Monday 20 June 2022

 బి ఆర్ ఎస్(భారత్ రాష్ట్రీయ సమితి) ద్వారా  దక్షిణాది రాష్ట్రాలపై ప్రధానంగా సీఎం కేసీఆర్ ఫోకస్ చేయనున్నారా?



తెలంగాణ సీఎం, టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భారత్ రాష్ట్రీయ సమితి ఏర్పాటుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా? దక్షిణాది రాష్ట్రాలపై ప్రధానంగా సీఎం కేసీఆర్ ఫోకస్ చేయనున్నారా? దక్షిణాది రాష్ట్రాలకు జరిగిన అన్యాయం పై పోరాటం చేయడానికి కెసిఆర్ విస్తృత ప్రాంతీయ వాదాన్ని అస్త్రంగా ఎంచుకోనున్నారా? అంటే అవును అన్న సమాధానమే వస్తుంది. ప్రాంతీయ వాదంతో తెలంగాణాలో పాగా వేసిన టీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేశారు. కెసిఆర్ రగిల్చిన పోరాట పటిమతో తెలంగాణ ప్రజానీకం మొత్తం సకల జనుల సమ్మె చేసి, కేంద్రంలోని అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చింది. ఎంతోమంది తెలంగాణ యువకులు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానాలు చేసుకొని అమరులయ్యారు. దీంతో కేంద్రం దిగిరాక తప్పలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించక తప్పలేదు. ఇక తెలంగాణ సెంటిమెంటుతో పోరాటం చేసిన కెసిఆర్ కు ప్రజలు పట్టం కట్టారు. గత రెండు దఫాలుగా టిఆర్ఎస్ పార్టీకే అధికారాన్ని కట్టబెట్టి తమ ప్రాంతీయ అభిమానాన్ని చాటుకున్నారు


ఇదిలా ఉంటే తెలంగాణలో లోకల్ మార్కుతో అధికారం చేపట్టిన టిఆర్ఎస్ పార్టీ, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. దీని కోసం సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషించాలని భావిస్తున్న కేసీఆర్ ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్నారు.

దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, దక్షిణాది రాష్ట్రాలకు మోడీ పాలనలో తీవ్ర అన్యాయం జరుగుతుందని కెసిఆర్ తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాలలో బలంగా బాగా వేయగలిగితే మోడీ సర్కార్ కు చెక్ పెట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్న కేసీఆర్ ఈ క్రమంలోనే దక్షిణాది రాష్ట్రాల స్థితిగతులపై అధ్యయనం చేశారు. ఇక విస్తృత ప్రాంతీయ వాదం ఫార్ములాతో కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు.


తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి పెద్దఎత్తున నిధులు సమకూరుస్తున్నా, కేంద్రం నుండి అదేస్థాయిలో దక్షిణాది రాష్ట్రాలకు సహకారం అందడం లేదని సీఎం కేసీఆర్ దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం పై ఫోకస్ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కెసిఆర్ ఏర్పాటు చేయనున్న భారత్ రాష్ట్రీయ సమితి బి ఆర్ ఎస్ ను ముందుగా ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలలోనే విస్తరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు సాధించిన తర్వాత క్రమంగా ఉత్తరాది రాష్ట్రాలలోను పార్టీ విస్తరణకు దృష్టి సారించాలని కెసిఆర్ భావిస్తున్నట్లు సమాచారం.


మొదటగా ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో పార్టీ విస్తరణపై ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. వచ్చే వారం అధికారికంగా ప్రకటించనున్న బీఆర్ఎస్ పార్టీకి దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం నేపథ్యంలో విస్తృత ప్రాంతీయ వాదం కీలకమైన ఫార్ములాగా కెసిఆర్ రంగంలోకి దిగబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ప్రాంతీయ వాద పార్టీగా ప్రజల్లోకి వెళ్లిన టిఆర్ఎస్ పార్టీ, జాతీయ రాజకీయాలలోను అనూహ్యంగా విస్తృత ప్రాంతీయ వాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించడం కెసిఆర్ మార్కు రాజకీయాలకు అద్దం పడుతుంది. మరి ఈ ప్రయత్నం లో కేసీఆర్ ఎంత మేరకు సక్సెస్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.

ఈ నేప‌థ్యంలో కేసీఆర్‌తో సీనియ‌ర్ రాజ‌కీయ నేత ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ భేటీ కావ‌డం కీల‌క ప‌రిణామంగా చెప్పొచ్చు. ఏపీ విష‌యంలో బీజేపీ తీవ్ర‌మైన ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంబిస్తోంద‌నే ఆవేద‌న వుంది. అయితే మోదీ స‌ర్కార్ ఏపీ వ్య‌తిరేక విధానాల‌ను ప్ర‌శ్నించే పార్టీలు ఏపీలో కొర‌వ‌డ‌డం తీవ్ర నిరాశ క‌లిగించే అంశం. ఏపీ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ బీజేపీకి వంత‌పాడుతున్నాయి.

వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన పార్టీలు మోదీ విశ్వాస పార్టీలుగా చెలామ‌ణి అవుతున్నాయి. దీంతో మోదీని గ‌ట్టిగా నిల‌దీసే పార్టీకి మ‌ద్ద‌తు తెలిపే వివిధ ప్ర‌జాసంఘాల నాయ‌కులు, మేధావులు త‌క్కువేం కాదు. అందుకే ఏపీలో కేసీఆర్ జాతీయ పార్టీలో చేరేందుకు కొంద‌రు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. 

అలాంటి వారిలో ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌, ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌, కోస్తా ప్రాంతాలకు చెందిన నేత‌లున్నార‌ని స‌మాచారం. అయితే పూర్తిగా పార్టీ విధివిధానాలు వెల్ల‌డైన త‌ర్వాతే చేరిక‌లుంటాయ‌ని స‌మాచారం. మొత్తానికి మ‌రో రాజ‌కీయ వేదిక మాత్రం తెరపైకి రానుంది

1 comment:

  1. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలు పన్నుల రూపంలో కేంద్రానికి పెద్దఎత్తున నిధులు సమకూరుస్తున్నా, కేంద్రం నుండి అదేస్థాయిలో దక్షిణాది రాష్ట్రాలకు సహకారం అందడం లేదని సీఎం కేసీఆర్ దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం పై ఫోకస్ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కెసిఆర్ ఏర్పాటు చేయనున్న భారత్ రాష్ట్రీయ సమితి బి ఆర్ ఎస్ ను ముందుగా ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలలోనే విస్తరించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

    ReplyDelete

               కోరిన వరాలిచ్చే నెమలి వేణుగోపాలస్వామి శ్రీ వేణుగోపాలస్వామికి నిలయమైన ఈ గ్రామం గురించి చాలా తక్కువమందికి తెలిసి వుండవచ్చు. శ్ర...