Friday 24 June 2022

 

జమ్మూకశ్మీర్ లో ప్రతిష్ఠాత్మక జీ 20 సదస్సు


G 20 Summit In Jammu and Kashmir : ప్రతిష్ఠాత్మక సదస్సుకు జమ్మూకశ్మీర్(Jammu and Kashmir) వేదిక కానుంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల సమూహం అయిన" G-20" సమావేశాలు 2023లో జమ్మూ కశ్మీర్‌లో జరగనున్నాయి. 2019 ఆగస్టులో జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసి, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో తొలి అంతర్జాతీయ శిఖరాగ్ర సమావేశం ఇదే. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న 19 దేశాలతో పాటు ఐరోపా సమాఖ్య(Europian Union)కు చెందినే దేశాల ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొంటారు.  ఈ నేపథ్యంలో సమావేశాల మొత్తం సమన్వయం కోసం కేంద్రం.. ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. జీ 20 సమ్మిట్ సక్సెస్‌ అయ్యేలా చూసుకునేందుకు జూన్ 4వ తేదీనే ఏర్పాటైన కమిటీకి జమ్మూకశ్మీర్ హౌసింగ్ మరియు అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మనోజ్ కుమార్ ద్వివేది చైర్మన్‌గా ఉంటారు. జీ 20 దేశాల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఈ సమ్మిట్ సక్సెస్‌ అయ్యేలా చూస్తానని వెల్లడించారు మనోజ్ కుమార్. ఈ కమిటీలో రవాణా శాఖకు చెందిన కమిషనర్ సెక్రటరీ, టూరిజం శాఖకు చెందిన అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, హాస్పిటాలిటీ విభాగానికి చెందిన అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, సాంస్కృతిక విభాగానికి చెందిన అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ సభ్యులుగా ఉన్నారు.

గతేడాది సెప్టెంబరులో, కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ G20 కోసంసమావేశానికి భారత ప్రతినిధిగా ఎంపికయ్యారు. ఈ ఏడాది జీ 20 సమావేశానికి భారత్ తరపున ఎవరు అధ్యక్షత వహిస్తారో డిసెంబర్ 1వ తేదీన నిర్ణయిస్తామని భారత విదేశాంగ మంత్రి వెల్లడించారు. జీ 20 సభ్యదేశాల్లో ఒకటి ప్రతి ఏటా డిసెంబర్‌లో సదస్సుకు అధ్యక్షత వహిస్తుంది. ఈ క్రమంలో భారత్‌కు జీ 20 అధ్యక్షత బాధ్యతలు ఈ ఏడాది డిసెంబర్‌ 1న లభిస్తాయి. డిసెంబరు 1, 2022 నుండి జి-20కి భారతదేశం అధ్యక్షత వహిస్తుందని, 2023లో తొలిసారిగా భారత్ G-20 నేతల శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. జమ్ము, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేసినప్పటి నుంచి ఆ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించింది కేంద్రం. అక్కడ పురోగతి సాధించేందుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పుడు ఇలాంటి అంతర్జాతీయ సమ్మిట్‌ను కశ్మీర్‌లో నిర్వహించటం ద్వారా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది.

ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక శక్తులు, అతి వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతల వార్షిక సమావేశమే జీ20 సదస్సు. ప్రపంచ జీడీపీలో 80 శాతం వాటా ఈ 20 సభ్యులదే. ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు ఈ 20 ప్రాంతాల్లోనే ఉంటారు. ఈ బృందానికి తనకంటూ శాశ్వత సిబ్బంది ఎవరూ ఉండరు. కాబట్టి ఈ బృందంలోని ఒక దేశం తమ ప్రాంతం వంతు వచ్చినపుడు.. ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో సదస్సుకు అధ్యక్షత వహిస్తుంది. తదుపరి శిఖరాగ్ర సదస్సును, చిన్న చిన్న సమావేశాలను నిర్వహించే బాధ్యతను ఆ దేశం స్వీకరిస్తుంది

No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...