Friday 1 July 2022

 

 

రైల్వే స్టేషన్లలో కొత్త రూల్స్..

 

మీరు ట్రైన్ జర్నీ ఎక్కువగా చేస్తుంటారా? అయితే మీకు శుభవార్త. రైల్వే స్టేషన్లలో వచ్చే నెల నుంచి కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉండనున్నాయి. ప్రతి స్టాల్‌లోనూ క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్ ఫెసిలిటీ అందుబాటులో ఉండాల్సిందే. లేదంటే మాత్రం రైల్వేస్ వారికి భారీ మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉంటుంది. దీని వల్ల రైల్వే ప్రయాణికులకు ఊరట కలుగనుంది. వెండర్లు ఎంఆర్‌పీ రేట్లకు మించి వస్తువులను విక్రయించలేరు.

 

యాణికులకు మెరుగైన సేవలు అందించడానికి ఇండియన్ రైల్వేస్ ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. రైల్వే బోర్డు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే స్టేషన్లలో కేటరింగ్ క్యాష్‌లెస్ పేమెంట్లకు ఆమోదం తెలిపింది. అన్ని రైల్వే స్టేషన్లలోనూ ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 2022 ఆగస్ట్ 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి వస్తాయి. అంటే వెండర్లు రైల్వే స్టేషన్లలో డిజిటల్ పేమెంట్లను స్వీకరించనున్నారు. ఈ రూల్స్‌ను అతిక్రమిస్తే.. వారికి రూ. 10 వేల నుంచి రూ. లక్ష వరకు జరిమానా పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎంఆర్‌పీ రేటుకు మించి డబ్బులు తీసుకోకూడదు. ఎంఆర్‌పీ రూ. 15 ఉంటే.. గరిష్టంగా రూ. 15 మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోకూడదు. రైల్వే బోర్డు ఇప్పటికే ఈ అంశాలకు సంబంధించి అన్ని రైల్వే జోన్లకు, ఐఆర్‌సీటీసీ‌కి ఆదేశాలు జారీ చేసింది. వీటి ప్రకారం చూస్తే.. ప్లాట్‌ఫామ్‌పై కేటరింగ్ సహా అన్ని స్టాల్స్‌లో డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉండాలి. అలాగే ప్రయాణికులకు కంప్యూటరైజ్డ్ బిల్లు ఇవ్వాలి. డిజిటల్ పేమెంట్స్‌కు యూపీఐ, పేటీఎం, పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్, స్వైప్ మెషీన్స్ వంటివి కలిగి ఉండాలి. రైల్వే బోర్డు సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్లలోని అన్ని స్టాళ్లలో క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్లు నిర్వహించొచ్చు. డిజిటల్ పేమెంట్ సర్వీసులు అందుబాటులో లేకపోతే అప్పుడు రైల్వేస్ వెండర్లకు రూ. 10 వేల నుంచి రూ. లక్ష వరకు పెనాల్టీ వేసే అవకాశం ఉంటుంది. డిజిటల్ పేమెంట్ సిస్టమ్‌ను అందుబాటులోకి తీసుకురావడం వల్ల వెండర్లు ప్రయాణికులకు నుంచి ఎక్కువ మొత్తాన్ని తీసుకోవడం వీలు కాదు.

అంతేకాకుండా ట్రైన్ ప్యాసింజర్లు ఫుడ్ సరిగా లేకపోయినా, ఎక్స్‌పైరీ అయిన ఫుడ్ ప్యాకెట్స్ పొందినా ఫిర్యాదు చేయొచ్చు. డిజిటల్ పేమెంట్స్, బిల్లులు లేకపోవడం వల్ల ప్యాసింజర్లు ఫిర్యాదు చేయడం కష్టంగా ఉండేది. క్యాష్‌లెస్ పేమెంట్ల ద్వారా ప్రయాణికులు ఫ్రెష్ ఫుడ్‌ను సరైన ధరలో పొందడానికి వీలుంటుంది. అయితే ఈ విధానం ఎంత వరకు విజయవంతం అవుతుందో వేచి చూడాల్సి ఉంది.

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...