పూర్వ
విద్యార్థుల ఆత్మీయ
కలయిక
స్నేహమంటే విలువైనది, అపురూపమైనది, అమర మైనది. కానీ ప్రతీ అంచుకు రెండు కోణాలు
ఉన్నట్లే , మంచి, చెడు అనే గుణాలకి స్నేహం కూడా ఏమీ అతీతం కాదు. మంచి స్నేహం ఎప్పుడూ నీడలా
వెన్నంటి ఉంటుంది..... ఆపదలో ఆసరా అవుతుంది...... సంతోషానికి సంబరం
అవుతుంది.....బాధకు భరోసా ఇస్తుంది..... ప్రతిభకు
గుర్తింపు ఇస్తుంది...... పిలవకపోయినా నేనున్నా అంటుంది. మంచి స్నేహానికి ఒక బలమైన, విచిత్రమైన, విపరీతమైన స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థం పేరు ఏంటంటే
" సంతోషం " . సంతోషాన్ని స్నేహితులతో పంచుకోవాలనే ఒక ఆరాటం....
అంతకుమించి స్వచ్ఛమైన మంచి స్నేహం లో ఏ రకమైన స్వార్థం ఉండదు.• మంచి స్నేహం... ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సందర్భంలోనైనా, సాటి స్నేహితుడి యొక్క ఉన్నత
తత్వాన్ని, అభ్యున్నతిని మాత్రమే కోరుకుంటుంది. అదేవిధంగా స్నేహితుడి యొక్క
నిమ్నతత్వాన్ని సరి చేయడానికి
ప్రయత్నిస్తుంది స్నేహానికి అర్థం చేసుకునే గుణం , సహాయపడే తత్వం భగవంతుడు సహజంగానే
ప్రసాదిస్తాడు . మంచి..... వేగంగా నడవలేదు, త్వరగా ఆకట్టుకోలేదు కానీ ఎప్పటికీ
స్థిరత్వమే దాని గమ్యం.
చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా, మన భావాలను, బాధలను స్నేహితులతో పంచుకోవడంలో ఆనందం వేరు
ReplyDeleteస్నేహమంటే ఒక ధైర్యం
ReplyDeleteస్నేహమంటే ఒక అవసరం
స్నేహమంటే ఒక భాద్యత
స్నేహమంటే ఒక భద్రత!
స్నేహాలనునాలుగురకాలుగా విభజించవచ్చు
ReplyDeleteబాల్య దశ స్నేహాలు , యవ్వనదశ స్నేహాలు
కుటుంబదశ స్నేహాలు , వృద్ధాప్యదశ స్నేహాలు
ఒక్కో దశలో మరెన్నో రకాల స్నేహాలు!
స్నేహమంటే కరగని కల
ReplyDeleteనేస్తమంటే విరగని అల
శూన్యమైన జీవితాన
విరిసే నవ్వుల వాన
తనువులు వేరైనా
తలపులు మారేనా
మతమేదైనా, కులమేదైనా
రాజైనా, పేదైనా