రంగు కప్పలు కూడా సంభోగం(లింగభేదం) కలిగిన ఆడ, మగ కప్పలు రెండు శారీరకంగా కలిసేందుకే రంగులు మార్చుకుంటున్నట్లు దృశ్యాలు చూస్తే అర్ధమవుతోంది. ఇది కొత్త విషయం కాకపోయినప్పటికి వందలాది కప్పలు ఇలా ఊరి మధ్యలో ఉన్న చెరువు కుంటలో చేరి శబ్ధం చేయడాన్ని స్థానికులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...