Wednesday 29 June 2022

 

జీఎస్‌టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు


చండీగఢ్‌లో జరిగిన 47వ జీఎస్‌టీ (GST) కౌన్సిల్‌ సమావేశం బుధవారం (wednesday) ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) వెల్లడించారు.

చండీగఢ్‌లో జరిగిన 47 జీఎస్‌టీ కౌన్సిల్‌ (GST Council) సమావేశం బుధవారం ముగిసింది. రెండు రోజుల పాటు జరిగిన కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Seetharaman) వెల్లడించారు. సమావేశం ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పన్ను (Tax) చెల్లింపుదారుల భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే గూడ్స్‌, సర్వీస్‌ టాక్స్‌(GST) కౌన్సిల్ ఆర్థిక సంవత్సరం 2021-22కు సంబంధించి GSTR-4 ఫారమ్‌ను దాఖలు చేయడంలో ఆలస్యమైతే విధించే రుసుమును మాఫీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంవత్సరం 2022-23కి సంబంధించి ఫారమ్ GST CMP-08ని దాఖలు చేయడానికి గడువును పొడిగించింది.

జీఎస్‌టీ కౌన్సిల్‌ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో.. జీఎస్‌టీ కౌన్సిల్ 47వ సమావేశం 2022 జూన్ 28, 29 తేదీల్లో చండీగఢ్‌లో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగింది. వస్తువులు, సేవల సరఫరాపై జీఎస్‌టీ రేట్లలో మార్పులు, జీఎస్‌టీ యాక్ట్‌, విధానానికి సంబంధించిన మార్పులకు సంబంధించి కౌన్సిల్ కొన్ని సిఫార్సులను చేసిందిఅని తెలిపింది.

జీఎస్‌టీ కౌన్సిల్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫారమ్ GSTR-4ని దాఖలు చేయడంలో జాప్యం చేసినందుకు సెక్షన్ 47 కింద ఆలస్య రుసుము మినహాయింపును దాదాపు నాలుగు వారాల పాటు, జూలై 28 వరకు పొడిగించింది. ప్రస్తుతం ఉన్న మినహాయింపు మే 1 నుంచి జూన్ 30 వరకు ఉంటుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఫారమ్ GST CMP-08 దాఖలు చేయడానికి గడువు తేదీని జూలై 18 నుంచి జూలై 31 వరకు పొడిగించాలని కౌన్సిల్ నిర్ణయించింది.

 

1 comment:

  1. 1000 కంటే తక్కువ ఉన్న హోటల్‌ గదులపై 12శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో హోటల్‌ రూమ్స్‌పై జీఎస్టీ లేదు.

    ♦రూ.5వేలు అంతకంటే ఎక్కువగా ఉన్న హాస్పిటల్‌ రూమ్స్‌లో ఉంటే వాటిపై 5శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంది. గతంలో హోటల్‌ రూమ్స్‌పై ఎలాంటి జీఎస్టీ లేదు. తాజాగా హాస్పిటల్‌ రూమ్స్‌ పై పన్ను వసూలు చేయడంపై సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    ♦ఎండు చిక్కుళ్లు, మకనా, గోధుమ పిండి, బెల్లం, ఉబ్బిన బియ్యం, సేంద్రీయ ఆహారం, కంపోస్ట్‌ ఎరువుపై 5 శాతం జీఎస్టీ

    ♦సోలార్‌ వాటర్‌ హీటర్‌,లెదర్‌ ప్రొడక్ట్‌లపై 5 శాతం నుంచి 12శాతం జీఎస్టీ పెంపు

    ♦ప్రింటింగ్‌, డ్రాయింగ్‌ ఇంక్‌, ఎల్‌ఈడీ బల్బులు, డ్రాయింగ్‌ చేసేందుకు ఉపయోగించే ఇన్స్ట్రుమెంట్(ఉదా: డ్రాఫ్టింగ్‌ బోర్డ్‌, డ్రాఫ్టింగ్‌ మెషిన్‌, రూలర్స్‌, టెంప్‌లెట్స్‌, కంపాస్‌) బ్రేడ్లు,స్పూన్లు, ఫోర్క్‌లపై విధించే పన్ను 12 శాతం నుంచి 18 శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది.

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...