Monday 3 October 2022

 

ముదురుతున్న మునుగోడు రాజకీయం

 


రాజ‌కీయం తెలంగాణ కేంద్రంగా ప‌రిభ్ర‌మిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక‌, టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ (భార‌తీయ రాష్ట్ర స‌మితి) అనే జాతీయ పార్టీ ఆవిర్భావం త‌దిత‌ర కీల‌క ఘ‌ట్టాల‌న్నీ ఆ రాష్ట్రంలోనే చోటు చేసుకుంటున్నాయి. ఈ నెల 5న ద‌స‌రా ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీని ప్ర‌క‌టించ‌నున్నారు. ఇందుకు చ‌క‌చ‌కా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.

ఇదే సంద‌ర్భంలో మునుగోడు ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ వ‌చ్చింది. దీంతో రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్క‌నుంది. మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ రావ‌డంతో టీబీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పాద‌యాత్ర‌ను వాయిదా వేసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నిక‌ను టీఆర్ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. అయితే పోటీ మాత్రం టీఆర్ఎస్‌, బీజేపీ మ‌ధ్య భీక‌రంగా వుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వ‌చ్చే ఏడాదిలో తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. బ‌హుశా తెలంగాణ‌లో ఇదే చివ‌రి ఉప ఎన్నిక కావ‌చ్చు. ఈ ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయ ముఖ చిత్రాన్ని మార్చేదిగా ఆ రాష్ట్రంలోని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. తెలంగాణ‌లో ఎలాగైనా అధికారాన్ని ద‌క్కించుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో బీజేపీ వుంది. అందుకే ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని, ఆయ‌న‌తో రాజీనామా చేయించి, వ్యూహాత్మ‌కంగా ఉప ఎన్నిక వ‌చ్చేలా బీజేపీ చేసింది.

దుబ్బాక‌, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో గెలుపును స్ఫూర్తిగా తీసుకుని మునుగోడులో టీఆర్ఎస్‌ను మ‌ట్టి క‌రిపించాల‌ని బీజేపీ త‌హ‌త‌హ‌లాడుతోంది. మునుగోడులో విజ‌యం సాధించి తెలంగాణ‌లో అధికారం త‌మ‌దే అనే సంకేతాల్ని ఇవ్వాల‌ని బీజేపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. మ‌రోవైపు టీఆర్ఎస్ గెలిచి త‌న ప‌ట్టు నిలుపుకోవాల‌ని చూస్తోంది. అందుకే ఈ ఉప ఎన్నిక అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మ‌ని చెప్ప‌డం.

కేసీఆర్ జాతీయ పార్టీ క‌ల‌లు కంటున్న త‌రుణంలో ఆదిలోనే దెబ్బ కొట్టాల‌ని బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక‌ను సీరియ‌స్‌గా తీసుకుంటోంది. మునుగోడు ఉప ఎన్నిక‌, కేసీఆర్ జాతీయ పార్టీ చుట్టూ తెలంగాణ రాజ‌కీయాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూడా ఆస‌క్తిగా చూస్తోంది. 

 

16 comments:

  1. మునుగుడు ఉపఎన్నికలో కాంగ్రెస్ ఓ అడుగు ముందుకేసింది. తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతికి టికెట్ కేటాయించి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రచారంలో పాల్గొంటారా అనేది సస్పెన్స్ గా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండ బ్రాండ్. కానీ ఇప్పుడు ఇద్దరు వేరు వేరు పార్టీలలో ఉండడంతో కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. కాగా మునుగోడు గెలుపుపై కాంగ్రెస్ గంపెడు ఆశలు పెట్టుకుంది.

    ReplyDelete
  2. అయితే కూసుకుంట్ల ప్రభాకర్ గులాబీ పార్టీ తరపున పోటీ చేయనున్నట్టు సమాచారం. కానీ దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. దసరా లోపే తమ అభ్యర్థిని ప్రకటించాలని గులాబీ బాస్ కేసీఆర్ యోచిస్తున్నారట.

    ReplyDelete
  3. ల్గొండ కాంగ్రెస్ కు కంచుకోట. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ చేరికతో బీజేపీ కూడా విజయంపై ఆశావహంతో ఉన్నారు. మరోవైపు కేసీఆర్ ఎలాంటి స్టెప్ తీసుకొని రేసులో ముందుకెళ్తారో చూడాలి మరి.

    ReplyDelete
  4. మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ ఎఫెక్ట్ తో సమీకరణాలు మారిపోతున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర రద్దయింది. బైపోల్ షెడ్యూల్ ను ఈసీ ప్రకటించిన నేపథ్యంలో బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రతో సహా పలు కార్యక్రమాలు రద్దు చేసుకున్నట్టు తెలుస్తుంది. కాగా బీజేపీ మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గెలిచి తెలంగాణలోనూ అధికారంలోకి రావాలనేది బీజేపీ వ్యూహం. కాగా ఇప్పటికే బీజేపీ తరపున ఉపఎన్నిక బరిలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గతంలో కాంగ్రెస్ లో ఉన్న రాజగోపాల్ ఇటీవల బీజేపీలో చేరారు. కానీ కార్యకర్తలు ఆయన వెంట నడుస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది

    ReplyDelete
  5. కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు.మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే టీఆర్ఎస్ టికెట్ కేటాయించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

    ReplyDelete
  6. గులాబీకి అగ్ని పరీక్ష.!ఈడి నుండి బయటపడాలంటే బీజేపీతో లోపాయకార ఒప్పందం.?కేసీఆర్ మును'గోడు'

    ReplyDelete
  7. బీజేపి, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్ధులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తుంటే అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం మునుగోడు నియోజకవర్గంలో బహిరంగసభను నిర్వహించింది కానీ అభ్యర్ధిని మాత్రం ప్రకటించలేదు. దీని వెనక కేంద్ర బీజేపి ప్రభుత్వ స్కెచ్ ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది

    ReplyDelete
  8. ఈ ఉప ఎన్నికపట్ల టీఆర్ఎస్ పార్టీ మొదటినుండీ అసహనంగానే వ్యవహరింస్తోంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మునుగోడు ఉప ఎన్నిక గురించి గానీ, మునుగోడు అభ్యర్ధి గురించి గానీ అంటీ ముట్టనట్టు వ్యవహరించడం కూడా ఆపార్టీ నేతలకు, మునుగోడులో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులకు మింగుడుపడని అంశంగా పరిణమించింది.

    ReplyDelete
  9. బీజేపికి పరోక్ష మద్దత్తు.. ఈడీ నుంచి బయటపడాలంటే తప్పదంటున్న నేతలు

    ReplyDelete
  10. ఈడీ దాడులను నిలువరించాలన్నా, విచారణను ఎదుర్కొంటున్న నాయకులకు తర్వాత చర్యలను నివారించాలన్నా మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ బీజేపికి లోపాయకార మద్దత్తు ఇచ్చి, పరోక్షంగా బీజేపి గెలుపు సహకరించి తద్వారా ఈడి ముప్పునుంచి బయటపడాలన్నది టీఆర్ఎస్ వ్యూహంగా చర్చ జరుగుతోంది. సీఎం చంద్రశేఖర్ రావు వ్యూహాత్కక నిశ్శబ్దానికి కారణం ఇదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

    ReplyDelete
  11. జాతీయస్థాయిలో ఎలా తన కొత్త జాతీయపార్టీ నెగ్గుకొస్తుందీ అన్నది కాక ఆంధ్రాలో కూడా తనదే పెత్తనం కావాలని దానికోసం ఇది మంచి దారి అని కేసీఆర్ ఉద్దేశం‌ కావచ్చు అని నా అనుమానం. ఎంత ఎగిరినా ప్రధానికుర్చీ తనకు అందదని కేసీఆర్ గారికి బాగానే తెలుసు. ఆంధ్రాలో కూడా పెత్తనం తన చేతికి వస్తే ఓహో ఇంక చెప్పేది ఏముందీ? ఐనా ఆంధ్రాజనం "రండి దోచుకోండి మీదే ఆలస్యం" అనే రకం అని ఇప్పటికే ఆయనకు బాగా అవగాహన ఐనది కాబట్టి ఈహడావుడి అంతా అనుకుంటాను.

    ReplyDelete
    Replies
    1. దోచుకునే పార్టీలని ఆంధ్రా ప్రజలు జీవితంలో లేవకుండా బొందబెడతారని క్రితం ఎన్నికల్లో ప్రూవ్ అయ్యింది. కాబట్టి కేసీఆర్ ఇక్కడ ఆ యాంగిల్లో కంటెస్ట్ చేసే ధైర్యం చెయ్యలేడు.

      Delete
    2. ఇక తన స్వార్ధంకోసం చెంద్రబాబు సిగ్గూ లజ్జ వోదిలేసి ఏస్థాయికైనా దిగజారతాడని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. కాబట్టి చెంద్రాబాబుతో పొత్తుకు కేసీఆర్ పోవొచ్చు.

      Delete
  12. పార్టీ పేరు మార్చగానే జాతీయ స్థాయి నాయకుడు అయిపోతాడా కేసీయార్ - ఎలాగెలాగ?

    దశాబ్దాల క్రితం నుంచే ఎక్కడ ఎన్నిక పెడితే అక్కడ ముస్లిం కార్డుతో పోటీ చేస్తున్న ఒవైసీ పార్టీకే జాతీయ స్థాయిలో దిక్కూ దివాణం లేదు,ఇప్పుడే కళ్ళు తెరిచిన బుడ్డోడు అప్పుదే ప్రొఫెసర్ అయిపోతాడన్నట్టు ఇక్కడి మేధావులు ఇస్తున్న బిల్దప్ చూస్తుంటే నవ్వొస్తుంది నాకు.

    ఆంధ్రావాళ్ళని తిట్టి ఇంత వరకు లాక్కొచ్చాడు.అది కాస్త పాతబడిపోయేసరికి కొత్త పాట కోసం చూస్తే "లేస్తే మనిషి గాను" అన్న లెక్కన జాతీయ స్థాయి కోతలు అనే అవిడియా దొరికింది.కానీ, తిట్టడం తప్ప ఇంకోటి తెలియని వాడు జాతీయ స్థాయిలో "ఆడెంత? ఈడెంత?నేనొస్త!ఐపాయె!" అని ఎవణ్ణి తిడతాడు?ఎవణ్ణి తిడితే ఎవడు వూర్కే ఉంటాడు?చంద్రబాబులా ఎన్ని తిట్టీనా పడుందేవాళ్ళు తక్కువ - నార్తులో బీహారీల్ని కెలికితే ముక్కల కింద నరికి వెనక్కి పంపిస్తారు.

    జై శ్రీ రాం!

    ReplyDelete
  13. ప్రస్తుతం తమని నిలువునా దోపిడీచేస్తున్న పార్టీనే ఆంధ్రాజనం పేరాశతో ఎన్నుకున్నారు.

    ReplyDelete
    Replies
    1. ప్రస్తుత చెంబాబు తేదేపానే ఎన్‌టీఆర్ నుంచీ దోచుకుంది. దానిపుట్టుకే దోపిడీ. ఎంలేలనుకూడా అవతలిపక్షాన్ని దోపిడీచేసే సంపాదించుకున్నారు. ప్రపంచ చరిత్రలో అవతలపార్టీవాడికి.. పార్టీ మారాల్సిన ప్రసక్తేలేకుండా.. మంత్రిపదవులివ్వగలిగిన నీచపు తెలివితేటలు అత్యంత దోపిడీదారుకు తప్పితే ఎవరికీ రావు.

      Delete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...