Monday, 4 July 2022

 

 

హైదరాబాద్ బీజేపీ సభ బండి సంజయ్‌కు కలిసొచ్చేనా!!!

టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే విషయంలో బండి సంజయ్ దూకుడుగా ముందుకు సాగడం.. ఈ విషయంలో బీజేపీ శ్రేణుల్లో సైతం బండి సంజయ్ సరికొత్త ఉత్సాహం నింపడం కూడా ఆయనపై ఆ పార్టీ హైకమాండ్‌కు నమ్మకం పెరిగేలా చేసిందనే వాదన ఉంది.

తెలంగాణలో BJP దూకుడు కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ.. ఈసారి కచ్చితంగా తెలంగాణలో పాగా వేయాల్సిందేనని డిసైడయ్యింది. తెలంగాణలో బీజేపీ(BJP) బలపడుతుండటం.. ఆ పార్టీ కూడా రాజకీయ సందడి చేస్తుండటంతో.. కచ్చితంగా ఆ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని రాజకీయవర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. అయితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. ఆ పార్టీ తరపున ముఖ్యమంత్రి ఎవరవుతారా ? అంశంపై కూడా ఎప్పటికప్పుడు చర్చ జరుగుతోంది. ఈ రేసులో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముందున్నారనే వాదన ఉన్నా.. కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న కిషన్ రెడ్డి కూడా ఈ రేసులో ఉన్నారని మరికొందరు వాదిస్తున్నారు.

అయితే ఈ విషయంలో బీజేపీ హైకమాండ్ మద్దతు ఎవరికి ఉందనే దానిపై కూడా ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్నారు. గతంలో తుక్కుగూడలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆ పార్టీ ముఖ్యనేత అమిత్ షా(Amit Shah).. కేసీఆర్‌ను ఎదుర్కోవడానికి మోదీ(Narendra Modi) అవసరం లేదని.. ఇందుకు బండి సంజయ్ సరిపోతారని కామెంట్ చేశారు. దీంతో తెలంగాణలో కేసీఆర్‌కు పోటీగా బండి సంజయ్ మారతారనే చర్చ కూడా సాగింది. మరోవైపు తాజాగా హైదరాబాద్‌లో జరిగిన భారీ సభలోనూ నరేంద్రమోదీ, అమిత్ షా బండి సంజయ్‌కు జై కొట్టారనే ప్రచారం సాగుతోంది.

ఈ సభలో మీ అందరి ప్రియమైన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌అంటూ అమిత్ షా వ్యాఖ్యానించగా.. సభకు వచ్చిన స్పందనను చూసి ప్రధాని నరేంద్రమోదీ స్టేజ్ మీదే బండి సంజయ్‌ను భుజం తట్టి అభినందించడం అందరి దృష్టిని ఆకర్షించింది.  సభలో మాటల ద్వారా అమిత్ షా.. భుజం తట్టి ప్రోత్సహించడం ద్వారా ప్రధాని నరేంద్రమోదీ ఇద్దరూ తెలంగాణలో బండి సంజయ్‌ నాయకత్వానికి జై కొట్టారనే ప్రచారం బీజేపీలో సాగుతోంది. నిజానికి తెలంగాణలో బండి సంజయ్ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాతే పార్టీ అనేక విజయాలు సాధించింది.

దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మెరుగైన ఫలితాలు రావడం బండి సంజయ్‌కు బాగా కలిసొచ్చింది. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే విషయంలో బండి సంజయ్ దూకుడుగా ముందుకు సాగడం.. ఈ విషయంలో బీజేపీ శ్రేణుల్లో సైతం బండి సంజయ్ సరికొత్త ఉత్సాహం నింపడం కూడా ఆయనపై ఆ పార్టీ హైకమాండ్‌కు నమ్మకం పెరిగేలా చేసిందనే వాదన ఉంది. ఈ కారణంగానే ఆయనపై కొందరు పార్టీ నేతలు బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేస్తున్నా.. వాళ్లు మాత్రం బండి సంజయ్ నాయకత్వానికి పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నారని పలువురు భావిస్తున్నారు. మొత్తానిక హైదరాబాద్ బీజేపీ సభ బండి సంజయ్‌కు బాగా కలిసొచ్చిందనే చర్చ సాగుతోంది.

 

1 comment:

  1. తెలంగాణలో బండి సంజయ్ రాష్ట్ర పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాతే పార్టీ అనేక విజయాలు సాధించింది.

    దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మెరుగైన ఫలితాలు రావడం బండి సంజయ్‌కు బాగా కలిసొచ్చింది. టీఆర్ఎస్‌ను ఎదుర్కొనే విషయంలో బండి సంజయ్ దూకుడుగా ముందుకు సాగడం.. ఈ విషయంలో బీజేపీ శ్రేణుల్లో సైతం బండి సంజయ్ సరికొత్త ఉత్సాహం నింపడం కూడా ఆయనపై ఆ పార్టీ హైకమాండ్‌కు నమ్మకం పెరిగేలా చేసిందనే వాదన ఉంది. ఈ కారణంగానే ఆయనపై కొందరు పార్టీ నేతలు బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదు చేస్తున్నా.. వాళ్లు మాత్రం బండి సంజయ్ నాయకత్వానికి పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తున్నారని పలువురు భావిస్తున్నారు

    ReplyDelete

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...