Tuesday, 24 September 2024

 

పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హుసేని ఆలం.





 

విద్యార్థి, విద్యార్థినిలు  కోరుకునే ఏదైనా పోటీ పరీక్షలో అర్హత సాధించడానికి, పరీక్షల ప్రిపరేషన్ వ్యూహం, సిలబస్, ముఖ్యమైన అంశాలు మరియు మూల్యాంకనంతో పాటు దేశంలో నిర్వహించబడే పోటీ పరీక్షల తయారీ కోసం పుస్తకాల జాబితా

ముందుకు సాగడానికి మరియు పరీక్షను విజయవంతంగా ఛేదించడానికి ప్రిపరేషన్ మరియు చిట్కాల గురించి సరైన విధానం గురించి మరింత తెలుసుకోవడానికి పిల్లలకు అవగాహనా కలిపించటం కోసం శ్రీధర్ కాలేజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, హుస్సేన్ ఆలం, డిపార్ట్మెంట్ అఫ్ కామర్స్ వారి ఆధ్వర్యంలో లో నిర్వహించారు, ఈ కార్యక్రమంలో Sreedhar 's College For Competitive వీరాస్వామి గారు మాట్లాడుతూ పరీక్షల ప్రిపరేషన్ వ్యూహం, సిలబస్, ముఖ్యమైన అంశాల గురించి అవగహన కలిపించారు, ఈ కార్యక్రమంలో, కళాశాల ప్రిన్సిపాల్, అప్పయ చిన్నమ్మ, డిపార్ట్మెంట్ అఫ్ కామర్స్ HOD డా.పి మంజుల, డా. ప్రసన్న డా. అనిత మెంగా, అరుణ తదితరులు పాల్గొన్నారు.



 

24 లక్షల జీతంతో ఉద్యోగం.. అదరగొట్టిన జేఎన్‌టీయూ హైదరాబాద్ విద్యార్థులు!

విద్యార్థులు అదరగొట్టేశారు. జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTU) హైదరాబాద్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ రిక్రూట్‌మెంట్ జరిగింది. ఇందులో ఇద్దరు స్టూడెంట్స్ భారీ వేతనంతో జాబ్ సాధించారు. మోటూరి అమూల్య, చల్లా సాయి మహిత రెడ్డి అనే ఇద్దరు విద్యార్థులు దుమ్ముదులిపారు. అత్యధిక వార్షిక ప్యాకేజీ రూ. 24 లక్షలతో గోల్డ్‌మన్ సాక్స్ నుండి జాబ్ ఆఫర్‌లను పొందారు.

JP మోర్గాన్ అండ్ చేజ్ నుండి కాంతు కుసుమిత సంవత్సరానికి రూ. 19.75 లక్షల జాబ్ ఆఫర్‌ను పొందగా, వెరిస్క్ అనలిటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంవత్సరానికి రూ. 17 లక్షల CTCతో నందినీ మహారాజ్‌కి జాబ్ ఆఫర్‌ను అందించింది.

క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఇప్పటివరకు 130 మంది విద్యార్థులు వివిధ కంపెనీల నుండి ఉద్యోగ ఆఫర్‌లను పొందారు. ఫ్రెంచ్ బహుళజాతి జాతీయ కంపెనీ అయిన ఆల్‌స్టోమ్ ఎస్‌ఏ రూ. 8.5 లక్షల వార్షిక ప్యాకేజీతో 33 మంది పీజీ విద్యార్థులను ఎంపిక చేయగా, మరో కంపెనీ హనీవెల్ 15 మంది విద్యార్థులకు ఏడాదికి రూ. 9 లక్షల సీటీసీతో ఉద్యోగాలు ఇచ్చిందని జేఎన్‌టీయూ-హైదరాబాద్ తెలిపింది.

అదేవిధంగా అమెగ్రేడ్ రూ. 6 లక్షల వార్షిక ప్యాకేజీతో ఎనిమిది మంది విద్యార్థులకు ఆఫర్‌లను అందించింది. ఇంకా ఎడిగ్లోబ్ అనే సంస్థ 40 మంది విద్యార్థులను సంవత్సరానికి రూ. 5 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు ప్యాకేజీని అందజేస్తున్నట్లు తెలిపింది. యూనివర్శిటీ రెక్టార్ డాక్టర్ కె విజయ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు వివిధ కంపెనీల నుండి ఉద్యోగ ఆఫర్లు అందుకోవడం పట్ల విద్యార్థులను అభినందించారు

 


Wednesday, 11 September 2024

మహా అన్నదాన కార్యక్రమం.

శ్రీ సిద్ది వినాయక ఫ్యామిలీ అసోషియన్  




అన్నం పరబ్రహ్మ స్వరూపం"


శ్రీ సిద్ది వినాయక ఫ్యామిలీ అసోసియన్ ఆధ్వర్యంలో, సనత్ నగర్, సుభాష్ నగర్ నందు 12-09-2024, సాయంత్రం 7:00గం" నుండి మహా అన్నదాన కార్యక్రమం కలదు. ప్రతి ఒక్కరు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి అన్న ప్రసాదం స్వీకరించి శ్రీ గణేశ్ మహరాజ్ ఆశీస్సులు పొందవలసినదిగా కోరుతున్నాము.

అందరూ ఆహ్వానితులే.

ఇట్లు

శ్రీ సిద్ది వినాయక ఫ్యామిలీ అసోషియన్, సనత్ నగర్

Monday, 17 June 2024

 సమస్యల పరిష్కారం కోరుతూ, మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించిన :  సాయి కృష్ణజ హిల్స్   కమిటీ సబ్యులు.






మియాపూర్, బాచూపల్లి పరిధిలోని   సాయి కృష్ణజ హిల్స్   సమస్యల పరిష్కారం కోరుతూ, మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించిన

 సాయి కృష్ణజ హిల్స్, కాలనిలో సరిగా రోడ్లు లేవు, అలాగే దోమల బెడద ఎక్కువగా ఉంది, ఈ కాలనిలో ఉన్న దాదాపు వెయ్యి మంది వివిధ రంగాలకు చెందినవారు ఉన్నారు, ఫార్మా, సాఫ్ట్వేర్, బిసినెస్, ఇలా అన్నిరకాల వ్యక్తులు ఉన్నారు, కాలనిలో దాదాపు 5 సంవత్సరాల నుండి కమిషనర్ గారిని కలిసి విన్నవించినా ఫలితం లేదు, దాదాపు 800 మంది పిల్లలు, 100 మంది వృద్ధులు ఉండే కాలనిలో కనీస సౌకర్యాలు లేవు, ఉదాహరణకు రోడ్లు లేవు ఈ.మధ్య చాలామంది పిల్లలకు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇక్కడ కాలనీ వాసులు సంవత్సరానికి దాదాపు కోటి రూపాయల ఆస్తి పన్నులు కడుతున్నాం అయిన మా సమస్యలు పరిష్కరాం కావటం లేదు అని ఈ రోజు కమిషనర్ గారిని కలిసి వినతిపత్రం సమర్పించటం జరిగింది, వారు స్పందించి 10 వ తేది వరకు అధికారులును పంపించి పరిస్థితులు చూసి త్వరితగతిన రోడ్లు వేస్తాం అని చెప్పటం జరిగింది.. ఈ కార్యక్రమంలో.. కమిటీ సబ్యులు..బాల మురళి కృష్ణ, రాజేష్, భాను ప్రసాద్, విజయ్ భాస్కర్, హరీష్,సత్యనారాయణ, రవి కుమార్, నాగ శ్రీనివాస్,  తదితరులు పాల్గొన్నారు

Tuesday, 16 April 2024

 

            కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి






శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్రీకృష్ణుడు ఇక్కడ వేణుగోపాలుడిగా స్వయంభువుడు. ఆయన తన భక్తుల కోర్కెలు తీర్చటమేకాదు, వారి దీర్ఘ రోగాలను నయం చేస్తాడని ప్రసిధ్ధి.

ఈ స్ధల పురాణం ఏమిటంటే 1953 సంవత్సరంలో ఈ గ్రామములో శ్రీ వనమా సీతారామయ్యగారు అనే షావుకారు తన పొలములోకి సారవంతమైన మట్టి కావాల్సివచ్చి శ్రీ దారా నర్సయ్యగారి పొలం నుండి కొనుగోలు చేశారు. తన పాలేరు శ్రీ కఠారు వెంకటేశ్వర్లు గారిచే మట్టి తవ్వించబోయారు. మొదటిసారి గడ్డపలుగు వేసిన వెంటనే ఖంగుమని ధ్వని వచ్చిందట. ఎందుకు అలా ధ్వని వస్తోందో అర్థం కాక కొంచెం పక్కనే మళ్ళీ పలుగు వెయ్యగా మళ్ళీ అదే ధ్వని వచ్చిందట. మళ్ళీ పలుగు వెయ్యబోగా ఆ ప్రదేశంనుండి బ్రహ్మాండమైన మిరుమిట్లతో ఒక మెరుపు మెరిసిందట. ఆ కాంతి తీవ్రతకు శ్రీ కఠారు వెంకటేశ్వర్లు మూర్ఛపోయారుట. అది చూసిన మిగతా పనివాళ్ళు ఆందోళనతో అతని ముఖముపై చల్లని నీరు చల్లి కొంచెంసేపు ఉపచర్యలు చేయగా అతడు కొంచెం తేరుకుని తనకేమీ కన్పించటంలేదని అన్నారుట. అపుడు మిగిలినవారంతా కలిసి ఆ ప్రాంతములో నెమ్మదిగా తవ్వి చూడగా ఒక విగ్రహము, దానిదగ్గరే ప్రాచీన శంఖము, పాచిక లభ్యమయ్యాయి. కొందరు వెళ్ళి పొలము యజమానికి, ఊరి పెద్దలకు ఈ విషయము చెప్పారు.

 

ఈ దేవాలయంలో వున్న బావి దగ్గర స్నానం చేసి తడి బట్టలతో స్వామికి ప్రదక్షణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా దీర్ఘ వ్యాధులు తగ్గుతాయని చాలామంది నమ్ముతారు. దీర్ఘ వ్యాధులతో బాధపడేవారు వ్యాధి నివారణకోసం ఒక మండలం రోజులపాటు ఇక్కడ స్వామిని సేవిస్తూ, గుళ్ళో నిద్రిస్తారు.

ఇవండీ నెమలి విశేషాలు. అన్నట్లు స్వామిని దర్శించేటప్పుడు పూజారిగారిని అడగండి, స్వామి దగ్గరే వున్న శంఖం, పాచిక చూపిస్తారు. అదేనండీ స్వామితోబాటు దొరికినవి. మేము ముందు తెలియక పాచికను చూడలేదు. మీరు మర్చిపోవద్దు. మరి బయల్దేరుతున్నారా? ఎలా వెళ్ళాలంటే

 

ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలిలో అత్యంత ప్రసిద్ధి పొందిన దేవాలయాల్లో వేణుగోపాల స్వామి ఆలయం ఒకటి. ఇక్కడి వేణుగోపాల స్వామి స్వయంభువుగా చెప్తారు. ఒకసారి సీతారామయ్య కొత్తగా కొనుగోలు చేసిన ఇంటిలో మట్టికావాల్సి తమ పనివానికి పెరట్లో కాస్త తవ్వి మట్టి తీసుకొని రమ్మని చెప్పాడు. ఆ నౌఖరు మట్టి తవ్వుతుండగా భూమిలోంచి పిల్లన గ్రోవి ని పట్టుకొన్న స్వామివిగ్రహం పారకు తగిలిందట. ఏమిటో అని పైకి తీయగా పిల్లనగ్రోవి పట్టుకొన్న చేతిలోని చిటికెన వేలు కొద్దిగా తెగిందట. ఆ సంగతి సీతారామయ్యకు చెప్పగా ఆయన ఎంతో పారవశ్యం చెందాడు. ఆ శ్రీకృష్ణుడే మనలను ఉద్ధరించడానికి ఏతెంచాడు అని వానితో చెప్పాడు. వెంటనే స్వామి ని తెలియక చేసిన తప్పును మన్నించమని పదేపదే వేడుకున్నాడు. వెంటనే వెండి పనిచేసే వానిని పిలిచి స్వామి మూర్తికి తగిలిన గాయాన్ని మాన్చమని చెప్పి చేయించారట. స్వామి తమ ఇంట వెలిశారని ఊరందరికి తెలియచేశారట. వెంటనే తాటాకు పందిరి వేసి ఆ పందిరి మహోన్నతమైన దేవాలయంగా భావించమని వేడుకుంటూ అక్కడే వేణుగోపాల స్వామిని ప్రతిష్టించారట. ఇక ఆనాటి నుంచి వారికి కాలం కలసి వచ్చింది. ఆ తరువాత ఊరందరూ స్వామిని చూచి ఆనందంపొంది తమ తమకు కావాల్సిన కోరికలను కోరుకున్నారట. వారందరి కోరికలను స్వామి తీరుస్తూ వచ్చారట. దాంతో స్వామికి ఆనాడు వేసిన తాటాకు పందిరి స్థానంలో చక్కని దేవాలయ నిర్మాణం చేశారు. సంతానార్థులు వచ్చి వేడుకుంటే స్వామి దయవల్ల వారికి సంతానం కలుగుతోందట. ధనార్థులు వచ్చి స్వామిని వేడుకుంటే వారు ధనవంతులు కాగలుగుతున్నారట. విద్యార్థులు వచ్చి తమకు జ్ఞానాన్ని ఇవ్వమని వేడుకుంటే వారి చదువులో అభ్యుదయాన్ని పొందుతున్నారట. ఇలా స్వామిని ఏది కోరుకుంటే దానే్న సునాయాసంగా ఇచ్చే దేవదేవునిగా వేణుగోపాల స్వామిని ఇక్కడి భక్తులు కొనియాడుతుంటారు. ద్వాపరయుగంలో స్వామి దుష్టులను సంహరించి శిష్టులను కాపాడినట్లే ఈ కలియుగంలోకూడా స్వామి దుష్టులను దునుమాడుతూనే శిష్టులను తన భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. స్వామి కరుణామృతాన్ని గ్రోలాలని చుట్టుపక్కల ఊర్లనుంచే కాక ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి స్వామిని సేవిస్తుంటారిక్కడ.స్వామి మహిమలు ఇన్ని అన్నిఅని చెప్పలేనన్ని ఉన్నాయని స్వామి మహిమ అనుభవైకవేద్యం కావాలి కాని దాన్ని వర్ణించడానికి ఈ మనుజులకు సాధ్యం కాదని ఈ కృష్ణ్భక్తులు అంటున్నారు. కృష్ణాష్టమి నాడు అంగరంగ వైభోగంగా వేణుగోపాలస్వామికి జన్మాష్టమిని భక్తులు ప్రతిఏటా జరిపిస్తారట. అట్లానే దసరా నాడు పాండవులకు చేదోడు వాదోడు ఉంటూ వారిని కంటికి రెప్పలా కాపాడి వారిని కురుక్షేత్ర యుద్ధరంగంలో అజేయులుగా నిలబెట్టిన వైనాన్ని పురస్కరించుకుని స్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళినాడు లోకకంటకుడైన నరకుని సంహరించిన శ్రీకృష్ణుణ్ణి స్మరించుకుంటూ దీపావళి పండుగనాడు వేణుగోపాల స్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు. అట్లానే ప్రతి పండుగ నాడు కూడా వేణుగోపాల స్వామికి ప్రత్యేక అలంకరణలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం ఈ నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో అనాదిగా వస్తోంది.భక్తుల ఇచ్చిన విరాళాలతో స్వామికోసం రాజగోపురాలు నిర్మించినట్లుగానే స్వామి సన్నిధిలో భోజనశాలను, వైద్యశాలను, పొంగళ్లశాలను, కల్యాణ మంటపం, కల్యాణకట్ట, అద్దాల మండపం, విశ్రాంతి మందిరం లాంటివాటిని నిర్మించారు. ఇంకా నిత్యాన్నదానం ఏర్పాట్లను కూడా చేయాలని దేవాలయ అధికారులు ఆలోచిస్తూ న్నారు. ఇపుడుమాత్రం విశేషదినాల్లో అన్నదానాన్ని చేస్తున్నారు. స్వామి సన్నిధిలో తమ పిల్లలకు అన్న ప్రాసలు జరిపిస్తే వారు ఆరోగ్యంగా ఎదుగుతారనే నమ్మకం భక్తులకు ఉన్నట్లు చెబుతారు. స్వామి సన్నిధిలో వివాహాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక్కడ వివాహం చేసుకొనేవారు నిత్య సంతోషులుగా ఉంటారనీ అంటారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాటినుంచి స్వామికి బ్రహ్మోత్సవాలను కూడా జరిపిస్తారు. రుక్మిణీ, సత్యభామా సమేత వేణుగోపాల స్వామికి కల్యాణోత్సవం కనుల పండుగగా జరుగుతుంది. స్నేహితులతో ఆడిపాడిన కృష్ణస్వామిని, గోపికల మానసచోరుడి లీలలను కొనియాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలను జరిపిస్తారు. అటు సాంఘిక, పౌరాణిక నాటకాలను వేస్తూ కృష్ణ్భక్తిని ప్రచారం చేస్తున్నారు ఈ కృష్ణ్భక్తులు. నెమలి వేణుగోపాల స్వామి దర్శించిన వారికి తీరని కోరిక అంటూ ఏమీ ఉండదని ఇక్కడి స్థానికుల కథనం. ఈ నెమలి వేణుగోపాల స్వామి దర్శనానికి వెళ్లాలనుకొన్న భక్తులు ఖమ్మం విజయవాడ మార్గంలో ఉన్న మథిర కు వచ్చి అక్కడినుంచి బస్సులలో నెమలి గ్రామానికి చేరుకోవచ్చు.

 

ఆలయం తెరచి వుంచు వేళలు

సోమ, శుక్రవారాలలో ఉదయం అభిషేకం జరుగుతుంది. దీనిలో పాల్గొనదలిస్తే ముందు రోజు రాత్రే అక్కడ వుండటం మంచిది. ఈ రెండు రోజులూ గుడి ఉదయం 6 గంటల నుంచీ మధ్యాహ్నం 2 గంటల దాకా తిరిగి సాయంత్రం 3 గంటల నుంచీ దాత్రి 9 గంటల దాకా.

మిగతా రోజుల్లో ఉదయం 6 గంటల నుంచీ మధ్యాహ్నం 1 గంట దాకా మళ్ళీ సాయంకాలం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా తెరచి వుంటుంది

 

ఆఫీసు ఫోన్ నెంబర్లు 08673 – 288808, 08673—288633

గోపాలరావు (గదులు అద్దెకిచ్చే వ్యక్తి) 9440269156.

 

 

Wednesday, 10 April 2024

 

కామధేనువు సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ వితరణ 




శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా.. స్థానిక హనుమాన్ దేవాలయంలో పంచాంగ శ్రావణ కార్యక్రమంలో భాగంగా అక్కడికి వచ్చిన భక్తులకు అందరికి కామధేనువు సేవాసమితి ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ వితరణ చేయటం జరిగింది. సమితి సెక్రటరీ గారు మాట్లాడుతూ.. మేము అందరం కలిసి హనుమాన్ దేవాలయ ప్రాంగణంలో ఉన్న గోశాలలో సేవా కార్యక్రమాలు చేస్తుంటాము, అదేవిధంగా కరోనా సమయంలో కొన్ని వేలమంది కి ఉచిత ఆహారం, నీరు అందివ్వటం జరిగింది, ఆకలితో బాధపడే వారికి ఎదో మా సహాయముగా సేవ చేస్తూ ఉంటాము, ఆదేవింగా ఎర్రగడ్డ మానసిక వైద్యశాలలో, ఈ ఎస్ ఐ హాస్పిటల్ కూడా ప్రతి రోగులకు మరియు వారి సహాయకులకు ఉచిత భోజనం ఏర్పాటు చేస్తుంటం అని సెక్రటరీ బాల మురళి కృష్ణ గారు తెలియచేసారు. ఈ రోజు తెలుగు నూతన సంవత్సరo సందర్భంగా మజ్జిగ వితరణ చేయటం జరిగింది అని సభ్యలు. తులసి కుమార్, దేవేందర్ కొన్నే, విగ్నేష్, వేణు, వెంకటేష్, బాలమురళి కృష్ణ, రవి కుమార్, సూర్యప్రకాష్. జి. వి ఎస్ ప్రకాష్ గారు, మోహన్, రవి,  రఘు..  తెలిపారు  








 

Saturday, 16 December 2023

మహా అన్నదాన కార్యక్రమం. కామధేనువు సేవాసమితి అద్వర్యంలో


 మహా అన్నదాన కార్యక్రమం.

కామధేనువు సేవాసమితి ఆధ్వర్యంలో

శ్రీహనుమాన్ దేవాలయం



 సనత్ నగర్  హైదరాబాద్ , ప్రాంగణంలో ఉన్న గోశాల నందు.. కుబేరుడు అనే(ఒంగోలు ఎద్దు) గోశాలలో ఒక మహా నంది లాగా ఉన్నటువంటి. దానికి ఈ మధ్య కాలంలో కొంత అనారోగ్యం వలన శివైక్యం చెందటం జరిగింది.. ఆ కుబేరుడి ని చిన్నప్పటి నుంచి పోషించే, అక్కడ ప్రతి రోజు సేవ చేసే భక్తులు, కుబేరుడి యొక్క మరణాన్ని తట్టుకోలేక పోయారు. చాలా చిన్నతనం నుంచి మేము చేసుకున్నాం అని..దాని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కర్మ కాండలు కూడా చేశారు, అలాగే ఈ.రోజు. ఆదివారం.17.12.23. దాని పేరుతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని కామధేనువు సేవాసమితి సభ్యులు. అన్నదాన కార్యక్రమం చేపట్టారు, అందరూ ఆహ్వానితులే అని చెప్పారు

  పోటీ పరీక్షల కోసం అవగాహనా కార్యక్రమం.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల , హుసేని ఆలం.   విద్యార్థి , విద్యార్థినిలు   కోరుకునే ఏదైనా పోటీ పరీక్ష...