Thursday 30 June 2022

 

మణిపూర్‌లో కొండచరియలు విరిగిపడి భారీ ప్రమాదం..

మణిపూర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నోనీ జిల్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయని, కొత్తగా నిర్మిస్తున్న జిరిబామ్ - ఇంఫాల్ రైల్వే లైన్‌లో భాగమైన టుపుల్ స్టేషన్ భవనానికి నష్టం వాటిల్లిందని ఎన్ఎఫ్ రైల్వే సీపీఆర్ఓ తెలినట్లు ఏఎన్ఐ వార్త సంస్థ వెల్లడించింది.

ఇప్పటివరకు ఏడుగురి మృతదేహాలను వెలికి తీశారని, ప్రమాదం నుంచి రక్షించినవారిని ఆస్పత్రికి తరలించారని నోనీ జిల్లా ఎస్‌డీఓ సోలమన్ ఎల్ ఫిమేట్ తెలిపినట్లు ఏఎన్ఐ పేర్కొంది. ఇంకా సుమారు 45 మంది కనిపించడం లేదని సమాచారం. టుపుల్‌లో పరిస్థితిని అంచనా వేయడానికి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ప్రమాదం జరిగిన ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్ తెలిపారు.

టుపుల్ రైల్వే స్టేషన్ దగ్గర కొండచర్యలు విరిగిపడిన ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ, మణిపూర్ సీఎం బీరేన్ సింగ్‌తో, కేంద్ర రైల్వే, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడానన్నారు.

ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాలుపంచుకుంటోందని, మరో రెండు బృందాలు టుపుల్‌కు వెళుతున్నాయని తెలిపారు.

 

1 comment:

  1. ఇంకా సుమారు 45 మంది కనిపించడం లేదని సమాచారం

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...