Tuesday 5 July 2022

 

వినియోగదారుల నుంచి సర్వీస్‌ ఛార్జీని వసూలు చేయకూడదు..


హోటళ్లు, రెస్టారెంట్‌లలో ఫుడ్‌ బిల్‌లో సర్వీస్‌ ఛార్జీ విధించడం సరికాదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బిల్లు‌లో సర్వీస్‌ ఛార్జీ యాడ్‌ చేస్తే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని పేర్కొంది

హోటళ్లు, రెస్టారెంట్‌లలో ఫుడ్‌ బిల్‌ (Food Bill)లో సర్వీస్‌ ఛార్జీ (Service Charge) విధించడం సరికాదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. బిల్లు‌లో సర్వీస్‌ ఛార్జీ యాడ్‌ చేస్తే వినియోగదారులు ఫిర్యాదు చేయాలని పేర్కొంది. అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నిరోధించడానికి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) సోమవారం మార్గదర్శకాలను జారీ చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీల (Service Charge) విధింపునకు సంబంధించి వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఈ చర్యలు తీసుకుంది. వినియోగదారులు హోటళ్లు, రెస్టారెంట్లపై ఫిర్యాదు చేసేందుకు 1915 నంబర్‌కు కాల్ చేయవచ్చని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

2020 జులైలో వినియోగదారుల రక్షణ చట్టం, 2019 కింద వినియోగదారుల హక్కులను ప్రోత్సహించడానికి, రక్షించడానికి, అమలు చేయడానికి, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి CCPAని తీసుకొచ్చారు. రెస్టారెంట్లు, హోటళ్ల ద్వారా సర్వీస్ ఛార్జీ విధించడానికి సంబంధించి ఐదు ప్రధాన మార్గదర్శకాలను CCPA జారీ చేసింది. అవేంటంటే..

ఏ హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లులో ఆటోమేటిక్‌గా లేదా డిఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జీని జోడించకూడదు.

- ఏ ఇతర పేరుతో వినియోగదారుల నుంచి సర్వీస్‌ ఛార్జీని వసూలు చేయకూడదు.

- ఏ హోటల్ లేదా రెస్టారెంట్ వినియోగదారుని సర్వీస్ ఛార్జీని చెల్లించమని బలవంతం చేయకూడదు, సర్వీస్ ఛార్జీని వినియోగదారులు స్వచ్ఛందంగా అందిస్తేనే తీసుకోవాలి.

 సర్వీస్‌ ఛార్జీ వసూలు ఆధారంగా సేవల ప్రవేశం లేదా సదుపాయంపై ఎటువంటి పరిమితి విధించకూడదు

- ఫుడ్‌ బిల్‌తో కలిపి సర్వీస్‌ ఛార్జీని వసూలు చేయకూడదు.. ఈ మొత్తానికి GST కూడా విధించకూడదు

వినియోగదారుడు తన బిల్లులో సర్వీస్ ఛార్జ్ లెవీని గుర్తిస్తే.. ముందుగా, బిల్లు నుంచి సర్వీస్ ఛార్జీని తీసివేయమని హోటల్ లేదా రెస్టారెంట్‌కి సూచించవచ్చు. లేదా నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్ (NCH)లో ఫిర్యాదు చేయవచ్చు. 1915 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా NCH Mobile యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అదే విధంగా వినియోగదారు కమిషన్‌కు లేదా edaakhil పోర్టల్, http://www.edaakhil.nic.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదా CCPA ద్వారా విచారణ, తదుపరి చర్యల కోసం సంబంధిత జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదును చేసే అవకాశం ఉంది. com-ccpa@nic.inకి ఇమెయిల్ పంపడం ద్వారా CCPAకి ఫిర్యాదు చేయవచ్చు CCPA ముందుగా వినియోగదారులను అడగకుండా లేదా తెలియజేయకుండా డిఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జ్ విధించే రెస్టారెంట్లు, హోటళ్లకు సంబంధించిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంది. జూన్ 2, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వినియోగదారుల వ్యవహారాల విభాగం, హోటల్‌లు, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీల విధింపుపై రెస్టారెంట్ అసోసియేషన్లు, వినియోగదారుల సంస్థలతో సమావేశాన్ని నిర్వహించింది. సమావేశం తరువాత, సర్వీస్‌ ఛార్జీ విధించడాన్ని నిషేధించిన 2017 మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని పేర్కొంది. ఒక రోజు తర్వాత, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఛార్జీలు చెల్లించమని రెస్టారెంట్లు వినియోగదారులను అడగలేవని, ఇలా చేస్తే అసలు ధర ఏమిటో ప్రజలకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు

3 comments:

  1. 1915 నంబర్‌కు కాల్ చేయడం ద్వారా లేదా NCH మొబైల్ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అదే విధంగా వినియోగదారు కమిషన్‌కు లేదా edaakhil పోర్టల్, http://www.edaakhil.nic.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదా CCPA ద్వారా విచారణ, తదుపరి చర్యల కోసం సంబంధిత జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదును చేసే అవకాశం ఉంది. com-ccpa@nic.inకి ఇమెయిల్ పంపడం ద్వారా CCPAకి ఫిర్యాదు చేయవచ్చు CCPA ముందుగా వినియోగదారులను అడగకుండా లేదా తెలియజేయకుండా డిఫాల్ట్‌గా సర్వీస్ ఛార్జ్ విధించే రెస్టారెంట్లు, హోటళ్లకు సంబంధించిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుంది.

    ReplyDelete
  2. ee mdaya naaku kuda elanti gatane edurayendi

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...