Monday 4 July 2022

  

పేరు లేని రైల్వే స్టేషన్..



మన దేశంలో దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలంటే ప్రజల మొదటి ఎంపిక రైలు ప్రయాణం. అంతేకాదు,ఇండియన్ రైల్వే ఆసియాలో రెండవ అతిపెద్ద రైలు నెట్వర్క్. అత్యధిక ప్రభుత్వ ఉద్యోగులు కలిగిన మన ఇండియన్ రైల్వే ఆధునిక టెక్నాలజీని పరిచయం చేస్తూ నిత్యం ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. అలాంటిది సంవత్సరాలుగా రైల్వే స్టేషన్లో బోర్డుపై పేరులేకుండా ఓ స్టేషన్ కొనసాగుతుందంటే మీరు నమ్ముతారా? వినేందుకు ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ని

మన దేశంలో ఎనిమిది వేలకు పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. సాధారణంగా మనం రైలు ప్రయాణం చేయాలంటే టికెట్ బుక్ చేసుకోవాలి. అలా బుక్ చేసుకోవాలి అంటే ఎక్కే స్టేషన్ దిగే స్టేషన్ పేరు తెలియాలి. మరి స్టేషన్కు పేరే లేకపోతే ఎలా? ఇప్పుడు మనం, పశ్చిమ బెంగాల్లోని ఆద్రా రైల్వే డివిజన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే, ఈ డివిజన్లోనే మనం చెప్పకుంటోన్న పేరులేని రైల్వే స్టేషన్ ఉంది. బంకురా - మసాగ్రామ్ రైలు మార్గంలో ఉన్న ఈ స్టేషన్ రైనా, రైనగర్ అనే రెండు గ్రామాల మధ్య వస్తుంది. దీనిని 2008వ సంవత్సరంలో నిర్మించారు. ఈ స్టేషన్ ప్రారంభ రోజుల్లో రైనగర్ అని పిలువబడింది. కానీ రైనా గ్రామ ప్రజలు దీనిని వ్యతిరేకించారు.అందుకు కారణం లేకపోలేదు. ఆ స్టేషన్ భవనం ఉన్నది రైనా గ్రామంలోనే. దాంతో తమ గ్రామం పేరిట ఈ స్టేషన్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పటికే పెట్టిన పేరును ఎలా తొలగిస్తారని రైనగర్ వాసులు వాదనకు దిగారు. ఈ కారణంగా రెండు గ్రామాల ప్రజల మధ్య పెద్ద రణరంగమే జరిగింది. ఈ విషయం రైల్వే బోర్డుకు చేరింది. వివాదాన్ని పరిష్కరించడానికి, రైల్వే స్టేషన్ బోర్డు నుండి స్టేషన్ పేరును తొలగించారు అధికారులు. అప్పటినుంచి వివాదం కొనసాగుతుండడంతో స్టేషన్ పేరు లేకుండానే స్టేషన్ను కొనసాగిస్తున్నారు

అయితే, రైల్వే శాఖ ఇప్పటికీ దాని పాత పేరు రైనగర్ పేరుమీదనే ప్రయాణీకులకు టిక్కెట్లను జారీ చేస్తుంది. ఈ రైలు మార్గాన్ని గతంలో బంకురా- దామోదర్ రైల్వే మార్గంగా పిలిచేవారు. తర్వాత ఇది హౌరా- బర్దమాన్ మార్గానికి అనుసంధానించబడింది. ఈ స్టేషన్లో బంకురా- మసగ్రామ్ ప్యాసింజర్ రైలు మాత్రమే రోజుకు ఆరుసార్లు ఆగుతుంది. స్థానిక గ్రామాలవారి సౌకర్యార్థమే కాబట్టి ఎవరికి నచ్చిన పేరుతో వారు పిలుస్తారు. ఇక కిలోమీటర్ లెక్కన టికెట్ ఇస్తారు. దీనివల్ల వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. పేరు లేకపోవడం వల్ల ప్రయాణీకులు దాని గురించి ఇతర వ్యక్తులను అడిగి తెలుసుకోవాల్సి ఉంటుంది.


No comments:

Post a Comment

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...